వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?

17 Sep, 2014 23:10 IST|Sakshi
వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?

సోషల్ - మెథడ్స్
బోధనా లక్ష్యాలు- స్పష్టీకరణాలు
అవగాహన: ఉపాధ్యాయుడు తరగతిలో జ్ఞానం అనే లక్ష్యాన్ని బోధించిన తర్వాత అవగాహన అనే లక్ష్యాన్ని సాధించాలి. జ్ఞానం అవగాహనకు సోపానం. అవగాహన అంటే ఏదైనా భావనలను యథాతథంగా కాకుండా అర్థవంతంగా అభ్యసించడం.
 
అవగాహన స్పష్టీకరణలు:
విచక్షణ: విద్యార్థి భావనలు, సూత్రాలు, యధార్థాల మధ్య తేడాలు (తారతమ్యాలు భేదాలు, వ్యత్యాసాలు) గుర్తించడం.
 1.    ప్రత్యక్ష పన్నులకు, పరోక్ష పన్నులకు మధ్య తేడా తెలుసుకోవడం.
 2.    సూర్య, చంద్ర గ్రహణాల మధ్య తేడా తెలుసుకోవడం.
 3.    చెక్కుకు, డ్రాఫ్టుకు మధ్య తేడా తెలుసుకో
 వడం.
 
వర్గీకరించడం: భావనలను విద్యార్థి వివిధ రకాలుగా పేర్కొనడం.
 1.     బడ్జెట్‌ను మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్, సంతులిత బడ్జెట్‌లుగా వర్గీకరించడం.
 2.    నిరుద్యోగాన్ని ఇచ్ఛాపూర్వక, అనిచ్ఛాపూ
 ర్వక నిరుద్యోగంగా వర్గీకరించడం.
 3.    ప్రభుత్వాన్ని శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలుగా వర్గీకరించడం.

సరిపోల్చడం: భావనల మధ్య పోలికలను చెప్పడం.
 1.    జైనమతాన్ని, బౌద్ధమతంతో సరిపోల్చడం.
 2.    గవర్నర్ అధికారాలను రాష్ర్టపతి అధికారా లతో సరిపోల్చడం.
 3.    హైకోర్టు విధులను సుప్రీంకోర్టు విధులతో సరిపోల్చడం.

ఉదాహరణలివ్వడం: ఉపాధ్యాయుడు ఉదాహర ణలివ్వడం ఒక బోధన నైపుణ్యం. దానికి అదనంగా విద్యార్థి మరో ఉదాహరణ ఇచ్చిన ట్లయితే అతడు పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నాడని భావం.
 1.    ఉచిత వస్తువులకు గాలి, నీరు ఉదాహరణగా పేర్కొనడం.
 2.    ఆహార పంటలకు వరి, గోధుమ జొన్న ఉదాహరణగా పేర్కొనడం.
 3.    ఐచ్ఛిక ద్రవ్యానికి చెక్కు, డ్రాఫ్టులను ఉదాహరణగా పేర్కొనడం.

పరస్పర సంబంధాలను గుర్తించడం: వివిధ భావనల మధ్య విద్యార్థి సంబంధాలను గుర్తించడం.
 1.    ధరకు డిమాండ్‌కు మధ్య విలోమ సంబంధాన్ని గుర్తించడం.
 2.    డిమాండ్‌కు సప్లయ్‌కు మధ్య అనులోమ సంబంధాన్ని గుర్తించడం.
 3.    అడవుల నరికివేతకు, వాతావరణ సమతౌ ల్యం దెబ్బ తినడానికి మధ్య సంబంధాన్ని గుర్తించడం.
 
