యూజీసీ నెట్

8 Oct, 2015 01:10 IST|Sakshi

 యూజీసీ, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)-2015 నోటిఫికేషన్ విడుదలైంది. సీబీఎస్‌ఈ నిర్వహించే నెట్‌లో ప్రతిభ చూపితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పొందవచ్చు. దీంతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా స్థిరపడేందుకు అర్హత లభిస్తుంది. ఏటా యువత పెద్ద సంఖ్యలో నెట్ అర్హతతో పరిశోధన, భోధన రంగంలో కెరీర్ దిశగా కదులుతున్నారు. నెట్ అర్హతలు, ఎంపిక, దరఖాస్తు పక్రియలకు సంబంధించిన పూర్తి సమాచారం...
 
 జేఆర్‌ఎఫ్
 సీబీఎస్‌ఈ నిర్వహించే నెట్ పరీక్షలో ప్రతిభ చూపిన వారిని పరిశోధనల వైపు ప్రోత్సహించేందుకు యూజీసీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డును అందిస్తోంది. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన విద్యార్థులు వివిధ పథకాల కింద యూజీసీ ఆర్థిక సహాయాన్ని అందుకోవచ్చు. జేఆర్‌ఎఫ్ అర్హతతో వివిధ ఐఐటీ/ఎన్‌ఐటీ/యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధనలు చేయవచ్చు.
 
 అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 55 శాతం ఉత్తీర్ణతతోమాస్టర్ డిగ్రీ. క్రీమిలేయర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పీజీలో 50 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. నాన్ క్రీమిలేయర్ ఓబీసీ అభ్యర్థులను జనరల్ కేటగిరీ కింద పరిగణిస్తారు. పీజీ చివరి ఏడాది పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు, ఫైనలియర్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు కూడా నెట్ పరీక్షకు హాజరుకావొచ్చు.
 వయసు: జేఆర్‌ఎఫ్: డిసెంబరు 1, 2015 నాటికి 28 ఏళ్లు మించరాదు.  ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, నాన్ క్రీమిలేయర్ ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.  అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం నెట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు.
 
 దరఖాస్తు విధానం
 ఠీఠీఠీ.ఛిఛట్ఛ్ఛ్ట.జీఛి.జీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
 ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.600, నాన్‌క్రీమిలేయర్ ఓబీసీలకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.150.ఫజు మొత్తాన్ని క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు లేదా సిండికేట్, కెనరా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ద్వారా చలాన్ రూపంలో చెల్లించొచ్చు.
 
 పరీక్ష విధానం
 నెట్ పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు.పేపర్ 1: పేపర్ 1 ద్వారా అభ్యర్థుల్లోని టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌లను పరీక్షిస్తారు. రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రెహెన్షన్, జనరల్ ఎవేర్‌నెస్, విలక్షణ ఆలోచన శైలి తదితర అంశాల నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. కనీసం 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. 50 ప్రశ్నల కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మొదటి 50 ప్రశ్నలను పరిగణలోకి తీసుకుంటారు. పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 నిమిషాల వరకు ఉంటుంది.
 పేపర్ 2: పేపర్ 2లో 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పేపర్ 2 పరీక్ష ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపర్ 3: పేపర్ 3లో 75 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలను అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పేపర్ 3 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. పీజీ సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 ఎంపిక ప్రక్రియ
 నెట్ కనీస అర్హత మార్కులు
 కేటగిరీ        మార్కులు శాతాల్లో
 పేపర్-1    పేపర్-2    పేపర్-3
 జనరల్    40    40    75
 ఎస్సీ, ఎస్టీ,
 నాన్ క్రీమిలేయర్
 ఓబీసీ, పీడబ్ల్యూడీ    35    35    60
 
 ఎంపిక విధానంలో మొత్తం నాలుగు దశలు ఉంటాయి.
 మొదటి దశ: మూడు పేపర్లలలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను జేఆర్‌ఎఫ్ అవార్డు ఎంపిక లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు సంబంధించి పరిగణలోకి తీసుకుంటారు.రెండో దశ: మొదటి దశ జాబితాలోని అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కులను పరిగణలోకి తీసుకుని సబ్జెక్టులు, కేటగిరీల వారీగా జాబితాను రూపొందిస్తారు.మూడో దశ: రెండో దశకు ఎంపికైన అభ్యర్థుల నుంచి టాప్ 15 శాతం (కేటగిరీ, సబ్జెక్టుల వారీ)లో నిలిచిన వారితో జాబితాను సిద్ధం చేస్తారు. వీరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు సంబంధించి నెట్ క్వాలిఫికేషన్‌ను అందిస్తారు.నాలుగో దశ: మూడో దశకు ఎంపికైన అభ్యర్థులలో నుంచిప్రత్యేకంగా మరొక జాబితాను రూపొందిస్తారు. వీరందరికీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డును అందిస్తారు.
 
 ముఖ్య సమాచారం:
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: నవంబరు 1, 2015
 ఫీజు చెల్లించడానికి చివరితేదీ: నవంబరు 2, 2015,
 నెట్ పరీక్ష తేదీ: డిసెంబరు 27, 2015.
 పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం.
 
 ప్రిపరేషన్ టిప్స్
  పేపర్ 1 పరీక్ష ద్వారా విద్యార్థికి ఉపయోగపడే విధంగా బోధనా పద్ధతులు, సాంకేతికతను ఏ స్థాయిలో ఉపయోగించగలరో పరీక్షిస్తారు. విద్యార్థి ఆలోచనా సామర్థ్యం, సమకాలీన సమాజ, పర్యావరణ సంబంధిత అంశాల్లో అభ్యర్థుల దృక్పథం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 2లోని ప్రశ్నలు అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి వస్తాయి. ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటాయి. ప్రాథమిక భావనలతో పాటు సిలబస్‌లోని అన్ని అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు ప్రతి టాపిక్‌ను సమగ్రంగా చదవాల్సి ఉంటుంది. పేపర్ 3లో కొంచెం క్లిష్టతరమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అన్ని అంశాలను లోతుగా చదవాల్సి ఉంటుంది. పేపర్ 3లో ప్రశ్నలు ఎక్కువగా ఎలెక్టివ్‌ల నుంచి వస్తున్నాయి. విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ సాగించాలి. గతంలో వచ్చిన ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రిపరేషన్, స్టడీమెటీరియల్స్ విషయంలో ప్రొఫెసర్స్, సీనియర్ విద్యార్థుల సలహాలు తీసుకోవడం మంచిది.
 

మరిన్ని వార్తలు