సోషల్ స్టడీస్- మెథడాలజీ

24 Sep, 2013 22:45 IST|Sakshi
సోషల్ స్టడీస్- మెథడాలజీ

 బోధనాభ్యసన సామగ్రి - వనరులు
 1.    ఎడ్గర్‌డేల్ అనుభవ శంఖులో పై నుంచి రెండో స్థానంలో ఉన్న అభ్యసన అనుభవం?
                               (టెట్- జూలై 2011)
 1) క్షేత్ర పర్యటనలు     2) దృశ్య సాంకేతికాలు
 3) కదిలే చిత్రాలు     4) ప్రదర్శనలు
 
 2.    రేడియో, కార్టూన్, నాటకీకరణ అనేవి ప్రక్షేపితం కాని బోధనోపకరణాలు. వీటికి గల సరైన విద్యాపరమైన పేర్లు వరుసగా?
                        (టెట్ - జనవరి 2012)
 1) శ్రవణ ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం,
 కృత్య ఉపకరణం
 2) కృత్య ఉపకరణం, గ్రాఫిక్ ఉపకరణం,
 శ్రవణ ఉపకరణం
 3) కృత్య ఉపకరణం, శ్రవణ ఉపకరణం
 గ్రాఫిక్ ఉపకరణం
 4) గ్రాఫిక్ ఉపకరణం, శ్రవణ ఉపకరణం,
 కృత్య ఉపకరణం
 
 3.    విద్యార్థుల్లో అభిరుచులను, పఠనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వాడే కార్టూన్‌లకు ఏ గ్రాఫ్‌ను ఉపయోగిస్తారు?
                           (టెట్ - జనవరి 2012)
 1) ఫ్లానెల్ గ్రాఫ్     2) సచిత్ర గ్రాఫ్
 3) బార్ గ్రాఫ్     4) రేఖా చిత్రాల గ్రాఫ్
 
 4.    ఉపాధ్యాయులకు సంబంధించిన బోధనా సామగ్రి (టెట్ - జనవరి 2012)
 1) కరిక్యులం గైడ్‌లు           2) అట్లాస్
 3) అనుబంధ సామగ్రి     
 4) వర్‌‌కబుక్‌లు
 
 5.    ఒక ప్రదేశాన్ని చూపించేందుకు సార్వత్రికంగా ఆమోదించిన చిహ్నం?
                     (టెట్ - మే 2012)
 1) మ్యాప్     2) ఫోటోగ్రాఫ్
 3) గ్రాఫ్     4) చార్‌‌ట
 
 6.    ఒక నగర పరిపాలన వ్యవస్థీకరణ, కార్య నిర్వహణ, న్యాయ, శాసన వ్యవస్థల మధ్య సంబంధాన్ని చూపేందుకు ఏ రకమైన చార్‌‌ట ఉపయోగపడుతుంది?
                                   (టెట్-మే 2012)
 1) పట్టికా చార్‌‌ట     
 2) సంబంధాలను సూచించే చార్‌‌ట
 3) ప్రవాహ చార్‌‌ట     4) కాలక్రమ చార్‌‌ట
 
 7.    సాంఘికశాస్త్ర ప్రయోగశాలలో ఉంచదగిన వాతావరణ సంబంధిత పరికరం?
                               (టెట్ - మే 2012)
 1) గొలుసు           2) డివైడర్
 3) బాక్స్ అయస్కాంతం 4) బారోమీటర్
 
 8.    భారత స్వాతంత్య్ర ఉద్యమం అనే పాఠాన్ని బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడు పైకి ఉబికే చిత్రాల పుస్తకాలను ఉపయోగించాడు.  అతడు ఉపయోగించిన ఆ పుస్తకాలు ఏ దృశ్య సాధనాల రకానికి చెందినవి?
                                   (డీఎస్సీ - 2008)
 1) త్రిపార్శ్వ బోధనోపకరణాలు
 2) ద్విపార్శ్వ బోధనోపకరణాలు
 3) కృత్యోపకరణాలు
 4) దృశ్యశ్రవణోపకరణాలు
 
 9.    దేశపటాలను విద్యార్థులతో కచ్చితంగా తయారు చేయించేందుకు ఉత్తమమైన పద్ధతి?
                                  (డీఎస్సీ - 2008)
 1) ఆవరణ పటాలను పూరించే పద్ధతి
 2) స్మృతి ద్వారా చేసే పద్ధతి
 3) పటాలను ట్రేసు తీసే పద్ధతి
 4) నైష్పత్తిక చతురస్రాల పద్ధతి
 
 10.    సముద్రమట్టం నుంచి 400 మీటర్ల ఎత్తులో గల ఒక కొండను పటంలో ఏ రంగుతో సూచించాలి? (డీఎస్సీ - 2008)
 1) ఎరుపు     2) పసుపు
 3) చిక్కని ఆకుపచ్చ     4) తేలికైన ఆకుపచ్చ
 
 11.    వివిధ రకాల మ్యాపులు, చార్‌‌టల తయారీకి సంబంధించిన శాస్త్రం? (డీఎస్సీ - 2008)
 1) కార్టోగ్రఫీ     2) ఫోటోగ్రఫీ
 3) ఫోటోగ్రమెట్రీ      4) టోపోగ్రఫీ
 
 12.    రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం అనే పాఠాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు జర్మనీలో, ఇటలీలో ఏకకాలంలో జరిగిన సంఘటనలను వివరించేందుకు ఉపయోగించే కాలరేఖ చార్‌‌ట? (డీఎస్సీ-2008)
 1) తిరోగమన కాలరేఖ చార్‌‌ట
 2) పురోగమన కాలరేఖ చార్‌‌ట
 3) సచిత్ర కాలరేఖ చార్‌‌ట
 4) సమకాలిన కాలరేఖ చార్‌‌ట
 
 13.    భూమి ఆవరణాలు అనే పాఠాన్ని బోధించేందుకు తోడ్పడే ఉత్తమమైన బోధనోపకరణం? (డీఎస్సీ - 2012)
 1) నమూనా     2) డెమోరమా
 3) భౌతికపటం     4) రంగులపటం
 
 14.    ఒక కాలంలోని సంఘటనలను ప్రస్తుత కాలం నుంచి భూతకాలం వరకు, భూతకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు చూపే కాలరేఖలు వరుసగా? (డీఎస్సీ - 2012)
 1) తిరోగమన కాలరేఖలు, పురోగమన
 కాలరేఖలు     
 2) పురోగమన కాలరేఖలు, తిరోగమన
 కాలరేఖలు
 3) తిరోగమన కాలరేఖలు, సచిత్ర
 కాలరేఖలు
 4) సచిత్ర కాలరేఖలు, పురోగమన
 కాలరేఖలు
 
 15.    మ్యాప్, గ్లోబ్‌లు వరుసగా?
                            (డీఎస్సీ - 2012)
 1) త్రిమితీయంగా భూ
 ఉపరితలాన్ని చూపుతాయి
 2) చదునుగా భూ ఉపరితలాన్ని
 చూపుతాయి
 3) త్రిమితీయంగా, చదునుగా భూ
 ఉపరితలాన్ని చూపుతాయి
 4) చదునుగా, త్రిమితీయంగా భూ
 ఉపరితలాన్ని చూపుతాయి
 
 16.    సతత హరిత అరణ్యాలను మ్యాప్‌పై సూచించేందుకు ఉపయోగించే రంగు?
                               (డీఎస్సీ - 2012)
 1) తేలికైన ఆకుపచ్చ    
 2) ముదురు ఆకుపచ్చ
 3) తేలికైన చామనఛాయ
 4) పసుపు ఆకుపచ్చ
 
 17.    కార్టూన్‌లు, తోలు బొమ్మలు వరుసగా?     
               (డీఎస్సీ - 2012)
 1) త్రిపార్శ్వ బోధనోపకరణం, ద్విపార్శ్వ
 బోధనోపకరణం
 2) ద్విపార్శ్వ బోధనోపకరణం, త్రిపార్శ్వ
 బోధనోపకరణం
 3) రెండూ ద్విపార్శ్వ బోధనోపకరణాలే
 4) రెండూ త్రిపార్శ్వ బోధనోపకరణాలే
 
 18.    ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా గోల్కోండ కోటకు సందర్శనను ఏర్పాటు చేశాడు. ఆ కోట ఏ రకమైన మూలాధారం? (డీఎస్సీ - 2012)
 1) పురావస్తు సంబంధ ఆధారం
 2) మౌలిక సంప్రదాయం
 3) శాసనాలు     4) లిఖిత ఆధారాలు
 
 19.    ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్యబోధనలో భాగంగా దగ్గరలోని  మ్యూజియానికి సందర్శనను ఏర్పాటు చేశాడు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన వనరు ఏ రకానికి చెందుతుంది?
                       (డీఎస్సీ - 2012)
 1) మతసంబంధ వనరు
 2) చారిత్రక వనరు
 3) ఆర్థిక వనరు     4) భౌగోళిక వనరు
 
 20.    బ్యాంక్, బాలభవన్ అనేవి ఏ రకమైన వనరులకు ఉదాహరణలు?
 1) రెండూ ఆర్థిక విలువగల వనరులే
 2) రెండూ సాంస్కృతిక విలువగల వనరులే
 3) ఆర్థిక, సాంస్కృతిక విలువగల వనరు
 4) సాంస్కృతిక, ఆర్థిక విలువ కలిగిన వనరు
 
 21.    కొండ ప్రాంతంలోని రోడ్లను మ్యాప్‌లో సూచించేందుకు ఏ రేఖలను ఉపయోగిస్తారు?
 1) సరళరేఖలు      2) వక్రరేఖలు
 3) వలయరేఖలు     4) వాలురేఖలు
 
 22.    మ్యూజ్ (కఠట్ఛ) అంటే..?
 1) ఉపయోగించిన వస్తువుల సముదాయం
 2) విద్యాదేవత ఆలయం
 3) ప్రాచీన కాల ఆరాధ్యదేవత పేరు
 4) పురాతన నాగరికత అవశేషాల కేంద్రం
 
 23.    పాఠశాలల్లో అధ్యయన కేంద్రాలను స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం?
         1) పాఠ్యేతర అంశాలను విద్యార్థులకు
 తెలియచెప్పడానికి     
 2) పాఠ్యాంశాల అదనపు విషయ
 సామగ్రిని అందుబాటులోకి తేవడానికి
 3) తరగతికి స్థాయికి తగిన సామర్థ్యాలు
 లేనివారి విద్యా ప్రయోజనాలకు
 4) పాఠశాలకు తరచూ గైర్హాజరయ్యే
 విద్యార్థుల విజ్ఞాన వికాసానికి
 
 24.    విద్యార్థులను బొర్రా గుహలకు విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లారు. ఏ విలువ గల వనరుల దర్శనానికి విద్యార్థులు వెళ్లారని చెప్పొచ్చు?
 1) సాంస్కృతిక      2) చారిత్రక
 3) శాస్త్రీయ          4) భౌగోళిక
 
 25.    విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్లారు. అంటే...?
 1) సమాజాన్ని విద్యార్థుల వద్దకు
 తీసుకెళ్లడం
 2) పాఠశాలను సమాజం వద్దకు
 తీసుకెళ్లడం
 3) అధ్యయన అంశాలను మెరుగుపర్చడం
 4) పాఠ్యేతర అంశాలను విద్యార్థులకు
 పరిచయం చేయడం
 
 26.    విద్యార్థుల్లో అంతర్‌దృష్టి వికాసం, సహకార భావం పెంపొందాలంటే తోడ్పడేవి?
 1) పాఠశాల శిబిరాలు
 2) క్షేత్ర పర్యటనలు
 3) సాంఘిక సేవా కార్యక్రమాలు
 4) అధ్యయన కేంద్రాలు
 
 27.    పాఠశాల పౌర శిక్షణా కార్యక్రమాల్లోని ప్రధాన కార్యకలాపం?
 1) స్వచ్ఛంద సేవ     
 2)పాఠశాల క్రమశిక్షణ నియమావళి     రూపకల్పన
 3) విద్యార్థుల్లో పౌరనీతిని అభివృద్ధి చేయడం
 4) పాఠశాల పార్లమెంట్ నిర్వహణ
 
 28.    విజ్ఞాన యాత్రలు... అధ్యయనం, ప్రయాణం, పరిశీలన, విజ్ఞానానికి ద్వారాలు అని చెప్పినవారు?
 1) శామ్యూల్ జాన్సన్    2) ఎడ్గర్ డేల్
 3) మేక్సన్               4) కిల్‌పాట్రిక్
 
 29.    విద్యార్థి ఒక దినపత్రిక నుంచి విషయ సామగ్రిని సేకరించాడు. ఆ పత్రిక దేనికి చెందినదిగా చెప్పొచ్చు?
 1) ప్రధాన ఆకారాలు
 2) ప్రాథమిక ఆకారాలు
 3) ద్వితీయ ఆకారాలు
 4) తృతీయ ఆకారాలు
 
 30.    వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వచ్చే మార్పులను చూపించడానికి ఉపయోగించే గ్రాఫ్?
 1) సచిత్ర గ్రాఫ్     2) బార్ గ్రాఫ్
 3) లైన్ గ్రాఫ్     4) వలయ గ్రాఫ్
 
 31.    రాష్ర్టపతికి గల అధికారాలను అర్థవంతంగా బోధించాలంటే ఉపయోగించే చార్‌‌ట?
 1) టేబుల్ చార్‌‌ట    2) ఫ్లో చార్‌‌ట
 3) పంపిణీ చార్‌‌ట    4) స్ట్రిప్ చార్‌‌ట
 
 32.    భూమి ఉపరితల పత్రికలు అని వేటిని అంటారు?
 1) చార్‌‌టలు     2) మ్యాప్‌లు
 3) గ్లోబులు     4) నమూనాలు
 
 33.    మ్యాప్‌లను తయారు చేయడానికి నైష్పత్తిక చతురస్రాల పద్ధతి కంటే సులభమైనది?
 1) ప్రక్షేపన పద్ధతి     2) ప్రకల్పనా పద్ధతి
 3) త్రిమితీయ విస్తరణ పద్ధతి
 4) సెల్యూలాయిడ్ పద్ధతి
 
 34.    మన రాష్ర్టంలో మొదటిసారిగా విద్యార్థుల కృత్యాధార అభ్యసనానికి అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని అందించిన పథకం?
 1) ఏపీపీఈపీ     2) ఓబీబీ
 3) డీపీఈపీ       4) ఎస్‌ఎస్‌ఏ (ఆర్‌వీఎం)
 
 35.    పాఠ్య విషయం విద్యార్థులకు ఆసక్తి దాయకంగా ఉండాలంటే బోధనాభ్యసన సామగ్రి ఎలా ఉండాలి?
 1) నిత్యనూతనంగా ఉండాలి
 2) మంచి విలువ కలిగి ఉండాలి
 3) స్థానికంగా తయారు చేసి ఉండాలి
 4) విద్యార్థులు గతంలో చూసినవై ఉండాలి
 
 36.    కింది వాటిలో గ్రాఫిక్ ఉపకరణం కానిది?
 1) ఫ్లాష్‌కార్‌‌డలు     2) పటాలు
 3) కార్టూన్లు     4) నమూనాలు
 
 37.    పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గురించి విద్యార్థులకు వివరించడానికి అనువైన పటాలు?
 1) భౌగోళిక పటాలు 2) రాజకీయ పటాలు
 3) భౌగోళిక రాజకీయ పటాలు
 4) రిలీఫ్ పటాలు
 
 38.    రిలీఫ్ పటాలు ఎలా ఉంటాయి?
         1) ఎత్తు పల్లాలతో తయారై ఉంటాయి?
 2) ఇవి త్రిమితీయ పటాలు
 3) వివిధ రంగులతో వుంటాయి
 4) పైవన్నీ
 
 39.    విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించే చార్‌‌టలు?
 1) స్ట్రిప్‌టీజ్ చార్‌‌టలు
 2) టైమ్‌లైన్ చార్‌‌టలు
 3) ఫ్లో చార్‌‌టలు     4) ట్రీ చార్‌‌టలు
 
 40.    మన జాతీయాదాయానికి వివిధ ఆదాయ  వనరుల నుంచి ఎంత శాతంలో ఆదాయం వచ్చిందో విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించడానికి అనువైన గ్రాఫ్?
 1) సచిత్ర గ్రాఫ్     2) పై గ్రాఫ్
 3) బార్ గ్రాఫ్     4) లైన్ గ్రాఫ్
 
 41.    నల్లబల్లను సక్రమంగా వాడడానికి గల నియమాల్లో ఇది ఉండదు?
 1) నల్లబల్లపై రాసే అక్షరాల సైజు 21/2
 అంగుళాల వ్యాసంతో ఉండాలి     
 2) క్లిష్టమైన అంశాలను, డయాగ్రామ్‌ను
 ముందే రాసుకుని లేదా గీసి ఉంచాలి
 3) పాఠ్య విషయాన్ని స్పష్టంగా వివరిస్తూనే
 బోర్‌‌డపై ముఖ్యాంశాలు రాయాలి     
 4) విద్యార్థులు కూడా నల్లబల్లపై రాసేలా
 చర్యలు తీసుకోవాలి
 
 42. ఏ బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి బోధించే ఉపాధ్యాయుడు అంటే ప్రఖ్యాత విద్యావేత్త  కోమీనియన్‌కు చాలా ఇష్టం?
 1) నల్లబల్ల    2) స్పెసిమెన్‌లు
 3) చార్‌‌టలు, గ్రాఫ్‌లు
 4) స్లైడ్‌లు, ఫిల్మ్ స్ట్రిప్‌లు
 
 43.    {పాచీన మానవుడు ఉపయోగించిన వస్తువుల గురించి బోధించేటప్పుడు విద్యార్థులకు ఆసక్తిదాయకంగా ఉండడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించాల్సిన బోధనాభ్యసన సామగ్రి?
 1) స్పెసిమెన్‌లు         
 2) ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్
 3) స్లైడ్‌లు     4) చిత్రాలు
 
 44.    పాఠశాలలో బోధనాభ్యసన సామగ్రిని భద్రపర్చే బాధ్యతను ఎవరు నిర్వహించడం ఉత్తమం?
 1) సంబంధిత ఉపాధ్యాయుడు
 2) ప్రధానోపాధ్యాయుడు
 3) అటెండర్     4) విద్యార్థులు
 
 45.    పాఠశాలల్లో ఎక్కువగా ఉపయోగించే మ్యాప్‌లు?
 1) రిలీఫ్ మ్యాప్‌లు     
 2) త్రీ డెమైన్షనల్ మ్యాప్‌లు
 3) ఫ్లాట్‌మ్యాప్‌లు     
 4) స్పెసిమెన్ మ్యాప్‌లు
 
 సమాధానాలు
 1)  2;    2)  1;    3) 2;    4)  3;   5)  1;
 6)  1;    7)  4;    8) 3;    9)  4;   10) 4;
 11) 3;    12) 2;    13)2;   14) 1;   15) 4;    
 16) 2;    17) 2;    18)1;   19) 2;   20) 3;
  21) 4;  22) 2;    23)3;   24) 4;   25) 2;
  26) 1;    27) 4;    28)1;   29) 4;   30) 3;    
 31) 2;    32) 2;    33)1;   34) 1;   35) 1;
 36) 4;    37) 3;    38)4;   39) 1;   40) 2;
 41) 3;     42) 2;     43) 1;  44) 4;   45) 3

మరిన్ని వార్తలు