365 రోజులకు కేలండర్ రూపొందించినవారు?

11 Oct, 2014 22:32 IST|Sakshi

*     భారతీయులు గణితశాస్త్రంలో అంకెలను మొదటిసారిగా వాడారు.
*     రాజాజైసింగ్ జంతర్ మంతర్ అనే ఖగోళ పరిశీలనా కేంద్రాలను విద్యాధర భట్టాచార్య అనే   శాస్త్రవేత్త సాయంతో నిర్మించాడు.
*     డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన మొదటి విద్యా కమిషన్  ఏర్పాటైంది.
*    నోబెల్ బహుమతి  అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్త - సి.వి. రామన్
 
 విజ్ఞానశాస్త్ర చరిత్ర
 
సైద్ధాంతిక విజ్ఞానశాస్త్రం గ్రీకుల కాలంలో అభివృద్ధి చెందింది. ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి ఆద్యుడు ‘గెలీలియో గెలీలీ’. ఇతడిని నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు.  బాబిలోనియన్లు మొదటిసారిగా పొడవు, ద్రవ్యరాశి, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలను ఏర్పర్చారు.

*    ఈజిప్షియన్లు 365 రోజులకు కేలండర్ తయారుచేశారు. వీళ్లు నీటితో పనిచేసే గడియారం, సౌర గడియారాన్ని రూపొందించారు.
*     డి రివల్యూషనిబస్ ఆర్బియమ్ ప్రచురణ కర్త          - నికోలస్ కోపర్నికస్
*    విజ్ఞానశాస్త్ర క్రమశిక్షణా విలువను వివరించినవారు     - టీహెచ్ హాక్ల్సి
*    అన్వేషణ పద్ధతిని అభివృద్ధి చేసింది    
     - హెచ్‌ఈ ఆర్‌‌మస్ట్రాంగ్
*  భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు     - టాలెమీ
*   రుగ్వేదంలో సూర్యుని సంవత్సర కాలపరిమితి 12 ఊచల చక్రంగా వివరించారు.
*    అధర్వణ వేదంలో ఐదేళ్లకు ఒకసారి వచ్చే పదమూడో నెల గురించి ప్రస్తావించారు.
*     యజుర్వేదంలో చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి పేర్కొన్నారు.
*    భారతదేశంలో నూతన విద్యావిధాన పితామహుడు     - ఛార్లెస్ గ్రాంట్
*   {పస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసింది         - వుడ్ నివేదిక
*   సెకండరీ విద్యా కమిషన్‌ను 1953లో  ఏర్పాటు చేశారు.
*    సెకండరీ  విద్యా కమిషన్ అధ్యక్షులు
         - డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలియార్
*     డాక్టర్ డి.ఎస్. కొఠారి సారథ్యంలో విద్యా కమిషన్‌ను 1964-66లో ఏర్పాటు చేశారు.
అరిస్టాటిల్‌ను జీవశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు.
*  గెలీలియో గెలీలీని ఆధునిక విజ్ఞానశాస్త్త్ర పితామహుడిగా పేర్కొంటారు.
*     భౌతికశాస్త్ర పితామహునిగా సర్ ఐజాక్ న్యూటన్‌ను పేర్కొంటారు.
*    సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది-
          ఐన్‌స్టీన్
*   భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల్లో ప్రథ ముడు     - ఆర్యభట్ట
*     భారతదేశం తొలి ఉపగ్రహాన్ని 1975లో   ప్రయోగించింది.
*     భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం
     -  ఆర్యభట్ట
*     లీలావతి గణితం అంకగణితానికి  సంబంధించింది.
*     చక్రవాక పద్ధతిని రూపొందించింది
         - భాస్కరుడు
*    బ్లాక్‌హోల్స్‌పై పరిశోధనలు నిర్వహించిన వారు     
- సుబ్రమణ్యం చంద్రశేఖర్
*    లఘులోలకాన్ని ఆవిష్కరించింది
          - గెలీలియో గెలీలీ
*    ఉష్ణమాపకం, పల్స్‌మీటర్‌ను కనుగొన్నది            
     - గెలీలియో
*     బాహ్యానుపాత నియమాన్ని ప్రతిపాదిం చింది     - డాల్టన్
*   అణుశాస్త్ర  పితామహునిగా పేరు గాంచింది     -డాల్టన్
*   విద్యుత్ పరిమాణం, కెపాసిటీలను ‘ఫారడే’ ప్రమాణాల్లో తెలియజేస్తారు.    
*     యునెస్కో మొట్టమొదటి కళింగ
     బహుమానాన్ని పొందినవారు     - డిబ్రోగ్లీ
*     ఎలక్ట్రిక్ డైనమో, జనరేటర్‌ల సృష్టికర్త
         - మైఖేల్ ఫారడే
పాక్షిక పీడనాల నియమాన్ని రూపొందించింది     - జాన్ డాల్టన్
 
