మల్లెలు రెండు విడతలు పూశాయి!

19 Jun, 2014 22:06 IST|Sakshi
మల్లెలు రెండు విడతలు పూశాయి!

LP CET - 2014
తెలుగు
 
వ్యాకరణం
 
 1.    ‘చంద్రమతి వేషంలోనున్న నేను రావాలి’ వాక్యానికి పరోక్ష కథనాన్ని గుర్తించండి?
     1) నేను చంద్రమతి వేషంలో రావాలి     2) చంద్రమతి వేషంలోనున్న తాను రావాలి
     3) తాను చంద్రమతి వేషంలో రావాలి      4) చంద్రమతి వేషంలోనున్న తాము రావాలి
 
 2.    ‘చతుర్వేదములు’ ఏ సంధి?
     1) గుణసంధి      2) యాణాదేశం
     3) విసర్గ      4) జస్త్వసంధి
 
 3.    ‘ఎక్కడి మంత్రతంత్రముల వెక్కడి చక్రము లేడ పాచికల్’ ఈ పద్య పాదం ఏ లక్షణానికి చెందింది?
     1) చంపకమాల      2) మత్తేభం
     3) శార్దూలం     4) ఉత్పలమాల
 
 4.    ‘నలుగురు నాలుగు వేదమ్ముల మంత్రము లొప్ప బ్రహ్మముఖములు వోలెన్’ ఈ ఉదాహరణ ఏ అలంకారానికి చెందింది?
     1) ఉపమ      2) రూపకం
     3) అర్థాంతరన్యాసం 4) శ్లేష
 
 5.    ‘స్వాగతము’ పదాన్ని విడదీయండి?
     1) స్వ  + ఆగతము 2) సు + గతము
     3) సు + ఆగతము     4) స్వ + గతము
 
 6.    ‘ఏడంగుళాలు’ ఏ సమాసం?
     1) ద్వంద్వ     2) ద్విగు
     3) నఞ్    తత్పురుష    4) సప్తమీతత్పురుష
 
 7.    షష్టీతత్పురుష సమాసంలో ఉకార, బు కారంబులకు అచ్చు పరంబగునపుడు?
     1) టుగాగమంబగు    2) దుగాగమంబగు
     3) రుగాగమంబగు     4) నుగాగమంబగు
 
 8.    ‘మల్లెలు రెండు విడతలు పూశాయి’. ఇది ఏ  వాక్యం?
     1) నామాఖ్యాసం      2) క్రియాఖ్యానం
     3) సంయుక్త వాక్యం 4) సంశ్లిష్ట వాక్యం
 
 9.    ‘ధనస్సు’అనే మాటకు పర్యాయ పదాలు?
     1) విరివి, కోదండం, శరాసనం      2) చాపం, కార్ముకం, సింగిణి
     3) కార్ముకం, వల్లరి, ద్యుమ్నం
       4) విల్లు, స్వాపతేయం, దందడి
 
 10.    ‘వింధ్య పర్వతం’ విగ్రహవాక్యం రాయండి?
     1) వింధ్య యొక్క పర్వతం
       2) వింధ్య యందు పర్వతం
     3) వింధ్యయనెడి పర్వతం
       4) వింధ్య అను పేరు గల పర్వతం
 
 11.    ‘ప్రభుత్వానికి డాలర్లు కావాలి’ అనే వాక్యానికి వ్యతిరేకార్థకం?
     1) ప్రభుత్వం డాలర్లు కావాలనుకుంటుంది
       2) ప్రభుత్వానికి డాలర్లు అక్కరలేదు
     3) డాలర్లు ప్రభుత్వానికి అనవసరం      4) పైవన్నీ
 
 12.    ‘సత్యాగ్రహము’ ఏ సమాసం?
     1) ద్వంద్వం        2) చతుర్థీ తత్పురుషం
     3) షష్టీ      4) పంచమీ
 
 13.    కందంలోని బేసి గణాలలో  ఏది ఉండరాదు?
     1) సగణము      2) భగణము
     3) జగణము      4) పైవన్నీ
 
 14.    ‘ధరణీ ధరము’ అనే పదానికి అర్థం?
     1) భూమి      2) పర్వతం
     3) ఆకాశం      4) వాయువు
 
