అర్థశాస్త్రం.. ప్రాథమిక భావనలు

25 Sep, 2014 02:56 IST|Sakshi
అర్థశాస్త్రం.. ప్రాథమిక భావనలు

 కానిస్టేబుల్ పరీక్షలో అర్థశాస్త్రం నుంచి దాదాపుగా 6 ప్రశ్నలు రావచ్చు. అందులో అర్థశాస్త్ర ప్రాథమిక భావనల నుంచి కనీసం ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రిపేరయ్యేటప్పుడు అర్థశాస్త్ర పదజాలంను అవగాహన చేసుకోవడం కొద్దిగా క్లిష్టంగానే ఉంటుంది. కాబట్టి ఆయా అంశాలను చదివేటప్పుడు వాటి అర్థాలను వెంటనే తె లుసుకోవడం ప్రయోజనకరం. పాఠ్యపుస్తకాల చివర ఇచ్చిన పదజాలం, ప్రశ్నలు, నిర్వచనాలను తప్పకుండా చదవాలి.
 
 
 సమాజంలోని ఆర్థిక కార్యకలాపాలను విస్తృతంగా విశ్లేషణ చేసేది అర్థశాస్త్రం. దీన్ని ఆంగ్లంలో ఎకనామిక్స్ (ఉఛిౌౌఝజీఛిట) అంటారు. ఇదీ ‘ైఓఐై (ఒక గృహం)’, ‘ూఉకఉఐూ (నిర్వహణ)’ అనే గ్రీకు పదాల కలయిక నుంచి ఏర్పడింది. అంటే గృహ సంబంధ నిర్వహణాంశాలను ప్రాతిపదికగా ఆర్థిక పరమైన కోణంలో శాస్త్రీయంగా వివరించే అర్థశాస్త్రం.
 
 అర్థశాస్త్రాన్ని ‘రాగ్నార్ ప్రిష్’ రెండు భాగాలుగా వర్గీకరించారు. అవి..
 1)సూక్ష్మ అర్ధశాస్త్రం: ఇది ఒక కుటుంబ ఆదాయం, సంస్థ ఆదాయం, పరిశ్రమ ఆదాయం గురించి వివరిస్తుంది. అలాగే ఉత్పత్తి, వినియోగం, వినిమయం, పంపిణీ వంటి అంశాలు దీనిలోని ప్రధాన అంశాలు. ఈ శాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.2)స్థూల అర్ధశాస్త్రం: సాధారణ ధరల స్థాయిని, జాతీయ ఉత్పత్తులను, జాతీయాదాయం గురించి చర్చిస్తుంది. అంటే దేశంలోని మొత్తం ఆర్థిక కార్యకలాపాలను వివరిస్తుంది. దీన్ని ఆదాయ సిద్ధాంతంగా అని కూడా పిలుస్తారు.
 
 కోరికలు-వర్గీకరణ:
 మానవుని కోరికలకు పరిమితి ఉండదు. కానీ ఆ కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించే వస్తువులు మాత్రం పరిమితంగానే లభ్యమవుతాయి. ఈ కోరికలు ఆ వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. కోరికలు మూడు రకాలు. అవి..
 1)    అత్యవసరాలు: ఆహారం, బట్టలు, ఇల్లు తదితరాలు.
 2)    సౌకర్యాలు: కరెంట్, ఫ్యాన్, టీవీ, ఫ్రీజ్, మొబైల్ ఫోన్, సైకిల్ మొదలైనవి.
 3)    విలాసాలు: కారు, ఏసీ, ఆభరణాలు తదితరాలు.
 వ్యక్తి ఆదాయ స్థాయి, నివసిస్తున్న ప్రదేశం, కాలాన్ని బట్టి ఈ కోరికలు మారొచ్చు. ఒకరికి సౌకర్యంగా అనిపించింది మరొకరికి అత్యవసరంగా అనిపించవచ్చు. ఇంకొకరికి విలాసంగా తోస్తే మరొకరు అత్యవసరంగా భావిస్తారు. ఈ విషయాలన్నీ ఆదాయ వనరులు, ఎంపికపై ఆధారపడి ఉంటాయి. అర్థశాస్త్రం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఇటువంటి విషయాల్లో మెరుగ్గా వ్యవహరిస్తాడు. ఆ వ్యక్తి కోరికలను సంతృప్తి పరచడానికి ప్రత్యామ్నాయ ఎంపికలను కూడా అర్థశాస్త్రం చూపిస్తుంది. ఈ కోరికలకు, ఎంపికలకు మూలం వస్తువులు. వస్తువుల ఉత్పత్తికి కావల్సినవి వనరులు. వనరులు కూడా పరిమితమే. ఈ వనరుల కొరత కారణంగానే ఎంపిక సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య సార్వజనీనమైంది. దీనికి పరిష్కార మార్గాలను అర్థశాస్త్ర భావనలను సూచిస్తాయి.
 
