మానవాభివృద్ధి సూచీలో మొదటి స్థానం పొందిన దేశం?

3 Aug, 2014 22:51 IST|Sakshi
మానవాభివృద్ధి సూచీలో మొదటి స్థానం పొందిన దేశం?

Civils Prelims
Paper - I
 ఎకానమీ
సాంఘిక అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి

 వస్తు, సేవల ఉత్పత్తిలోని పెరుగుదలను ఆర్థిక వృద్ధిగా పరిగణిస్తాం. ప్రతిపౌరుడు కనీస అవసరాలు పొందగలిగిన స్థితిని సాంఘిక అభివృద్ధిగా భావించవచ్చు. ఆర్థికవృద్ధిని ఆట్చౌఛ్ఛీట ్ఛఛ్ఛిలో చూసినప్పుడు సాంఘికాభివృద్ధి ఆర్థికాభివృద్ధిలో మిళితమై ఉంటుంది. ఈ స్థితిని సమ్మిళిత వృద్ధిగా భావిస్తాం. మరోవైపు సాంఘి క అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి రెండూ వేర్వేరు అని కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం. సాంఘిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి ఒకే రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆదాయస్థాయి, మానవాభివృద్ధిలో దేశాలు ఒకే స్థానాన్ని పొందలేకపోవడాన్ని బట్టి సాంఘిక, ఆర్థిక అభివృద్ధిని వేర్వేరుగా భావించవచ్చు.
 
 భారత్‌లో ఐదు దశల ఆర్థిక వృద్ధి
 1.    మొదటి దశలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంపై ఆర్థిక వ్యవస్థ దృష్టి కేంద్రీకరిస్తుంది. మూలధన కల్పనరేటు పెంచడం ద్వారా వస్తు, సేవల ఉత్పత్తిని అధికం చేసినప్పుడు ఆర్థికవృద్ధిని గమనించవచ్చు. ఈ వృద్ధి ద్వారా ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు పొందగలరు. ఆర్థికవృద్ధిని వేగవంతం చేయడం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది.
 
 2.    రెండో దశలో ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడా, ఆదాయ పంపిణీలాంటి అంశాలు చర్చనీయాంశంగా ఉంటాయి. సమానంగా, స్వతంత్ర లక్ష్యంగా ఆర్థిక వృద్ధి ఫలాల పంపిణీ రూపొందుతుంది. అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థల్లో ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి ముఖ్యాంశంగా ఉంటుంది.
 
 3.    మూడో దశలో సమానత్వం అనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఆహా రం, విద్య, శుభ్రమైన తాగునీరు, ఆరోగ్య సేవలు లాంటి కనీస అవసరాలు ప్రజలందరికీ లభ్యమవుతున్నాయా? లేదా అనే అంశంపై దృష్టి ఎక్కువగా ఉంటుంది.
 
 4.    నాలుగో దశలో సుస్థిర వృద్ధి సాధన ఆర్థిక వృద్ధిలో భాగంగా ఉంటుంది. పర్యావరణ క్షీణతను అరికట్టి ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా సుస్థిర వృద్ధి ప్రధానమైంది.
 
 5.     ఐదో దశలో మానవాభివృద్ధి ప్రధాన మైంది. ప్రజల జీవన నాణ్యత మెరుగుపర్చడానికి చర్యలు అవసరం. మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంతోపాటు ప్రజలు తమ సామర్థ్యాన్ని వినియోగించుకునే విధంగా శిక్షణను ఇచ్చి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
 
విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ వ్యయం
భారత్‌లో విద్య, ఆరోగ్య రంగాలపై తలసరి ప్రభుత్వ వ్యయంలో తేడా వల్ల మానవాభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగాయి. తమిళనాడు, హర్యానా, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో విద్యపై తలసరి ప్రభుత్వ వ్యయం ఎక్కువ కాగా, జమ్మూ కాశ్మీర్‌లో అతి తక్కువ (రూ.11)గా నమోదైంది. బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వరుస క్రమంలో విద్యపై తలసరి ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉంది. ప్రణాళికా సంఘం ప్రకారం... ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయం గోవా (రూ. 861)లో ఎక్కువ కాగా, తర్వాత స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్ (రూ.630), ఢిల్లీ (రూ. 560), జమ్మూ కాశ్మీర్ (రూ.512) రాష్ట్రాలు నిలిచాయి.
 
తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (రూ. 128), మధ్యప్రదేశ్ (రూ. 146), చత్తీస్‌గఢ్ (రూ. 146), అసోం (రూ. 162) రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్‌లో తక్కువ (రూ. 93)గా తలసరి ప్రభుత్వ వ్యయం నమోదైంది. స్వాతంత్య్రానంతరం భారత్‌లో విద్య, ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడిన కారణంగా అక్షరాస్యత, ప్రజల ఆయుర్దాయంలో పెరుగుదల ఏర్పడింది. కానీ బంగ్లాదేశ్, బ్రెజిల్, మెక్సికోలాంటి దేశాలతో పోల్చినప్పుడు ప్రాథమిక విద్యలో డ్రాప్ అవుట్ల సంఖ్య, ఐదేళ్ల వయసులోపు వారితో పాటు శిశు, ప్రసూతి మరణాలు లాంటి సూచికల్లో భారత్ స్థితి ఆశాజనకంగా లేదు. అదేవిధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్యం లభించే ప్రజల శాతం, 5 నుంచి 69 నెలల్లోపు రక్త హీనతతో బాధపడే పిల్లల సంఖ్య లాంటి సూచికల విషయంలోనూ భారత్ ఇలాంటి స్థితినే ఎదుర్కొంటోంది.
 
వృద్ధి, మానవాభివృద్ధి మధ్య సంబంధం
ప్రాథమిక స్థాయిలో ఆర్థికవృద్ధి, సాంఘిక అభివృద్ధి లేదా మానవాభివృద్ధి మధ్య ఏ విధమైన వివాదమూ లేదు. మానవుని భౌతిక శ్రేయస్సు పెంపులో విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం భాగంగా ఉంటాయి. సాంఘికాభివృద్ధి సాధనకు రెండు మార్గాలను ఎంచుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించిన క్రమంలో కలిగే లబ్ధ్ది అన్ని వర్గాల ప్రజలకు చేకూరడం ఒక మార్గం. ఈ వ్యూహాన్ని ట్రికిల్‌డౌన్ వ్యూహంగా వర్గీకరించవచ్చు. ట్రికిల్‌డౌన్ వ్యూహం అమలు కావాలంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధిని సాధించాలి. స్వాతంత్య్రానంతరం మొదటి మూడు దశాబ్దాల్లో సాధించిన వృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకు చేరలేదు.
 
ఈ క్రమంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహంగా సాంఘిక అవస్థాపనలపై దృష్టి కేంద్రీకరించాలి. విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, శుభ్రమైన తాగునీరు లాంటి సౌకర్యాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. భారత్‌తోపాటు ఇతర ఏ దేశం కూడా ఇలాంటి ప్రత్యేక దృక్పథాన్ని అవలంబించలేదు. ఆయా దేశాల్లో వివిధ కాలాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు ప్రాథమిక విద్య, ఆరోగ్యం లాంటి మౌలిక సౌకర్యాలపై దృష్టి కేంద్రీకరించాయి.
 
మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఆర్థిక వృద్ధిని పెంపొందించగలవని కచ్చితంగా భావించలేం. జాతీయాదాయ వృద్ధిని వేగవంతం చేయడానికి ఈ సౌకర్యాలు ఉపకరిస్తాయి. మరోవైపు ఆర్థికవృద్ధి వేగవంతం కానిదే దీర్ఘ కాలంలో మానవాభివృద్ధిపై వివిధ దేశాలు పెట్టుబడిని నిరంతరం కొనసాగించలేవు. అనేక ప్రాంతాలు, దేశాల్లో మానవాభివృద్ధి సూచికల విషయంలో ఏర్పడిన ప్రగతి ఆర్థికాభివృద్ధికి దారితీయలేదని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.

