ఉద్యోగాలు

29 Oct, 2014 04:59 IST|Sakshi

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సైంటిఫిక్ ఆఫీసర్: 1
అర్హతలు: 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ లేదా 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్‌లో పీజీ ఉండాలి. ఒకటి నుంచి రెండేళ్ల అనుభవం అవసరం.
ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ (బి): 1
అర్హతలు: పదోతరగతితో పాటు ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్ సైన్స్‌లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉండాలి. రెండేళ్ల అనుభవంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 22
వెబ్‌సైట్: www.tifrh.res.in
 
 
వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ
తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్: 1
అర్హతలు: అగ్రికల్చర్/ హార్టికల్చర్/ యానిమల్ సెన్సైస్/ ఫిషరీస్‌లో డాక్టోరల్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్: 12
విభాగాలు: అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, ఎంటమాలజీ, ఫిషరీస్ సైన్స్, హార్టికల్చర్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, వెటర్నరీ సైన్స్.
అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఏఎస్‌ఆర్‌బీ/ యూజీసీ నెట్‌లో అర్హత సాధించాలి.
 వయసు: 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 24
 వెబ్‌సైట్: www.drysrhu.edu.in

మరిన్ని వార్తలు