వివరించడం:
 విద్యార్థి ఏదైనా ఒక భావనను సులభం నుంచి క్లిష్టతకు, తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు అర్థవంతంగా చెప్పడాన్ని వివరిం చడం అంటారు.
 1.    విద్యార్థి భూభ్రమణం, భూపరిభ్రమణం అనే అంశాలను అర్థవంతంగా చెప్పడం.
 వ్యాఖ్యానించడం:
 విద్యార్థి దత్తాంశాలను అర్థవంతంగా చెప్పడం.
 1.    1951 నుంచి 2011 వరకు వివిధ దశాబ్దాల్లోని అక్షరాస్యత రేటు ఆధారంగా భారతదేశంలో అక్షరాస్యత పెరిగింది అని వ్యాఖ్యానించడం.
     1951         18.3%
     1991        52.5%
     2001        65%
     2011        74.04%
 తప్పులను గుర్తించడం: విద్యార్థి ఏదైనా ఒక వాక్యంలో తప్పులను గుర్తించడం.
 1.    ‘మొఘలు సామ్రాజ్య స్థాపకుడు అక్బర్’ అనే వాక్యం తప్పు అని విద్యార్థి గుర్తించాడు.
 తప్పులను సరిదిద్దడం: విద్యార్థి ఏదైనా ఒక వాక్యంలో తప్పులను గుర్తించి వాటిని సరి దిద్దడం.
 1.    మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అక్బర్ అనే వాక్యంలోని తప్పును అక్బర్‌కు బదులుగా బాబర్‌గా విద్యార్థి  సరిదిద్దాడు.
 
 గతంలో అడిగిన ప్రశ్నలు
 
 1.    వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?    (డీఎస్సీ-2006)
     1) విచక్షణ చేయడం
     2) ఉదాహరణలు ఇవ్వడం
     3) సాధారణీకరించడం
     4) నమూనాలను తయారుచేయడం
 
2.    ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్య రాజ్యసమితి పాత్రలో ప్రధానంగా అభినందించదగింది?    (డీఎస్సీ-2006)
     1) నైపుణ్యానికి సంబంధించింది
 2)    మానసిక, చలనాత్మక రంగానికి సంబంధించింది
     3) జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది
     4) భావావేశ రంగానికి సంబంధించింది
 
3.    విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫానును చక్రవాత వర్షపాతానికి ఉదాహరణగా పేర్కొన్నాడు.
     ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం?    
     (డీఎస్సీ-2006)
     1) అవగాహన     2) నైపుణ్యం
     3) జ్ఞానం     4) వినియోగం
 
4.    సౌర కుటుంబం పాఠాన్ని 8వ తరగతి విద్యార్థి అభ్యసించిన తర్వాత ఓ రోజు  స్నేహితులతో కలిసి నక్షత్రశాలను సందర్శించాడు. దీన్ని బట్టి అతడు ఏ లక్ష్యాన్ని సాధించాడని చెప్పొచ్చు?        
     (డీఎస్సీ-2004)
     1) వైఖరి     2) అభిరుచి
     3) నైపుణ్యం     4) ప్రశంస
 5.    విద్యావిధానం విద్యా  లక్ష్యాల వైపు పయనిస్తున్నపుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువు?    (డీఎస్సీ-2004)
     1. సామర్థ్యం        
     2. కనీస అభ్యసన స్థాయి
     3. లక్ష్యం     4. ఉద్దేశం
 
 సమాధానాలు
     1) 3;        2) 4;       3) 1;
     4) 2;        5) 3.
 
 
 మాదిరి ప్రశ్నలు
 
 
 1.    బ్లూమ్స్ వర్గీకరించిన జ్ఞానాత్మక రంగం లోని లక్ష్యాలు సరళం నుంచి క్లిష్టతకు ఏ ఆధిక్యత శ్రేణిలో ఉంటాయి?
     1)    జ్ఞానం, అవగాహన, సంశ్లేషణ, విశ్లే షణ, మూల్యాంకనం, వినియోగం
     2)    జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లే షణ, సంశ్లేషణ, మూల్యాంకనం
     3)    జ్ఞానం, అవగాహన, సంశ్లేషణ, విని యోగం, విశ్లేషణ, మూల్యాంకనం
     4)    జ్ఞానం, అవగాహన, మూల్యాంకనం, వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ
 2.    2001 భారతదేశ అక్షరాస్యత రేటు, ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యత రేటుకు సంబంధించిన దత్తాంశాలను వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం    2) అవగాహన
     3) వినియోగం     4) నైపుణ్యం
 3.    మదర్ థెరిసా సేవానిరతిని ప్రశంసించిన విద్యార్థి ఏ రంగంలోని ప్రవర్తనలో మార్పు కలిగింది?
     1) జ్ఞానాత్మక రంగం            2) భావావేశ రంగం
     3) మానసిక చలనాత్మక రంగం        
     4) జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం
 