 
మాదిరి ప్రశ్నలు
 1.    365 రోజులకు కేలండర్ రూపొందించినవారు?
     ఎ) ఈజిప్షియన్లు     బి) బాబిలోనియన్లు    సి) గ్రీకులు     డి) భారతీయులు
 2.    నవీన విజ్ఞానశాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
     ఎ) కోపర్నికస్     బి) గెలీలియో గెలీలీ
     సి) న్యూటన్    డి) ఐన్‌స్టీన్
 3.    విశ్లేషాత్మక త్రాసును అభివృద్ధి చేసినవారు?
     ఎ) డాల్టన్     బి) లెవోయిజర్     
     సి) టారిసెల్లీ     డి) ఐన్‌స్టీన్
 4.    ‘డి రివల్యూషనిబస్ ఆర్బియమ్’ను ప్రచు రించింది?
     ఎ) న్యూటన్     బి) గిల్బర్‌‌ట     
     సి) ఫారడే    డి) కోపర్నికస్
 5.    విజ్ఞానశాస్త్ర క్రమశిక్షణ విలువలను వివ రించిన వారు?
     ఎ) అండర్సన్     బి) ఆర్‌‌మస్ట్రాంగ్    
     సి) టీహెచ్ హక్ల్సీ    డి) కోపర్నికస్
 6.    అన్వేషణా పద్ధతిని అభివృద్ధి పరిచినవారు?
     ఎ) హెచ్‌ఈ ఆర్‌‌మస్ట్రాంగ్
     బి) నీల్ ఆర్‌‌మస్ట్రాంగ్    
     సి) కిల్ పాట్రిక్        డి) టాలెమీ
 7.    సున్నాను మొదటిసారిగా ఉపయోగించింది?
     ఎ) ఈజిప్షియన్లు    బి) అరబ్బులు    
     సి) భారతీయులు    డి) గ్రీకులు
 8.    రసరత్నాకర అనే గ్రంథాన్ని రచించింది?
     ఎ) సుశ్రుతుడు    బి) నాగార్జునుడు    
     సి) పతంజలి     డి) భాస్కరుడు
 9.    {పస్తుత పాశ్చాత్య  విద్యకు పునాది వేసిన నివేదిక?
     ఎ) మెకాలే నివేదిక     
     బి) వుడ్ నివేదిక    
     సి) సార్జెంట్ నివేదిక
     డి) చార్టర్ యాక్ట్
 10.    1964-66లో విద్యాకమిషన్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటైంది?
     ఎ) మొదలియార్    బి) డీఎస్ కొఠారి    
     సి) ఈశ్వరీభాయి పటేల్ డి) తారాదేవి
 11.    ూఇఊ 2000 ను రూపాందించింది?
     ఎ) ూ్ఖఉఇై    బి) ూఇఉఖఖీ    
     సి) ్ఖఎఇ    డి) ఇఉఖఖీ
 12.    కిందివాటిలో సి.వి.రామన్ పొందని బిరుదు?
     ఎ) నైట్‌హుడ్     బి) నోబెల్ ప్రైజ్    
     సి) భారతరత్న    డి) ఏదీకాదు
 13.    పెండ్యులం గడియారాన్ని కను గొన్నవారు?
     ఎ) గెలీలియో    బి) వినెన్జీ    
     సి) సర్ఫీ    డి) రెటికస్
 14.    కిందివాటిలో గెలీలియో కనుగొన్నది?
     ఎ) టెలిస్కోప్     బి) కంపాస్     
     సి) ఉష్ణమాపకం     డి) పైవన్నీ
 15.    ఆటమ్స్ ఫర్ పీస్ అవార్డు పొందినవారు?
     ఎ) నీల్స్‌బోర్     బి) న్యూటన్     
     సి) పాల్ డిరాక్     డి) ఐన్‌స్టీన్