మానవాభివృద్ధి సూచికలు, ఆర్థికాభివృద్ధి అంశాలను రెండుగా విభజించి తేడాను గమనించినప్పుడు ఆర్థిక వ్యవస్థలో సాంఘిక అలజడులు (Social Unrest) పెరుగుతాయి. ఉదాహరణకు విద్యారంగంలో ప్రగతి కారణంగా చదువుకున్న యువతకు ఉత్పాదకత తోకూడిన ఉపాధిని కల్పించగలగాలి. ఆర్థికవృద్ధి, సాంఘిక అభివృద్ధి ఒకేదశలో పయనించగలిగినప్పుడు రెండూ ప్రయోజనాన్ని పొందగలుగుతాయి. సమానత్వం, వృద్ధి రెండూ సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక దేశాల్లో ఆర్థిక వృద్ధి కారణంగా పేదరికంలో తగ్గుదల సంభవించినట్లు అనుభవ పూర్వక ఆధారా లున్నాయి.
 
అందరికీ సమాన అవకాశాలు కల్పించగలిగినప్పుడే వృద్ధిరేటు పెరుగుతుంది. నిర్లక్ష్యానికి గురైన వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలు అవసరం. అయితే స్వల్ప కాలంలో ఆశించిన ప్రయోజనం కనిపించనప్పటికీ దీర్ఘకాలంలో సామర్థ్య పెంపు ద్వారా ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుంది. పేద ప్రజలు తమ అవకాశాలను మెరుగుపర్చుకునే విధంగా ్కటౌఞౌౌట విధానాలు అవసరం. ఆయా విధానాలు పేద ప్రజల సామర్థ్యం పెంపునకు దారితీస్తాయి. Pro-poor విధానాల్లో భాగంగా ఆదాయ బదిలీలే కాకుండా పేద ప్రజలు ఆధారపడిన అనేక రంగాలపై పెట్టుబడి పెరిగే విధంగా చర్యలు అవసరం. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వ్యవసాయ రంగ వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి.
 
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఇతర సాంఘిక సేవలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. మానవాభివృద్ధి నివేదిక 1991 మానవ వ్యయ నిష్పత్తి (Human Expenditure)ని ప్రవేశపెట్టింది. ప్రాథమిక విద్య, పౌష్టికాహారం, వాటర్ సప్లయ్, పారిశుధ్యం లాంటి వాటిపై జాతీయాదాయంలో ఎంతశాతాన్ని వ్యయం చేశారో తెలుసుకోవడానికి ఈ నిష్పత్తి ఉపకరిస్తుంది. మానవాభివృద్ధిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధించాలంటే మానవ వ్యయ నిష్పత్తి 5 శాతంగా ఉండాలని ఈ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు సాంఘిక అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
 
సమ్మిళిత వృద్ధి వ్యూహం -సమస్యలు
అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో సమ్మిళిత వృద్ధి వ్యూహం సాధనలో భాగంగా కింద పేర్కొన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
 1.    పేదరికం: ప్రపంచబ్యాంక్ ప్రకారం భారత్‌లో 456 మిలియన్ల ప్రజలు దారిద్య్రరేఖ దిగువన నివసిస్తున్నారు. మొత్తం దేశ జనాభాలో వీరి వాటా 42శాతం.
 
 2.    ఉపాధి: భారత్‌లో మొత్తం ఉపాధిలో అసంఘటిత రంగం వాటా 85 శాతం.
 
 3.    వ్యవసాయ రంగం: ప్రకృతి వైపరీత్యాలు, తక్కువ వర్షపాతం, భూ కేటాయింపుల్లో ఎదురవుతున్న సమస్యలు
 
 4.    సాంఘికాభివృద్ధి: విద్య, ఆరోగ్య ప్రమాణాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో లేకపోవడం, మానవాభివృద్ధి సూచీలో ఉన్న మొత్తం 187 దేశాల్లో భారత్ 135వ స్థానాన్ని పొందడం.
 
 5.    ప్రాంతీయ అసమానతలు: తలసరి ఆదాయంలో రాష్ట్రాల మధ్య అసమానతలు ఎక్కువ. బాలికల్లో శిశు మరణాల రేటు కేరళలో తక్కువగా ఉంటే, మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉంది. కేరళలో మహిళా అక్షరాస్యతా రేటు ఎక్కువ కాగా, బీహార్‌లో తక్కువ. పేద రాష్ట్రాలతో పోల్చినప్పుడు ధనిక రాష్ట్రాల్లో వృద్ధిరేటు అధికంగా ఉంటోంది.
 
