ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ఎంటెక్, ఎంఆర్క్‌లకు..

30 Apr, 2016 14:16 IST|Sakshi
ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ఎంటెక్, ఎంఆర్క్‌లకు..

కౌన్సెలింగ్
ఇంజనీరింగ్ స్పెషల్ సీసీఎంటీ - 2016
గేట్ ర్యాంక్ ఆధారంగా మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే సెంట్రల్ కౌన్సెలింగ్ ఫర్ ఎంటెక్/ ఎంఆర్క్/ ఎంప్లాన్/ఎం.డిజ్ (సీసీఎంటీ)కి ప్రకటన విడుదలైంది. దీని ద్వారా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర సహాయం లభించే ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గతంలో విద్యార్థులు విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఇంటర్వ్యూ/కౌన్సెలింగ్ కోసం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ ఇబ్బందికరంగా ఉండటంతో దాని స్థానంలో కేంద్రీకృత కౌన్సెలింగ్‌ను ప్రవేశపెట్టారు. 2015లో ఎన్‌ఐటీ రూర్కెలా సీసీఎంటీని నిర్వహించగా ఈ ఏడాది ఎన్‌ఐటీ సూరత్‌కల్ ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ నేపథ్యంలో అర్హత, ప్రవేశ ప్రక్రియ, సీట్ల కేటాయింపు తదితర వివరాలు..
 
అర్హత    
* ఎంటెక్, ఎంఆర్క్, ఎంప్లాన్, ఎం.డిజైన్ తదితర ప్రోగ్రాముల్లో చేరాలనుకునే అభ్యర్థులకు ఈ కింది అర్హతలు ఉండాలి.
* 2015 లేదా 2016 వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
* జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 6.5 జీపీఏ లేదా 60 శాతం మార్కులతో; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 6.0 జీపీఏ లేదా 55 శాతం మార్కులతో గ్రాడుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
* కొన్ని సంస్థల్లోని నిర్ణీత ప్రోగ్రాముల్లో చేరేందుకు ప్రత్యేక అర్హతలు అవసరం.
 
రిజిస్ట్రేషన్, ప్రాధమ్యాల ఎంపిక, లాకింగ్
రిజిస్ట్రేషన్ ఫీజును ఎస్‌బీఐ డెబిట్/క్రెడిట్ కార్డులు/నెట్ బ్యాంకింగ్/ఈ-చలానా ద్వారా చెల్లించాలి. తర్వాత ప్రోగ్రాముల ప్రాధామ్యాలను ఎంపిక చేసుకోవాలి. రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్‌లో సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ కేంద్రాలను ఆశ్రయించవచ్చు.
 
ప్రవేశ ప్రక్రియ
* జనరల్, ఓబీసీలు రూ.2000 చెల్లించి నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో చాయిస్ ఫిల్ చేసినవారికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. తుది చాయిస్‌లను మే 16 అర్ధరాత్రి లోపు లాక్ చేయాలి. లాక్ చేస్తే అన్‌లాక్ కుదరదు. మే 16లోపు లాక్ చేయకపోతే చివరగా సేవ్ చేసిన చాయిస్‌లే ఆటోమెటిక్‌గా లాక్ అవుతాయి.
* నమోదు పత్రాన్ని, లాక్ చేసిన చాయిస్‌లను ప్రింట్ తీసుకోవాలి. సీట్ల కేటాయింపు తాజా వివరాలను సీసీఎంటీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
* సీటొచ్చినవారు నిర్దిష్ట గడువులోగా రిపోర్టింగ్ సెంటర్, సహాయ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలి. లేకపోతే సీటు రద్దవుతుంది. నేషనల్ స్పాట్ రౌండ్ మినహా తర్వాతి దశలకు వారిని పరిగణనలోకి తీసుకోరు.
* వెరిఫికేషన్ కోసం గేట్ స్కోర్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు చూపాలి. రిజిస్ట్రేషన్, రిపోర్టింగ్ ఫారాలు; ఫీజు రశీదు, ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ లెటర్ తీసుకెళ్లాలి. రిపోర్టింగ్ సెంటర్‌కు వెళ్లే ముందే సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు  రూ.20,000 చెల్లించాలి.
* విల్లింగ్‌నెస్ ఛేంజ్ కోసం రిపోర్టింగ్ సమయంలో ఫ్లోటింగ్, స్లైడింగ్, ఫ్రీజ్ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఫ్లోటింగ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే తదుపరి దశ కౌన్సెలింగ్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చిన సంస్థకు మారొచ్చు. స్లైడింగ్ ఆప్షన్ ద్వారా ప్రవేశం పొందిన సంస్థలోనే మరో కోర్సుకు మారే వీలుంటుంది.
* ఎలాంటి మార్పు అవసరం లేదనుకుంటే ఫ్రీజింగ్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
* ఫ్లోటింగ్, స్లైడింగ్ ద్వారా తదుపరి దశల్లో సీటు పొందినవారు ఇంతకుముందు పొందిన సీటును వదులుకోవాలి. విల్లింగ్‌నెస్ ఛేంజ్‌లో భాగంగా 2, 3వ దశల్లో సీట్లు మార్చుకోవడానికి వెళ్లాలి.
* ఒకవేళ సీటు నచ్చకపోతే అదే రిపోర్టింగ్ సెంటర్‌కెళ్లి సీటు రద్దు చేసుకోవచ్చు.
 
