మానవ నాడీ వ్యవస్థ..నిర్మాణం.. విధులు

29 Aug, 2013 12:12 IST|Sakshi


 సి. హరికృష్ణ
 సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
 
శరీరంలోని వివిధ భాగాల మధ్య వేగవంతమైన సమన్వయానికి ఉపయోగపడేది నాడీ వ్యవస్థ..  సకశేరుకాల్లో ఉన్నతమైన నాడీ వ్యవస్థ ఉంటుంది. జంతువుల్లో పూర్వపరమైన నాడీవ్యవస్థ  ప్రోటోన్యూరాన్‌‌స రూపంలో సీలెంటరేటా అనే వర్గంలో కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా నాడీవ్యవస్థ సంక్లిష్టత పెరుగుతుంది. సకశేరుకాల్లో ముఖ్యంగా క్షీరదాల్లో అత్యంత సంక్లిష్టతతో కూడిన నాడీ వ్యవస్థ ఉంటుంది.
 

మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ మొత్తం ప్రత్యేక నాడీ కణాలు లేదా న్యూరాన్స్ (Nerve cells)తో తయారవుతుంది. నాడీకణాన్ని తొలిసారిగా ఫాసిల్, హిస్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించారు. నాడీ వ్యవస్థ మొత్తం నాడీ కణా లతో తయారవుతుందన్న నాడీకణ సిద్ధాంతాన్ని కజాల్ (cajal) అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. నాడీ వ్యవస్థలోని మెదడు, వెన్నుపాము, నాడులు ఇలా అన్ని భాగాలు నాడీకణాలతోనే తయారవుతాయి. పుట్టినప్పుడు ఉండే నాడీకణాలు ఆ తర్వాత కూడా అదే సంఖ్యలో ఉంటాయి. కారణం శరీరంలో నాడీకణాలకు విభజన శక్తి ఉండదు. మిగతా శరీర భాగాలు కణ విభజన ద్వారా, నాడీకణం పెరుగుదల ద్వారా పరిమాణంలో పెరుగుతాయి. కాబట్టి నాడీకణాలు శరీరంలో అత్యంత పొడవైన కణాలు అయ్యాయి.


 
 నాడీకణ నిర్మాణం: ఇందులో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. సైటిన్ లేదా కణదేహం, ఏక్సాన్. సైటాన్ వెడల్పుగా ఉంటుంది. దీనిలో కేంద్రకం చుట్టూ కణద్రవ్యంలో ప్రత్యేక నిసిల్స్ కణికలు ఉంటాయి. కణదేహం అంచుల నుంచి డెండ్రైట్స్ అనే విభజనలు ఏర్పడతాయి. సైటాన్ నుంచి పొడవుగా సాగే తంతువు వంటి నిర్మాణమే అక్షీయతంతువు లేదా ఏక్సాన్. దీని చివర కూడా టెలీడెండ్రైట్స్ అనే సూక్ష్మ విభజనలు ఉంటాయి. ఏక్సాన్ చుట్టూ మైలిన్ అనే కొవ్వు పదార్థంతో తయారైన ఒక మందమైన పొర ఉంటుంది. ఇది విద్యుత్ బంధకంగా వ్యవహరిస్తుంది.
 
 నాడీకణంలో సాగే నాడీ ప్రచోదనం బయటకు చేరకుండా ఇది అడ్డుకుంటుంది. మైలిన్ పొర లేదా మెడుల్లరీ షీట్‌కు బాహ్యంగా న్యూరిలెమ్మ అనే పల్చటి పొర ఉంటుంది. ఇది మైలిన్ పొర పని తీరును నియంత్రిస్తుంది. మైలిన్ పొర, న్యూరిలెమ్మల మధ్య ష్క్వాన్ కణాలు అనే ప్రత్యేక సూక్ష్మకణాలు ఉంటాయి. ఇవి మైలిన్ పొరను స్రవిస్తాయి. ఏక్సాన్‌పై అక్కడక్కడ మైలిన్ పొర, న్యూరిలెమ్మ లేని నొక్కుల వంటి ప్రాంతాలు ఉంటాయి. వీటిని Ranvier nodes అంటారు. ఇవి నాడీకణం ద్వారా సాగే నాడీ ప్రచోదన వేగాన్ని పెంచుతాయి. ఇలాంటి అనేక నాడీకణాల కట్టను నాడి లేదా ూ్ఛటఠ్ఛి అంటారు. ఒక నాడిలో అనేక నాడీకణాలు ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉంటాయి. ఏ రెండు నాడీకణాలు భౌతికంగా అతుక్కొని ఉండవు. వాటి మధ్య ఉన్న ఖాళీ ప్రాంతాన్ని  నాడీ కణసంధి (synapse) అంటారు.
 