4.    పరీక్ష మార్కులతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం?
     1) 1961        2) 1971
     3) 1981        4) 1977
 
5.    కిందివాటిలో అవగాహన అనే లక్ష్యానికి సంబంధించింది?
     1) దత్తాంశాలను వ్యాఖ్యానిస్తాడు
     2) దత్తాంశాలను విశ్లేషిస్తాడు
     3) దత్తాంశాల ఆధారంగా పరస్పర సంబంధాలు గుర్తిస్తాడు    
     4) పోలికలు, భేదాలు చెపుతాడు
 
6.    ‘విద్యార్థులు పాలు పంచుకునే గుణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. కానీ లక్ష్య సాధనకు కాదు’ అని అభిప్రాయపడినవారు?
     1) ఆర్‌‌నవెల్    2) జాన్‌సన్
     3) బ్లూమ్స్    4) డివే
 
7.    జర్మనీ ఏకీకరణలో బిస్మార్‌‌క నిర్వహించిన పాత్రను వివరించండి? అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు పరీక్షించదలచుకున్న లక్ష్యం?
     1) జ్ఞానం    2) వినియోగం
     3) అవగాహన    4) నైపుణ్యం
 
8.    నాణేలను సేకరించడం, ఆల్బమ్‌ల్లో చిత్రా లను భద్రపరచడం మొదలైన ప్రవ ర్తనాంశాలను కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) అభిరుచులు    2) వైఖరులు
     3) ప్రశంస    4) వినియోగం

 9.    పటాలను కచ్చితమైన స్కేల్‌తో గీయగలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) వినియోగం    2) నైపుణ్యం
     3) అవగాహన     4) జ్ఞానం
 
10.    కిందివాటిలో వినియోగం అనే లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణం?
     1) పరికల్పన రూపొందించడం        2) వ్యాఖ్యానించడం
     3) ఫలితాలను ఊహించడం
     4) సాధారణీకరించడం
 
11.    కిందివాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించని లక్ష్యం?
     1) సంశ్లేషణ    2) గ్రహించడం
     3) విశ్లేషణ    4) మూల్యాంకనం
 
12.    జాతీయ సమైక్యత అనే పాఠ్యాంశాన్ని విన్న తర్వాత దేశభక్తి, సహనం కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) అభిరుచులు    2) వైఖరులు
     3) వినియోగం    4) ప్రశంస
 
13.    ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం మధ్య  విలోమ సంబంధం పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం

 14.    సూర్య కుటుంబం నమూనాను తయారు చేసిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 
15.    వీచే దిశలను బట్టి పవనాలను వర్గీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 
16.    కింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించని లక్ష్యం?
     1) సహజీకరణం        2) శీల స్థాపనం
     3) ప్రతిస్పందనం       4) వ్యవస్థాపనం
 
17.    భారతదేశంలో అధిక జనాభాకు కారణాలను విశ్లేషించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 
18.    నౌకాశ్రయానికి - ఓడరేవుకు మధ్య  తేడాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 
19.    నీలి విప్లవం అంటే ఏమిటి అనే ప్రశ్న ద్వారా మాపనం చేయదలచుకున్న లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 
20.    హైస్కూల్ విద్యార్థి 10వ తరగతిలో దర్శనీయ ప్రదేశాలు అనే పాఠ్యాంశం విన్న తర్వాత చిత్తూరు జిల్లాలోని తిరుపతిని సందర్శించాడు. ఆ విద్యార్థిలో ఏ రంగంలో మార్పు కలిగింది?
     1) జ్ఞానాత్మక రంగం    
     2) భావావేశ రంగం
     3) మానసిక చలనాత్మక రంగం        4) జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక
         రంగాలు

 21.    గత మూడు రోజుల నివేదిక ఆధారంగా రేపటి ఉష్ణోగ్రతను ఒక విద్యార్థి  ఊహించగలగడం అనే సామర్థ్యం ఏ లక్ష్య సాధనకు సంబంధించింది?
     1) జ్ఞానం     2) అభిరుచి
     3) వినియోగం    4) అవగాహన
 