 వస్తువులు-రకాలు:
 వినియోగ వస్తువులు: మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులు. ఉదాహరణ-పాలు, పండ్లు, ఆహారం, వస్త్రాలు, సబ్బులు, బ్రష్ మొదలైనవి.ఉచిత వస్తువులు: ఎలాంటి ధర చెల్లించకుండా ప్రకృతిలో విరివిగా లభిస్తూ ఉచితంగా దొరికే వస్తువులు. ఉదాహరణ-సూర్యరశ్మి, గాలి, నీరు (ప్రస్తుతం ఇది ఆర్థిక వస్తువుగా మారింది) ర్థిక వస్తువులు: ఉచితంగా లభించని, డబ్బు చెల్లించి కొనే ప్రతి వస్తువు. ఉదాహరణ-ఆహారం, దుస్తులు, ఇల్లు మొదలైనవి.ఉత్పాదక వస్తువులు: ఒక వస్తువు తయారీకి ఉపయోగపడే వస్తువులు. ఉదాహరణ-యంత్ర పరికరాలు, భవనాలు, ఇతర పనిముట్లు. వీటిని మాలధన వస్తువులని కూడా అంటారు.
 
 మాధ్యమిక వస్తువులు: పూర్తిగా తయారు కాని, ఉపయోగించడానికి సిద్ధంగా లేని వస్తువులు. ఉదాహరణ -సిమెంట్, ఇటుకలు, ఉక్కు. ఇవి ముడి పదార్థాలు కావు. అంతిమ వినియోగ వస్తువులు కావు.పబ్లిక్ వస్తువులు: ప్రభుత్వం సమకూర్చి ప్రజలందరికి అందుబాటులో ఉంచే వస్తువులు. ఇవి ఎంత మంది ఉపయోగించినా తరిగి పోవు. ఉదాహరణ-దేశ రక్షణ దళాలు. పార్కులు, రోడ్లు, వీధి దీపాలు, ప్రభుత్వ సేవలు కూడా పబ్లిక్ వస్తువులే కానీ, స్వచ్ఛమైన పబ్లిక్ వస్తువులు కాదు. అదేవిధంగా ప్రభుత్వ సేవలు కూడా ఆర్థిక వస్తువులయ్యాయి. ఉదాహరణ-భారతీయ రైల్వే సేవలు, తపాలా సేవలు, మీ సేవ తదితరాలు.ప్రైవేట్ వస్తువులు: డబ్బు చెల్లించి కొనే ప్రతి ఒకటీ ప్రైవేట్ వస్తువు కిందకే వస్తుంది. ఉదాహరణ- పుస్తకాలు, పెన్నులు, చెప్పులు, మోటార్ సైకిల్ తదితరాలు.
 
 ఉత్పత్తి-ఉత్పత్తి సాధనాలు:
 ఉత్పత్తి అంటే ఒక వస్తువును సృష్టించడం ద్వారా అర్థశాస్త్ర పరంగా ముడి పదార్థాలకు ప్రయోజనం చేకూర్చి వాటిని అంతిమ వస్తువుగా రూపొందించే ప్రక్రియనే ఉత్పత్తిగా పిలుస్తారు. సంగ్రహంగా ఉత్పత్తి అంటే ఉత్పాదకాలను ఉత్పత్తిగా మార్చే ప్రక్రియ. వస్తువుల తయారీ, ప్యాకింగ్, రవాణా, నిల్వ చేయడం వంటివి ఉత్పత్తి పరిధిలోకి వస్తాయి. ప్రముఖ ఆర్థికవేత్త మేయర్-అంతిమంగా వస్తువులు, సేవలు పొందడానికి చేసే కార్యకలాపాలన్నీ ఉత్పత్తిగానే పరిగణించారు. ఈ వస్తు సేవల ఉత్పత్తికి ఆధారం వినియోగం. వినియోగం లేనిదే ఉత్పత్తి లేదు.
 