 నాడీ ప్రచోదనం:  శరీరంలో సాగే వేగవంతమైన నాడీ సమాచార ప్రసారం నాడీ ప్రచోదనం. ఇది విద్యుత్ రసాయన ప్రవాహం. ఇది ఒక నాడీ కణంలో  విద్యుత్ రూపంలో ప్రవహిస్తుంది. రెండు నాడీ కణాల మధ్య నాడీ కణ సంధి వద్ద ఒక రసాయన మాధ్యమంతో ముందుకు సాగుతుంది. ఈ విధంగా నాడీ ప్రచోదనంలో ఉపయోగపడే రసాయనాలను నాడీకణ అభివాహక పదార్థాలు లేదా న్యూరో ట్రాన్‌‌సమీటర్లు అంటారు. అసిటైల్ కొలిన్, డోపమైన్, సెంటోనిన్ వంటివి ముఖ్యమైన న్యూరో ట్రాన్‌‌సమీటర్లు.
 
 

నాడీవ్యవస్థ:  మానవ నాడీవ్యవస్థను మూడు భాగాలుగా విభజిస్తారు.  అవి.. కేంద్రనాడీ మండలం, పరధీయ నాడీమండలం, స్వయం చోదిత నాడీమండలం. మెదడు, వెన్నుపాములను కలిపి కేంద్రనాడీమండలం అంటారు.
 

 కీలక భాగం:  మెదడు కీలకమైన భాగం. మెదడు నుంచి సాగే పొడవైన దారం వంటి నిర్మాణం వెన్నుపాము. ఈ రెండింటి చుట్టూ రక్షణ కవచాలుగా మూడు పొరలు ఉంటాయి. వీటిని మెనింజిస్ పొరలు అంటారు. వీటి మధ్య ఉన్న మస్తిష్కమేరు ద్రవం (cerebro spinal fluid) shock absorber గా వ్యవహరిస్తూ మెదడు, వెన్నుపాములను యాంత్రిక అగాధాల నుంచి రక్షిస్తుంది. వీటికి అదనంగా మెదడుకు కపాలం, వెన్నుపాముకు వెన్నెముక రక్షణనిస్తాయి.
 
 

మస్తిష్కం:  మెదడులోని అతిపెద్ద భాగం పూర్వ మెదడులోని ప్రధాన భాగం మస్తిష్కం (cerebrum). ఇది రెండు మస్తిష్క గోళార్థాల రూపంలో ఉంటుంది. దీని ఉపరితలం అంతా గైరీ, సల్సీ పలు ఎత్తుపల్లాలతో కూడిన ముడతలు పడి ఉంటుంది. ఇవి మస్తిష్కం, ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఫలితంగా మస్తిష్కం విధులు బాగా పెరుగుతాయి. ఆలోచన, తెలివి తేటలు, విచక్షణశక్తి, జ్ఞాపకశక్తి సమస్య పరిష్కారం, సాధన, అనుభవం నుంచి నేర్చు కోవడం ప్రేమ, ద్వేషం, బాధ, దుఃఖం, వంటి భావాలను మస్తిష్కం నియంత్రిస్తుంది.
 
 

అనుమస్తిష్కం:
 మస్తిష్కం తర్వాత అతి పెద్దభాగం అనుమస్తిష్కం (cerebellum). ఇది శరీర సమతాస్థితి, కండర సంకోచం, కండర సంకోచ వేగం వంటి చర్యలను నియంత్రిస్తుంది. మెదడు దిగువన పాన్‌‌స, మజ్జాముఖం ఉంటాయి. మెదడు వెన్నుపాముల మధ్య సమాచార మార్పిడికి పాన్‌‌స ఉపకరిస్తుంది. శ్వాస, మింగడం వంటి అనియంత్రిత చర్యలను ఇది నియంత్రిస్తుంది. ఇది చాలా సున్నితమైన భాగం. దీనికి బలమైన గాయమైతే శ్వాస ఆగి వ్యక్తి వెంటనే మరణించే ప్రమాదం ఉంది. మెదడులోని మరో ముఖ్యమైన భాగం అథాపర్వంకం (Hyphothalamus). ఆకలి, దప్పిక, నిద్ర, మెలకువ, లైంగిక వాంఛ, శరీర ఉష్ణోగ్రతలను ఇది నియంత్రిస్తుంది.
 