 15.    ఇ ఉ ఋ లకు అసమ వర్ణాలు పరమైతే క్రమంగా యవరలు వచ్చే సంధి?
     1) సవర్ణదీర్ఘ సంధి     2) గుణ సంధి
     3) వృద్ధి సంధి      4) యణాదేశ సంధి
 
 16.    ‘వచనామృతం’ ఏ సమాసానికి విగ్రహ వాక్యం?
     1) వచనం యొక్క అమృతం
       2) వచనము నందు అమృతం
     3) వచనమనెడి అమృతం
       4) వచనము వలన అమృతం
 
 17.    ‘జలరుహనాభుడిట్లుర భసం బున నందన పారిజాతముం’. ఈ పద్యపాదంలో యతి ఏ అక్షరం?
     1) సం  2) బు    3) న      4) నం
 
 18.    ‘హుతాశనుడు’ అనే పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి?
     1) హవిస్సును తినేవాడు
       2) నేతిని భుజించేవాడు
     3) ఆహారాన్ని భుజించేవాడు
       4) ఏవీ కావు
 
 19.    ‘బొండు మల్లెలు వేసింది తాతే. పెంచిందీ తాతే’. ఈ వాక్యానికి సంయుక్త వాక్యాన్ని గుర్తించండి?  
     1) బొండు మల్లెలు వేసింది, పెంచింది తాతే
       2) బొండు మల్లెలు వేసి, పెంచింది తాత
     3) బొండు మల్లెలు వేసింది, పెంచింది తాత
       4) బొండు మల్లెలు తాత వేసి, పెంచాడు
 
 20.    ‘చరణకమలములు’ విగ్రహ వాక్యం?
     1) కమలముల యొక్క చరణాలు      2) చరణముల వంటి కమలము
     3) కమలముల వలన చరణాలు      4) కమలముల వంటి చరణాలు
 
 21.    అతను నీతో ‘నాకు తెలుగు నేర్పు’ అని అన్నాడు. ఈ వాక్యానికి  పరోక్షా నుకృతి వాక్యం ఏది?
     1) అతనికి తెలుగు నేర్పు అని అతను నీతో
     అన్నాడు
       2) నీతో అతను నాకు తెలుగు నేర్పు అని
     అన్నాడు
     3) అతను నీతో తనకి తెలుగు నేర్పు అని
     అన్నాడు
       4) అతను నీతో అతనికి తెలుగు నేర్పు అని
     అన్నాడు
 
 22.    ద్విగు సమాసంలో రెండో పదం?
     1) విశేషణం      2) అవ్యయం
     3) నామవాచకం      4) సంఖ్యావాచకం
 
 23.    ‘పునరుజ్జీవనం’ విడదీయండి?
     1) పునర్ + జీవనం 2) పునః + ఉజ్జీవనం
     3) పునర్ + ఉజ్జీవనం
     4) పునరుత్ + జీవనం
 
 24.    వరుసగా 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు వచ్చే పద్య పాదం దేనికి చెందింది?
     1) ఆటవెలది      2) తేటగీతి
     3) ద్విపద      4) సీసం
 
 25.    రుద్రమ్మ చంఢీశ్వరి దేవి జలజల పారించే శత్రువుల రక్తము చెడని సెలయేఱుగా - ఇందులో ఉన్న అలంకారం?
     1) ఉత్ప్రేక్ష      2) ఉపమ
     3) రూపక      4) స్వభావోక్తి
 
 26.    ‘గురూపదేశం’లో వర్తించిన సంధి?
     1) గుణ సంధి      2) వృద్ధి
     3) సవర్ణదీర్ఘ      4) అనునాసిక
 
 27.    కిందివాటిలో భూతకాలిక అసమాపక క్రియ ఏది?
     1) భావించెను      2) భావించును
     3) భావించి      4) భావించగలడు
 
 28.    ‘పడమర + గాలి’లో వచ్చి చేరిన ఔప విభక్తికం ఏది?
     1) ఇ       2) టి    3) ంటి    4) తి
 