 వినియోగం:
 వ్యక్తులు తమ అవసరాలను, సౌకర్యాలను, విలాసాలను, కోరికలను తీర్చుకోవడానికి వస్తువులను సేవలను ఆధారం చేసుకోవడాన్ని వినియోగం అంటారు.  ఉపయోగించుకునే వ్యక్తులు.. వినియోగదారులు. ఈ వినియోగానికి మూలం కోరికలు. వీటిని తీర్చుకోవడానికి వినియోగదారులు నిరంతరం వస్తు సేవలను వాడుకుంటారు. ఈవిధంగా వినియో గం, ఉత్పత్తి రెండూ పరస్పరాధారితాలు. ఉత్పత్తికి సహకరించే కారకాలను ఉత్పత్తి సాధనాలు అంటారు. అవి..
 
 భూమి: భూమిపై ప్రకృతి సిద్ధంగా లభించే ప్రతిదీ వస్తువు ఉత్పత్తికి దోహదపడుతుంది. వ్యవసాయ లేదా వ్యవసాయేతర భూమైనా ఉత్పత్తికి ఆధారంగానే ఉంటుంది. శ్రమ: ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి చేసే శారీరక, మానసిక పనిని శ్రమ అంటారు. శ్రమను అందించేది శ్రామికులు. శ్రామికులు లేనిది దేన్ని ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. మూలధనం: యంత్రాలు, పరికరాలు, భవనాలు, ఇతర సామాగ్రిని మూలధనంగా పిలుస్తారు. ఇది స్థిర మూలధనం, చర మూలధనం అని రెండు రకాలు. ఉత్పత్తి ప్రక్రియలో ఎక్కువ కాలం ఉపయోగపడే యంత్రాలు, భవనాలు స్థిర మూలధనం కిందకు వస్తాయి. ఉత్పత్తిలో ఒకసారి ఉపయోగపడే శ్రామికుల వేతనాలు, ముడిపదార్థాలు, విద్యుచ్ఛక్తి, ఇంధనం చర మూలధనం పరిధిలో ఉంటాయి. మూలధనం శ్రామికుని తలసరి ఉత్పాదకతను పెంచి తద్వారా మొత్తం ఉత్పత్తిని పెంచుతుంది.
 
 వ్యవస్థాపనం/ఉద్యమధారిత్వం:
 భూమి, శ్రమ, మూలధనాన్ని సమకూర్చి, సమన్వయం చేసి ఉత్పత్తిని చేపట్టే కార్యనిర్వహణనే వ్యవస్థాపన అంటారు. వ్యవస్థాపకులను ఉద్యమదారులుగా పిలుస్తారు. వీరు ఉద్యమధారిత్వం వహించి నష్ట భయాలను కూడా తట్టుకుని, ఉత్పత్తిని కొనసాగిస్తారు.
 
 సాంకేతిక పరిజ్ఞానం:
 ఉత్పత్తి కారకాలను సంపూర్ణంగా ఉపయోగించి నాణ్యమైన, ఆధునికమైన వస్తువులను అధిక వేగంతో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుంది. ఇది శ్రామికుని శ్రమను కూడ తగ్గిస్తుంది. ప్రస్తుతం ఇది ముఖ్యమైన ఉత్పత్తి సాధనంగా మారింది.
 
 ఉత్పత్తి ఫలం:
 ఉత్పత్తి కారకాలకు, ఉత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పత్తి ఫలం వివరిస్తుంది. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని ఉత్పత్తి ఫలంగా పేర్కొంటారు. దీన్ని ఖ=ఊ (ూ,ఔ, ఓ,ై) సమీకరణ రూపంలో వివరిస్తారు. ఖ -ఉత్పత్తి, -భూమి, ఔ-శ్రమ, ఓ-మూలధనం, ై-వ్యవస్థాపన, ఊ- ఉత్పత్తికి, ఉత్పాదకాల మధ్య ఉన్న ప్రమేయ సంబంధం.
 
 ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యలు:
 ఉత్పత్తి దృష్ట్యా మన ఆర్థిక వ్యవస్థ నాలుగు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటుంది. అవి..
 1.    ఏ రకమైన వస్తువులను ఎంత పరిమాణలో ఉత్పత్తి చేయాలి?
 2.    ఏవిధంగా ఉత్పత్తి చేయాలి?
 3.    ఎక్కడ ఉత్పత్తి చేయాలి?
 4.    ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి?
 
 అర్థశాస్త్ర నిర్వచనాలు:
 అర్థశాస్త్రవేత్త    నిర్వచనం పేరు     నిర్వచనం
 ఆడమ్ స్మిత్     సంపద    అర్థశాస్త్రం సంపద గురించి అధ్యయనం చేస్తుంది.
 (అర్థశాస్త్ర పితామహుడు)
 ఆల్ ఫ్రెడ్ మార్షల్    శ్రేయస్సు    మానవుని శ్రేయస్సును అధ్యయనం చేస్తుంది.
 లయెనెల్ రాబిన్స్    కొరత    కొరత, ఎంపికను గురించి వివరిస్తుంది.
 పాల్ శామ్యూల్‌సన్ వృద్ధి కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధిని అధ్యయనం చేస్తుంది.
 (అర్ధశాస్త్రాన్ని సామాజిక
 శాస్త్రల రాణిగా పేర్కొన్నారు)
 అమర్త్యసేన్     సంక్షేమం    మానవుని సంక్షేమం గురించి అధ్యయనం చేస్తుంది.
 
 ప్రయోజనం-రకాలు
 
 వస్తువులను వినియోగించడం ద్వారా వ్యక్తుల కోరికలు తీరుతాయి. వస్తువులకు గల ఈ శక్తినే ప్రయోజనం అంటారు. వస్తువులను ఉపయోగించడం ద్వారా వ్యక్తులు పొందే ప్రయోజనాలు నాలుగు రకాలు. అవి.. 1.రూప ప్రయోజనం: ఒక వస్తువు ఆకారం, రంగు, పరిమాణ రూపం మార్చడం ద్వారా ఆ వస్తువుకు మానవుని కోరికను తీర్చే శక్తి ఉంటే దాన్ని రూప ప్రయోజనం అంటారు. ఉదాహరణ-చెక్కతో కుర్చీనిగాని, టేబుల్‌ను గాని తయారు చేయడం, ముడి పత్తి నుంచి దుస్తులు రూపొందించడం.
 
 2.స్థల ప్రయోజనం: స్థలాన్ని మార్చడం ద్వారా వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణ- సముద్ర తీరంలోని ఇసుకను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం, హిమాచల్‌ప్రదేశ్‌లోని యాపిల్ పండ్లును ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం వంటివి.
 
 3.కాల ప్రయోజనం: కాలాన్ని బట్టి కూడ వస్తువులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు వ్యాపారస్థులు పంటలు చేతికి వచ్చినప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచి కొంతకాలం తర్వాత మార్కెట్‌లో విక్రయించడంతో ప్రయోజనం పొందుతారు.
 
 4.సేవల ప్రయోజనం: సేవలు కూడా మానవుల కోరికలను తీరుస్తాయి. ఉదాహరణ టీచర్లు, లాయర్లు, వైద్యుల సేవల ద్వారా పొందే ప్రయోజనం.
 
 మాదిరి ప్రశ్నలు
 స్థూల అర్థశాస్త్రం దేనికి ప్రాధాన్యతనిస్తుంది-
 జాతీయాదాయం
 ఉత్పత్తిలో వినియోగ వస్తువులకు అధిక ప్రాధాన్యతనిస్తే దేశ ఆర్థిక భవిష్యత్ ఎలా ఉంటుంది-దెబ్బతింటుంది.
 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు-1969
 ప్రయోజనాల సృష్టి అంటే-ఉత్పత్తి
 దుస్తులను చొక్కగా రూపొందిస్తే కలిగే
 ప్రయోజనం-ఆకార ప్రయోజనం
 పోస్ట్‌మ్యాన్‌కు సైకిల్-అవసరమైన వస్తువు
 ఆర్థికశాస్త్రాన్ని సంక్షేమశాస్త్రం అని పేర్కొన్న
 శాస్త్రవేత్త-అమర్త్యసేన్
 

మరిన్ని వార్తలు