పరిశోధనల్లో కెరీర్‌కు పట్టంకట్టే జెస్ట్!

20 Nov, 2014 01:06 IST|Sakshi
పరిశోధనల్లో కెరీర్‌కు పట్టంకట్టే జెస్ట్!

జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్).. దేశంలోని 20కిపైగా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధన కోర్సులను అభ్యసించడానికి మార్గం సుగమం చేసే పరీక్ష. జెస్ట్-2015 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష వివరాలు..
 
జెస్ట్ పరీక్ష ద్వారా ఫిజిక్స్, థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులోని స్కోర్ ఆధారంగా వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు తాము నిర్దేశించిన అర్హతలున్న విద్యార్థులను తుది ఎంపిక కోసం పిలుస్తాయి. ఈ క్రమంలో జెస్ట్ స్కోర్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది.
 
 రాత పరీక్ష: గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
 
 ఫిజిక్స్: రాత పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో 25 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. రెండో విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఇందులో 40 శాతం ప్రశ్నలు బీఎస్సీ సిలబస్ నుంచి, 60 శాతం ఎంఎస్సీ సిలబస్ నుంచి వస్తాయి.
 
 సిలబస్: మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, అటామిక్ అండ్ ఆప్టికల్ ఫిజిక్స్, ప్రాబబిలిటీ థియరీ.
 
 థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్: ఇందులో రెండు రకాలు ప్రశ్నలు ఉంటాయి. కొన్నిటికి స్వల్ప సమాధానాలు సరిపోతే, మరికొన్నిటికి దీర్ఘ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అంశాలపై ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలను సాధించడానికి మ్యాథమెటికల్ నైపుణ్యం కూడా అవసరం.
 
సిలబస్: అనలిటికల్ రీజనింగ్ అండ్ డిడక్షన్, కాంబినోట్రిక్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, డిస్రిక్ట్ మ్యాథమెటిక్స్, గ్రూప్ థియరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్.
 
 థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్/న్యూరో సైన్స్
 ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్-చెన్నై: పీహెచ్‌డీ ఇన్‌థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్/ఎంఈ (కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగం)/ఎంసీఏ.
 
 నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌బీఆర్‌సీ)- గుర్గావ్ పీహెచ్‌డీ ఇన్ న్యూరోసైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్/ఎంసీఏ.
 
 ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంటెక్ పీహెచ్‌డీ: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్).
 
 ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్‌డీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్): ఎంఎస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా పోస్ట్ బీఎస్సీ (ఆనర్స్ ఇన్ ఆప్టిక్స్ అండ్ ఆప్టోఎలక్ట్రానిక్స్/ రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ (సంబంధిత సబ్జెక్ట్‌లతో).
 
 ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ- ఫిజిక్స్ (ఐఐఎస్‌ఈఆర్)-తిరువనంతపురం: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ (ఫిజిక్స్/ టెక్నాలజీ/ ఇంజనీరింగ్).
 
 ప్రతి ఇన్‌స్టిట్యూట్ అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దరఖాస్తుకు ముందు సంబంధిత వివరాలను ముందుగా తెలుసుకోవడం మంచిది.
 
 పీహెచ్‌డీ-ఫిజిక్స్‌కు అర్హత
 
ఎంఎస్సీ (ఫిజిక్స్) లేదా ఎంఎస్సీ/ఎంటెక్ (సంబంధిత విభాగాల్లో) లేదా ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ (ఇంజనీరింగ్ ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్). ప్రతిభావంతులైన బీఎస్సీ మొదటి సంవత్సరం లేదా ఎంఎస్సీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ఆస్ట్రానమీ/అప్లయిడ్ మ్యాథమెటిక్స్) విద్యార్థులు ఐయూసీఏఏలో రీసెర్చ్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 దరఖాస్తు విధానం
  దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
 దరఖాస్తు రుసుం: రూ. 300(ఎస్సీ/ఎస్టీలకు రూ.150)
 దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 8, 2014.
 రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015.
 వెబ్‌సైట్: www.jest.org.in
 

>
మరిన్ని వార్తలు