22.    ఇతరుల మాటలను గౌరవంగా వినడం ఏ బోధనా లక్ష్యానికి సంబంధించింది?
     1) అవగాహన     2) వైఖరి
     3) నైపుణ్యం    4) జ్ఞానం
 
23.    రాజ్యాంగ ప్రవేశికను గుర్తుకు తెచ్చుకున్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) అభిరుచి

 24.    ద్రవ్యాన్ని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం, ఇచ్ఛాపూర్వక ద్రవ్యంగా వర్గీ కరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 
25.    ఎకనమిక్ సర్వే దత్తాంశాల ఆధారంగా మరణ రేటు తగ్గింది అని వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) అభిరుచులు

 26.    సమస్యా పరిష్కార పద్ధతి ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది?
     1) భావావేశ రంగం    
     2) జ్ఞానాత్మక రంగం
     3) మానసిక చలనాత్మక రంగం        4) చలనాత్మక రంగం
 
27.    కింది వాటిలో భావావేశ రంగానికి చెందినవారు?
     1) ఎలిజబెత్ సింపసన్    
     2) డేవిడ్ ఆర్.క్రాత్ హోల్
     3) ఆర్. హెచ్. దావే
     4) హౌరో

 28.    భావావేశ రంగంలో లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు వరుసగా?
     1)    గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవస్థాపనం, విలువకట్టడం, శీల స్థాపనం
     2)    గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం
     3)    గ్రహించడం, ప్రతిస్పందించడం, శీల స్థాపనం, విలువకట్టడం, వ్యవస్థాపనం
     4) గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవ స్థాపనం, శీలస్థాపనం, విలువ కట్టడం

 29.    వివిధ జాతుల మధ్య పరస్పర సంబంధాలను విద్యార్థి ప్రశంసించడం ఏ రంగానికి చెందిన లక్ష్యం?
     1) భావావేశ    2) జ్ఞానాత్మక
     3) మానసిక చలనాత్మక        
     4) పైవేవీ కాదు

 30.    మానసిక చలనాత్మక రంగానికి సంబం ధించిన లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు వరుసగా
     1)    సునిశితత్వం, అనుకరణ, హస్తలాఘ వం, సహజీకరణం, సమన్వయం
     2)    అనుకరణ, హస్తలాఘవం, సునిశి తత్వం, సహజీకరణం
     3)    అనుకరణ, హస్తలాఘవం, సమ న్వయం, సునిశితత్వం, సహజీకరణం
     4)    అనుకరణ, హస్తలాఘవం, సమన్వయం, సునిశితత్వం, సహజీకరణం
 
31.    నైపుణ్యం అనే లక్ష్యాన్ని సాధించడానికి అనువైన పాఠ్యపథక సోపానం?
     1) పునర్విమర్శ      2) గైహికం
     3) సామాన్యీకరణం 4) ప్రావేశిక చర్య
 
32.    నదీ తీర ప్రాంతాల్లో నాగరికతలు అభివృద్ధి చెందడానికి కారణాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) జ్ఞానం     2) అవగాహన
     3) వినియోగం    4) నైపుణ్యం
 
33.    భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర పాఠ్యాం శాలు విన్న విద్యార్థి దేశభక్తిని కలిగి ఉన్నాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం?
     1) అభిరుచులు    2) వైఖరులు
     3) ప్రశంస    4) వినియోగం
 
సమాధానాలు
 1) 2;    2) 2;    3) 4;    4) 2    5) 2;
 6) 2;    7) 3;    8) 1;    9) 2;
 10) 2;    11) 2;    12) 2;    13) 2;
 14) 4;    15) 2;    16) 1;    17) 3;
 18) 2;    19) 1;    20) 2;    21) 3;
 22) 2;    23) 1;    24) 2;    25) 2;
 26) 2;    27) 2;    28) 2;    29) 1;
 30) 2;    31) 2;    32) 3;    33) 2.
 

మరిన్ని వార్తలు