క్లౌడ్ కంప్యూటింగ్..

1 Nov, 2016 01:24 IST|Sakshi
క్లౌడ్ కంప్యూటింగ్..

సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనాలు అందించే విధంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే ‘క్లౌడ్ కంప్యూటింగ్’. దీన్ని ఉపయోగించుకుంటున్న ఐటీ, ఐటీ ఆధారిత సేవల సంస్థల సంఖ్య  బాగా పెరుగుతోంది. దీంతో క్లౌడ్ కంప్యూటింగ్ రంగం విస్తృత ఉద్యోగ అవకాశాలకు కేరాఫ్‌గా మారుతుంది. ఫ్రెషర్స్ మొదలు, అత్యున్నత అనుభవజ్ఞుల వరకు వివిధ స్థాయిల్లోని ఐటీ ఉద్యోగులు ‘క్లౌడ్’పై మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ కంప్యూటింగ్‌పై స్పెషల్ ఫోకస్..
 
 ఐటీ సంస్థలు వివిధ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల సహాయంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. ఈ క్రమంలో భారీ స్థాయిలో డేటా సమకూరుతుంది. దీని నిర్వహణ, స్టోరేజ్.. కంపెనీలకు ఆర్థిక భారంతో కూడుకుంది. దీనికి పరిష్కారంగా వచ్చిన టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగ్. భౌతికంగా ఎలాంటి డేటా స్టోరేజ్ పరికరాలు లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా క్లౌడ్‌తో సేవలందించొచ్చు. కేవలం డేటా స్టోరేజ్‌కే పరిమితం కాకుండా.. సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్‌లను కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అందిస్తోంది.
 
  ఉదాహరణకు సాధారణంగా ప్రతి సంస్థలో ఒక్కో ఉద్యోగికి ఒక సిస్టమ్, అందులో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు, డేటా ఉంటుంది. వీటిని కలుపుతూ సర్వర్లు ఉంటాయి. కానీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో డేటా, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు అన్నీ సర్వర్లలోనే ఉంటాయి. ఈ డేటాను యూజర్లు ఏ డివైజ్ నుంచైనా, ఏ ప్రదేశం నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సర్వర్‌లో క్లయింట్స్‌కు అవసరమైన అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని యూజర్లు ఇంటర్నెట్ ఆధారంగా యాక్సెస్ చేస్తూ డేటా స్టోర్ చేసుకుంటారు. యూజర్లు పొందుపర్చే డేటాను క్లయింట్స్ నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చు.
 
 అవకాశాలు అపారం
 క్లౌడ్‌లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న టాప్ 3 దేశాల్లో భారత్ ఒకటి. 75 లక్షలతో చైనా మొదటి స్థానంలో నిలిచింది. 40 లక్షలతో అమెరికా, 22 లక్షలతో భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో భారీగా క్లౌడ్ ఉద్యోగాల సృష్టి జరగనున్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం 2020 నాటికి క్లౌడ్ కంప్యూటింగ్ 241 బిలియన్ డాలర్ల మేర విలువైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనుంది. అదే స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగనున్నట్లు జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
 
 జాబ్ ప్రొఫైల్స్
 సర్టిఫికేషన్ కోర్సులు లేదా ఐటీ కంపెనీల సొంత శిక్షణ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ లో నైపుణ్యాలు పొందిన వారికి వివిధ జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి..
 
  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
  ప్రాజెక్ట్ మేనేజర్
  బిజినెస్ అనలిస్ట్
  నెట్‌వర్క్ ఆర్కిటెక్ట్
  క్లౌడ్ ఆర్కిటెక్ట్
  క్లౌడ్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్..

 
 క్లౌడ్‌లో రాణించాలంటే..
 క్లౌడ్ కంప్యూటింగ్‌లో రాణించేందుకు లైనక్స్, జావా, డాట్‌నెట్, వర్చువలైజేషన్ టెక్నాలజీస్, డేటా మేనేజ్‌మెంట్, డేటా మైనింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్,  బిగ్ డేటా, గకఠ్చీట్ఛ తదితర టెక్నాలజీలు ఉపయోగ పడతాయి.
 
 క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి అకడమిక్ స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో లేనప్పటికీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఇంజనీరింగ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకొని, సొంతంగా క్లౌడ్ కంప్యూటింగ్ లో శిక్షణ ఇస్తున్నాయి.
 
  సీడాక్, ఐఐఐటీ, జేఎన్‌టీయూ తదితర సంస్థలు సాఫ్ట్‌వేర్ కోర్సుల కరిక్యులంలో క్లౌడ్‌ను చేర్చుతున్నాయి. కొన్ని ఐఐటీలు, ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు క్లౌడ్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికోసం ప్రత్యేక ప్రవేశ ప్రక్రియల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.
 
  క్లౌడ్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, వివిధ సంస్థలు సర్టిఫికేషన్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ టెక్నాలజీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా కోర్సులు అందిస్తున్నాయి. క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్ (సీసీసీ), ఈఎంసీ, వీఎంవేర్ ఇన్‌స్టిట్యూట్లు సర్టిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నాయి.
 

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా