విజయానికి e సాధన!

18 Nov, 2014 01:13 IST|Sakshi
విజయానికి e సాధన!

బ్యాంకు కొలువుకైనా.. బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికైనా.. నేటి హైటెక్ కాలంలో పరీక్షల నిర్వహణలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ పరీక్షలు (Online Tests) సర్వసాధారణమయ్యాయి. సంప్రదాయ ‘పేపర్-పెన్సిల్’ పరీక్షకు కాలం చెల్లి, ‘క్లిక్’ల పరీక్షలే కీలకమవుతున్నాయి. క్యాట్, గేట్ వంటి పరీక్షలతో పాటు బ్యాంకు క్లరికల్, పీవో వంటి పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ రైల్వే పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని పరీక్షలు ఇదే విధానంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ పరీక్షల్లో విజయానికి మార్గాలపై స్పెషల్ ఫోకస్..
 
 విజయం ఖాయానికి
 ఉద్యోగాన్ని లేదంటే ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశాన్ని ఖాయం చేసుకోవాలంటే సరైన సన్నద్ధత అవసరం. ఈ క్రమంలో సబ్జెక్టుల వారీగా, మొత్తం సబ్జెక్టులకు సంబంధించి మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష విస్తరిస్తున్న నేటి పరిస్థితుల్లో ఇదే విధానంలో మాక్ టెస్ట్‌లు రాయాల్సి ఉంటుంది. దీనివల్ల వాస్తవ పరీక్ష విధానానికి అలవాటుపడొచ్చు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు వీలుంటుంది. అందుకే శిక్షణ సంస్థలు కొంత రుసుం వసూలు చేసి అభ్యర్థులకు ఆన్‌లైన్ విధానంలో ప్రాక్టీస్‌కు వీలుకల్పిస్తున్నాయి.
 
 ‘నెట్’ఇంట్లో ప్రాక్టీస్
 ఆన్‌లైన్ పరీక్ష విధానానికి అలవాటుపడేందుకు, కోరుకున్నంత ప్రాక్టీస్‌కు వీలుకల్పిస్తోంది ఇంటర్నెట్. ఐబీపీఎస్ క్లరికల్, పీవో; ఎస్‌బీఐ క్లరికల్, పీవో; జేఈఈ; క్యాట్; గేట్ తదితర పరీక్షలకు సంబంధించి లెక్కలేనన్ని ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లను అందించే వెబ్‌సైట్లు చాలా అందుబాటులో ఉన్నాయి. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా విభాగాల వారీగా లేదంటే పరీక్షల వారీగా మాక్ టెస్ట్‌లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఉచితం కాగా మరికొన్ని రుసుం చెల్లించాల్సినవి. రిజిస్ట్రేషన్ చేసుకొని, వీలున్నప్పుడు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల సహాయంతో వెబ్‌సైట్లలోకి లాగిన్ అయి పరీక్షలు రాయొచ్చు.
 
 సరళంగా, వివరంగా....
 వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పరీక్షలు రాసిన తర్వాత వచ్చిన స్కోర్, తప్పుగా సమాధానం గుర్తించిన ప్రశ్నలు-వాటికి సరైన సమాధానాలు, వివరణలు ఇలా వివిధ అంశాలు తేలిగ్గా క్లిక్‌లతోనే తెరపై ప్రత్యక్ష మవుతాయి. ‘వ్యూ ఆన్సర్’; ‘ఎక్స్‌ప్లనేషన్’, ‘రిపోర్ట్’; డిస్కస్ ఇన్ ఫోరమ్ (ఇందులో వివరణతో పాటు అదనపు సమాచారం తెలుసుకునేందుకు లింక్ కూడా ఇస్తున్నాయి) వంటి ఆప్షన్ల ద్వారా ఇవి సాధ్యపడతాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరగనటువంటి పరీక్షలకు కూడా ఈ విధానంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు.  
 
 సాక్షి ప్రత్యేక వెబ్ పోర్టల్
 విద్యార్థులు, ఉద్యోగార్థుల విజయానికి అండగా నిలుస్తున్న ‘సాక్షి’ మరో అడుగు ముందుకేసి ఆన్‌లైన్ పరీక్షలకు ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ఇందులో అతి తక్కువ ఖర్చుతో సులువుగా సాధన చేసుకునేందుకు వీలుగా టెస్ట్ సిరీస్‌లు ఉన్నాయి.
     ఆన్‌లైన్ పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు    ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. తొలుత ఆయా పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా పరీక్షలు రాయాలి. మొత్తం సిలబస్ చదవడం పూర్తయ్యాక గ్రాండ్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. వీటికోసం సాక్షి ఆన్‌లైన్ టెస్ట్ పోర్టల్ సరైన వేదిక.
 అందుబాటులో ఉన్న పరీక్షలు: సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంక్స్, గ్రూప్స్, డీఎస్సీ, వీఆర్‌వో, రైల్వే, ఆర్మీ, పోలీస్, ఎంసెట్, జేఈఈ, ఐసెట్ తదితర పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌లు, లైవ్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
 
 ప్రత్యేకతలు:
 ఆన్‌లైన్ పరీక్షలపై రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్.
 ఏ సమయంలోనైనా, ఎన్నిసార్లయినా ప్రాక్టీస్ చేసుకునే వీలు.
 అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలు.
 పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడ్‌లతో కూడిన ఫలితాల వెల్లడి.
 గ్రాఫిక్ రూపంలో ప్రతిభా రిపోర్టుతో పాటు సబ్జెక్టుల వారీగా బలాలు, బలహీనతలపై విశ్లేషణ.
 మొబైల్, ఈ-మెయిల్‌కు ఫలితాలు, ర్యాంకులు.
 వెబ్‌సైట్: http://onlinetests. sakshieducation.com
 

మరిన్ని వార్తలు