 11వ ప్రణాళిక - సమ్మిళిత వృద్ధికి చర్యలు
 1.    ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలకు ప్రోత్సాహం
 2.    సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికీకరించడం
 3.    రాష్ర్ట ప్రభుత్వాలు పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణం కల్పించేదిశగా చర్యలు తీసుకోవడం
 4.    తయారీ రంగంలో ఉపాధిని పెంచేలా శ్రమసాంద్రత పరిజ్ఞానాన్ని వినియోగించడం
 5.    పన్నులు, డ్యూటీలకు సంబంధించి ప్రోత్సాహకాలు
 6.    ప్రతేక, చిన్నతరహా సంస్థల అభివృద్ధికి తోడ్పాటును అందించడం
 7.    మైనింగ్ విధానాన్ని సమీక్షించడం ద్వారా మైనింగ్ కార్యకలాపాల్లో పెట్టుబడి పెంచే విధంగా అవరోధాలను తొలగించడం
 8.    విద్యారంగంలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం
 
 
ముఖ్యమైన ప్రశ్నలు
 1.    ఆర్థికవృద్ధి సరిపోయినంతగా లేకుండా సాంఘిక ప్రగతి సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? చర్చించండి?
 2.    సాంఘికాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి మధ్య (ynergies) తేడాను వివరించండి?
 3.    సాంఘిక రంగాలపై వ్యయం సాంఘిక ప్రగతికి దారితీస్తుందని మీరు భావిస్తున్నారా?
 4.    సాంఘిక రంగాలపై వ్యయం ద్వారా మంచి ప్రతిఫలం పొందడానికి అవసరమైన సంస్థాపరమైన (Organisati-onal), ప్రోత్సహించే (Motivational) కారకాలను పేర్కొనండి?
 5.    సాంఘిక అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం, ప్రైవేట్ రంగ పాత్ర వివరించండి?
 
మాదిరి ప్రశ్నలు
 1.    మానవ వ్యయ నిష్పత్తి (Human Expd, Index)ని ఏ నివేదిక ప్రవేశపెట్టింది?
     1) మానవాభివృద్ధి నివేదిక 1991
     2) మానవాభివృద్ధి నివేదిక 1992
     3) మానవాభివృద్ధి నివేదిక 1994
     4) మానవాభివృద్ధి నివేదిక 1996
 2.    మానవాభివృద్ధి నివేదిక 2014 ప్రకారం మానవాభివృద్ధిలో భారత్ స్థానం?
     1)133         2) 122
     3)136     4) 135
 3.    విద్యారంగంలో తలసరి ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉన్న రాష్ర్టం?
     1) జమ్మూ కాశ్మీర్    2) మధ్యప్రదేశ్
     3) రాజస్థాన్    4) కేరళ
 4.    అత్యంత ఎక్కువ మానవాభివృద్ధి చెంది నవిగా 2014 మానవాభివృద్ధి నివేదిక ఎన్ని దేశాలను పేర్కొంది?
     1) 49      2) 50    3) 48    4) 54
 5.    మానవాభివృద్ధి సంతృప్తికరమైన ఫలితాలు సాధించాలంటే మానవ వ్యయ నిష్పత్తి ఎంతగా ఉండాలని మానవాభివృద్ధి నివేదిక అభిప్రాయపడింది?
     1) 10 శాతం     2) 9 శాతం
     3) 3 శాతం     4) 5 శాతం
 6.    2014 మానవాభివృద్ధి నివేదిక ప్రకారం మానవాభివృద్ధి సూచీలో మొదటిస్థానం పొందిన దేశం?
     1) నార్వే     2) అమెరికా
     3) స్వీడన్     4) నైజర్
 7.    2014 ఏఈఖ ప్రకారం మానవాభివృద్ధి సూచీలో 187వ స్థానం పొందిన దేశం?
     1) స్వీడన్     2) నైజర్
     3) అమెరికా     4) బ్రెజిల్
 8.    ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయం ఏ రాష్ర్టంలో తక్కువ?
     1) రాజస్థాన్     2) జమ్మూ కాశీర్
     3) మధ్యప్రదేశ్     4)గోవా
 సమాధానాలు
     1) 1;     2) 4;     3) 1;     4) 1;
     5) 4;     6) 1;     7) 2;     8) 4.

మరిన్ని వార్తలు