సీట్ల కేటాయింపు
* గేట్ స్కోర్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. అభ్యర్థుల చాయిస్ ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన 3 దశల్లో సీట్లు కేటాయిస్తారు. 3 దశల తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. అడ్మిషన్ పొందినవారు షెడ్యూల్ ప్రకారం రిపోర్ట్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయి, సీటు యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ (డీవీసీ) జారీ చేస్తారు.
* సీటొచ్చిన అభ్యర్థులు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రూ.10,000 చెల్లించి సీటు ఖరారు చేసుకోవాలి. మిగతా మొత్తాన్ని సీటు పొందిన సంస్థలో చెల్లించాలి. సీటు కన్ఫర్మేషన్ ఫీజు చెల్లించాక సీసీఎంటీ వెబ్‌సైట్ నుంచి ప్రొవిజనల్ సీటు కన్‌ఫర్మేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, డీవీసీ, ప్రొవిజనల్ సీటు కన్ఫర్మేషన్ లెటర్ తీసుకొని నేరుగా ప్రవేశం లభించిన విద్యా సంస్థకు వెళ్లవచ్చు.
 
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: మే 12
ఆన్‌లైన్‌లో చాయిస్ ఫిల్లింగ్: మే 16 రాత్రి 12 వరకు
లాకింగ్ ఆఫ్ చాయిసెస్: మే 13 నుంచి 16 వరకు.
ఆటోమెటిక్ లాకింగ్ ఆఫ్ చాయిసెస్: మే 16
తొలి దశ సీట్ల కేటాయింపు: మే 29
సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లింపు: మే 30-జూన్ 2
రెండో దశ సీట్ల కేటాయింపు: జూన్ 6
సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లింపు: జూన్ 7-10
మూడో దశ సీట్ల కేటాయింపు: జూన్ 19
సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లింపు: జూన్ 20-23
ప్రొవిజనల్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ ఫీజు చెల్లింపు: జూన్ 24-30, స్లైడింగ్ ఫలితాల ప్రకటన: జూలై 3
ఖాళీల ప్రకటన: జూలై 3
నేషనల్ స్పాట్ రౌండ్ దరఖాస్తు గడువు: జూలై 4-7
ఎన్‌ఎస్‌ఆర్ చాయిస్ ఫిల్లింగ్: జూలై 4-8
చాయిస్ లాకింగ్: జూలై 8
ఎన్‌ఎస్‌ఆర్ సీట్ల కేటాయింపు: జూలై 11
సీటు పొందిన సంస్థలో రిపోర్టింగ్ గడువు: జూలై 18-22 వరకు
వెబ్‌సైట్: http://ccmt.nic.in

మరిన్ని వార్తలు