 

వెన్నుపాము:  వెన్నుపాము మెదడు నుంచి ఒక దారంలాగా కొనసాగుతుంది. ఇది వెన్నెముకలో సంరక్షింపబడుతుంది. ఇది ఒక సెంటీమీటర్ వ్యాసంలో ఉంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్యల్లో పాల్గొంటుంది. వేడి తగిలినపుడు లేదా ఏదైనా గుచ్చుకున్నపుడు ఉన్నట్టుండి స్పందించే చర్యనే అసంక ల్పిత ప్రతీకారచర్య అంటారు. ఇందులో మెదడు ప్రమే యం ఉండదు.
 

పరధీయ నాడీ మండలం :  మెదడు, వెన్నుపాము నుంచి సాగే నాడులను కలిపి పరధీయ నాడీ మండలం అంటారు. మెదడు నుంచి సాగే నాడులను కపాల నాడులు (Cranial nerves) అంటారు. ఇవి 12  జతలు. వెన్నుపాము నుంచి సాగే నాడులు.. వెన్నునాడులు. ఇవి 31 జతలు. విధుల ఆధారంగా వీటిని తిరిగి  మూడు రకాలుగా విభజించవచ్చు. జ్ఞానేంద్రియాల నుంచి మెదడు వెన్నుపాములకు నాడీ సమాచారాన్ని ప్రసారం చేసేవి జ్ఞాననాడులు (sensory nerves). మెదడు, వెన్నుపాముల నుంచి శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్న అస్థికండరాలకు ప్రధానంగా సమాచారాన్ని అందించేవి చాలక నాడులు (Motor nerves). ఈ రెండు రకాల చర్యలను ప్రదర్శించే నాడులు మిశ్రమనాడులు. వెన్నునాడులన్నీ మిశ్రమ నాడులే.
 

స్వయంచోదిత నాడీ మండలం:  శరీర అంతర్భాగాలు అంతటా ఆవరించి ఉన్న ప్రత్యేక నాడీ కేంద్రాల వంటి నిర్మాణం స్వయంచోదిత నాడీమండలం.  ఇది మెదడు, వెన్నుపాములకు స్వతంత్రంగా పని చేస్తుంది.  రెండు రకాలుగా ఉంటుంది. అవి.. సహానుభ్యత నాడీవ్యవస్థ, పరసహానుభ్యత నాడీవ్యవస్థ. పేగు, జీర్ణాశయం, మూత్రపిండాలు, పిత్తాశయం సంకోచాన్ని సహానుభ్యత నాడీవ్యవస్థ ప్రేరేపిస్తుంది. వీటి సడలికను పరసహానుభ్యత నాడీ వ్యవస్థ నిర్వహిస్తుంది. గుండెలయ, లాలాజల స్రావం, రక్తనాళాల సంకోచ సడలికలను కూడా స్వయం చోదిత నాడీవ్యవస్థ నియంత్రిస్తుంది.
 
 

మాదిరి ప్రశ్నలు
  1.పార్కిన్‌సన్స్ వ్యాధి ఏ న్యూరోట్రాన్స్‌మీటర్ లోపం ద్వారా సంభవిస్తుంది?
 ఎ) అసిటైల్ కొలిన్
 బి) డోపమైన్    
 సి) సెరటోనిన్
 డి) హిస్టమైన్
 
 2.మెనింజస్ పొరలో బాహ్యంగా ఉండేవి?
 ఎ) డయామేటర్
 బి) అరక్నాయిడ్
 సి) డ్యూరామేటర్
 డి) ఏదీకాదు
 
 3.మెనింజస్ పొరల వాపు, మెనింజై టిస్ వ్యాధి కారకం?
 ఎ) బ్యాక్టీరియం
 బి) వైరస్    
 సి) శిలీంద్రం
 డి) అన్నీ
 
