దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు..

13 Aug, 2015 01:42 IST|Sakshi

’లో మాస్టర్స్ డిగ్రీని చేసేందుకు అర్హతలు, ప్రవేశవిధానం, ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?    - గౌరి, హైదరాబాద్
 హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ.. కార్పొరేట్ అండ్ కమర్షియల్ లాస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్, లీగల్ పెడగాజి అండ్ రీసెర్చ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లా, పర్సనల్ లాస్, జనరల్ స్పెషలైజేషన్లతో ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తోంది.

 అర్హత:కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీఎల్.
 ప్రవేశం: కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)లో ఉత్తీర్ణత ఆధారంగా.వెబ్‌సైట్: www.nalsar.ac.in
 హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లా కాలేజీలో కానిస్టిట్యూషనల్ లా, కార్పొరేట్ లాస్, లేబర్ లా స్పెషలైజేషన్లతో ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తోంది.
 అర్హత: కనీసం 45 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ.
 ప్రవేశం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీసీహెచ్‌ఈ) నిర్వహించే పీజీఎల్‌సీఈటీ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.osmania.ac.in/lawcollege/
 గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని పీజీ డిపార్ట్‌మెంట్ ఫర్ లీగల్ స్టడీస్.. లేబర్ లాస్, కానిస్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, టార్ట్స్ అండ్ క్రైమ్స్, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా స్పెషలైజేషన్లతో ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తోంది.
 అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్
 వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
 ఎంఏ తెలుగు కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్న యూనివర్సిటీల వివరాలు తెలపండి?
 -కృపాసాగర్, అమరావతి
 విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు కోర్సును అందిస్తోంది.
 అర్హత: తెలుగు ఒక సబ్జెక్టుగా ఏదైనా డిగ్రీ
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు కోర్సును అందిస్తోంది.
 అర్హత: తెలుగు సబ్జెక్టుతో డిగ్రీ.
 వెబ్‌సైట్: www.svudde.in
 హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. దూరవిద్య విధానంలో ఎంఏ తెలుగు కోర్సును అందిస్తోంది.
 అర్హత: బ్యాచలర్ డిగ్రీ కోర్సులో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
 వెబ్‌సైట్:www.oucde.ac.in
 

మరిన్ని వార్తలు