 29.    ‘నేను పండితుణ్ణి, నిర్ధనుణ్ణి’ చెప్పుకున్నాడు ఉమాపతి. ఈ వాక్యానికి పరోక్ష కథన రూపం?
     1) నేను పండితుణ్ణి, నిర్ధనుణ్ణి అని
     చెప్పుకున్నాడు ఉమాపతి
       2) వాడు పండితుడే కానీ, నిర్ధనుడన్నాడు
     ఉమాపతి
     3) నీవు పండితుడివి, నిర్ధనుడివి అన్నాడు
     ఉమాపతి
       4) తాను పండితుడను, నిర్ధనుడనని
     చెప్పుకున్నాడు ఉమాపతి
 
 30.    షోడశోపచారాలు అంటే ఎన్ని రకాల సేవలు?
     1) 10  2) 12 3) 16  4) 14
 
 31.    ‘రేడియో వినిపిస్తూ, పనిచేయిస్తే కార్మికులు ఎక్కువ పని చేయగలుగుతారు’.  ఈ వాక్యంలో అసమాపక క్రియలు?
     1) తుమున్నర్థకం, ఛేదర్థకం
       2) శత్రర్థకం, ఛేదర్థకం
     3) క్త్వార్థకం, అప్యర్థకం
       4) శత్రర్థకం, తుమున్నర్థకం
 
 32.    ఆమె నాపాలిట బాలవిజ్ఞాన సర్వస్వం. ఈ వాక్యంలోని అలంకారం?
     1) ఉపమ      2) ఉత్ప్రేక్ష
     3) రూపకం      4) అతిశయోక్తి
 
 33.    ‘బదరికావనం’ ఏ సమాసం?
     1) సంభావనాపూర్వపద కర్మధారయ
     సమాసం
       2) సంభావనోత్తరపద కర్మధారయ
     సమాసం
     3) ఉపమానోత్తర పద కర్మధారయ
     సమాసం
       4) ఉపమాన పూర్వపద కర్మధారయ
     సమాసం
 
 34.    ‘సంతత బుణ్యశాలి యొక జాడను సంపద’. ఈ పద్యం ఏ శతకం లోనిది?
     1) భాస్కర  2) సుభాషిత రత్నావళి
     3) దాశరథి  4) సుమతీ
 
 35.    కవిత్వంలో రుచి ఉంది. కవిత్వంలో పాకం ఉంది. భోజనంలో రుచి ఉంది. భోజనంలో పాకం ఉంది. ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే?
     1) కవిత్వంలో భోజనంలో రుచి ఉంది.
     కవిత్వంలో భోజనంలో పాకం ఉంది  
     2) కవిత్వంలో భోజనంలో
        రుచిపాకం ఉన్నాయి
     3) కవిత్వంలో భోజనంలో రుచి ఉంది.
     కవిత్వంలో భోజనంలో పాకం ఉంది.
     4) కవిత్వంలో రుచి, పాకం ఉన్నాయి.
     భోజనంలో రుచి, పాకం ఉన్నాయి.
 
 36.    } మహావిష్ణువు స్వయంగా అర్చావ తారంగా వెలసింది ఎక్కడ?
     1) శ్రీనివాస మంగాపురం
       2) అలివేలు మంగాపురం
     3) శ్రీకాకుళ క్షేత్రం      4) ద్వారకా తిరుమల
 
 37.    జలరుహ నాభుడిట్లు రభసంబున నందన పారిజాతముం. ఏ పద్య పాదం?
     1) చంపకమాల      2) ఉత్పలమాల
     3) శార్దూలం      4) మత్తేభం
 
 38.    హరుని చాపం  ఏ సమాసం?
     1) విశేషణ పూర్వపద
       2) పంచమ తత్పురుష
     3) ఉపమాన పూర్వపద 4) షష్టీతత్పురుష
 
 39.    ‘కమల నవ్వుతూ మాట్లాడుతోంది’. ఈ వా క్యాన్ని సామాన్య వాక్యాలుగా విడగొడితే?
     1) కమల నవ్వుతోంది. అయినా
     మాట్లాడుతోంది
      2) కమల నవ్వుతోంది. మాట్లాడుతోంది
     3) కమల నవ్వుతోంది. కమల
     మాట్లాడుతోంది
       4) కమల నవ్వింది. కమల
     మాట్లాడుతోంది
 