 4.మెదడులో థర్మోస్టాట్‌గా వ్యవహరించే భాగం?
 ఎ) అథాపర్యంకం
 బి) మస్తిష్కం    
 సి) అనుమస్తిష్కం
 డి) మజ్జముఖం
 
 5.ప్రపంచ అల్జీమర్స్ దినం?
 ఎ) సెప్టెంబర్ 12    
 బి) సెప్టెంబర్ 21
 సి) డిసెంబర్ 21
 డి) డిసెంబర్ 12
 
 6.మస్తిష్క గోళార్థాలను అనుసంధానించే నాడీ దండం?
 ఎ) కార్పస్ కాల్లోజం
 బి) కార్పస్ ఆల్బికన్స్
 సి) కార్పస్ స్ట్రయేట్
 డి) కార్పస్ ల్యూటియం
 
 7.అనుమస్తిష్కం బరువు మెదడులో  ఏ మేరకు ఉంటుంది?
 ఎ) 50 శాతం    
 బి) 30 శాతం
 సి) 20 శాతం     
 డి) 10 శాతం
 
 8.అంథాపర్యంకం బరువు?
 ఎ) 100 గ్రాములు
 బి) 4 గ్రాములు
 సి) 1 గ్రాము     
 డి) 50 గ్రాములు
 
 9.మెదడు విద్యుత్ తీవ్రతను కొలిచే పరికరం?
 ఎ) ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్
 బి) ఎలక్ట్రో ఎన్సిఫలోగ్రాఫ్
 సి) స్ట్రోమర్
 డి) స్ఫిగ్మామానోమీటరు
 
 10.జపనీస్ ఎన్సిఫలైటిస్ వ్యాధి ఏ కీటకం ద్వారా  వ్యాప్తి చెందుతుంది?
 ఎ) అనాఫిలస్ దోమ
 బి) ఎడిస్ దోమ
 సి) క్యూలెక్స్ దోమ
 డి) ఏదీకాదు
 
 11. మెదడు బరువు సాధారణంగా?
 ఎ) 250 గ్రాములు
 బి) 1350గ్రాములు    
 సి) 900 గ్రాములు
 డి) 600 గ్రాములు
 
 12.ఎలక్ట్రోఎన్సిఫలోగ్రాఫ్‌లో మొత్తం ఎన్ని తరంగాల్లో మెదడు విద్యుత్ తీవ్రతను కొలుస్తారు?
 ఎ) 4      
 బి) 3     
 సి) 2    
 డి) 1
 
 13.మస్తిష్క మేరు రసంలో అధిక మోతాదులో ఉండే ఖనిజం?
 ఎ) సోడియం
 బి) పొటాషియం
 సి) క్లోరిన్
 డి) కాల్షియం
 
 14.నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది?
 ఎ) పుణే
 బి) గుర్గావ్
 సి) నాసిక్
 డి) ముంబై
 
 15.ప్రపంచ పార్కిన్‌సన్స్ డే?
 ఎ) జనవరి 22
 బి) ఏప్రిల్ 11
 సి) మే 10     
 డి) జూన్ 21
 
 16.మెదడు క్షిణత వ్యాధి పేరు?
 ఎ) కురు
 బి) స్క్రేపీ
 సి) మ్యాడ్ కౌ వ్యాధి
 డి) అన్నీ
 
 17.శరీర వివిధ భాగల కదలికల మధ్య సమన్వయం లేని స్థితి?
 ఎ) అస్థీనియ
 బి) అటాక్సియ
 సి) డిమెన్షియ     
 డి) ఏదీకాదు
 
 18.అల్జీమర్స్ వ్యాధి గ్రస్తుల ప్రధాన లక్షణం?
 ఎ) మతిమరుపు
 బి) మూర్చ
 సి) గుండెనొప్పి
 డి) కండరనొప్పి
 
 19.నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసెన్సైస్ ఎక్కడ ఉంది?
 ఎ) న్యూఢిల్లీ
 బి) హైదరాబాద్
 సి) బెంగళూరు
 డి) ముంబై
 
 20.హైపోథలామస్ ద్వారా ఏ గ్రంధి నియంత్రణ జరుగుతుంది?
 ఎ) కాలేయం
 బి) పీయూష
 సి) లాలాజల గ్రంధి
 డి) క్లోమం

మరిన్ని వార్తలు