 40.    ‘వాల్లభ్యము’ అంటే?
     1) వావివరుసలు      2) వలపు
     3) అధికారం      4) అంధకారం
 
 41.    ‘నర్మ భాషణములు’ అంటే అర్థం?
     1) రెచ్చగొట్టే మాటలు
       2) కోపంతో మాట్లాడే మాటలు
     3) పరిహాసపు మాటలు
       4) నిష్టూరపు మాటలు
 
 42.    ‘మ-స-జ-స-త-త-గ’ అనే గణాలు ఏ పద్యానికి చెందినవి?
     1) ఉత్పలమాల      2) చంపకమాల
     3) మత్తేభం      4) శార్దూలం
 
 43.    ‘లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి’. ఈ వాక్యంలోని అలంకారం?
     1) ఉపమా      2) రూపకం
     3) ఉత్ప్రేక్ష      4) దృష్టాంతం
 
 44.    ‘చిగురు కేలు’ ఏ సమాసం?
     1) విశేషణ పూర్వపద కర్మధారయం      2) విశేషణ ఉత్తరపద కర్మధారయం
     3) ఉపమాన పూర్వపద కర్మధారయం     4) ఉపమాన ఉత్తరపద కర్మధారయం
 
 45.    ‘నల-నగ-సల-భ-ర-త’ అనే గణాలను ఏమంటారు?
     1) ఇంద్ర గణాలు      2) సూర్య గణాలు
     3) మాత్రా గణాలు     4) చంద్రగణాలు
 
 46.    ‘సౌరభోత్కరము’ ఏ సంధి?
     1) సవర్ణదీర్ఘ సంధి     2) వృద్ధి సంధి
     3) గుణ సంధి      4) యణాదేశ సంధి
 
 47.    పన్నెండేళ్లకోసారి  నిర్వహించే ఉత్సవం?
     1) షష్టిపూర్తి      2) సప్తాహం
     3) కుంభమేళా      4) స్వర్ణోత్సవం
 
 48.    ‘గుణహీనుడు’ పదానికి విగ్రహ వాక్యం?
     1) గుణమువలన హీనుడు
       2) గుణాల చేత హీనుడు
     3) గుణాల యందు హీనుడు
       4) గుణం యొక్క హీనుడు
 
 49.    అతను పొద్దున్నే లేచాడు, అతను వ్యాయా మం చేశాడు, అతను స్నానం చేశాడు. ఈ సామాన్య వాక్యాలను కలిపి సంశ్లిష్ట వాక్యంగా రాస్తే?
     1) అతను పొద్దున్నే లేచి వ్యాయామం
     చేసిన తర్వాత స్నానం చేశాడు
       2) అతను పొద్దున్నే లేచి వ్యాయామం చేసి
     స్నానం చేశాడు
     3) అతను పొద్దున్నే లేచిన తర్వాత
     వ్యాయామం చేసి స్నానం చేశాడు      
     4) అతను పొద్దున్నే లేచి వ్యాయామం
     చేశాడు. అతడే స్నానం చేశాడు
 
 50.    ‘వ్యవసాయం’  పదానికి నానార్థాలు?
     1) సేద్యం, భూమి దున్నడం
       2) పంటలు పండించడం, శ్రమించడం
     3) కృషి, సేద్యం, శ్రమ    4) పైవన్నీ
 
 సమాధానాలు

 1) 4    2) 3    3) 4    4) 1
 5) 3    6) 2    7) 4    8) 2
 9) 2    10) 4    11) 2    12) 2
 13) 3    14) 2    15) 4    16) 3
 17) 1    18) 1    19) 1    20) 4
 21) 3    22) 3    23) 2    24) 2
 25) 3    26) 3    27) 3    28) 2
 29) 4    30) 3    31) 2    32) 1
 33) 1    34) 1    35) 2    36) 3
 37) 1    38) 4    39) 3    40) 3
 41) 3    42) 4    43) 2    44) 3
 45) 1     46) 3     47) 3     48) 2
 49) 1    50) 3
 

మరిన్ని వార్తలు