 16.    ఆర్యభట్ట శిష్యుల్లో ముఖ్యుడు?
     ఎ) లతాదేవ    బి) భాస్కర    
     సి) చరకుడు    డి) సుశ్రుతుడు
 17.    పంచాంగాలను తయారుచేయడానికి ఉప యోగపడే గ్రంథం?
     ఎ) సిద్ధాంత శిరోమణి
     బి) కరణ కుతూహల
     సి) గ్రహగణిత     డి) ఏదీకాదు
 18.    ఎ ట్రియటైస్ ఆన్ కరెన్సీ పుస్తక రచయిత?
     ఎ) టాలెమీ     బి) కోపర్నికస్    సి) ఫారడే     డి) సి.వి. రామన్
 19.    నీల్స్‌బోర్ ఏ దేశస్థుడు?
     ఎ) స్వీడన్     బి) కొలంబియా    సి) డెన్మార్‌‌క    డి) బ్రెజిల్
 20.    ఎలక్ట్రాలిసిస్‌కు సంబంధించిన సూత్రాలను ప్రతిపాదించినవారు?
     ఎ) ఫారడే     బి) డి బ్రోగ్లీ    
     సి) మాక్స్‌వెల్    డి) న్యూటన్
 21.    ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీ గ్రంథ రచయిత?
     ఎ) మాక్స్‌ఫ్లాంక్         బి) హైజన్ బర్‌‌గ    
     సి) డిబ్రోగ్లీ        డి) ఫారడే
 22.    1983లో నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ భౌతిక శాస్త్రవేత్త?
     ఎ) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్     
     బి) సి.వి.రామన్
     సి) అబ్దుల్ కలాం        డి) అమర్త్యసేన్
 23.    చక్రవాక పద్ధతిని రూపొందించిన వారు?
     ఎ) సుశ్రుతుడు    బి) భాస్కరుడు
     సి) చరకుడు    డి) ఆర్యభట్ట
 24.    ఆర్యభట్టీయంలోని 4 భాగాలకు చెందనిది?
     ఎ) గీతికాపాదం        బి) గణితపాదం
     సి) జీవపాదం         డి) గోళపాదం
 25.    లోహ, రసాయన శాస్త్రాల్లో ప్రముఖుడు?
     ఎ) సుశ్రుతుడు     బి) నాగార్జునుడు    సి) చరకుడు    డి) కనిష్కుడు
 26.    నీటి గడియారాన్ని తయారుచేసినవారు?
     ఎ) గ్రీకులు    బి) ఈజిప్షియన్లు
     సి) బాబిలోనియన్లు డి) భారతీయులు
 27.    ‘రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్’ ను ప్రారంభించిన సంవత్సరం?
     ఎ) 1803     బి) 1799
     సి) 1813     డి) 1853
 
 గతంలో అడిగిన ప్రశ్నలు
 1.    పొడవు, ద్రవ్యరాశి కాలాన్ని కొలవడానికి ప్రమాణాలు ఏర్పర్చిందెవరు?
 (డీఎస్సీ - 2003)
     ఎ) ఈజిప్షియన్లు    బి) బాబిలోనియన్లు
     సి) గ్రీకులు    డి) భారతీయులు
 2.    మొదటిసారిగా సౌర గడియారం, నీటి గడియారాన్ని తయారుచేసినవారు?
 (డీఎస్సీ - 2003)
     ఎ) బాబిలోనియన్లు     బి) చైనీయులు    
     సి) ఈజిప్షియన్లు     డి) గ్రీకులు
 3.    పయోగాత్మక విజ్ఞానశాస్త్రానికి
     ఆద్యుడు?    (డీఎస్సీ - 2003)
     ఎ) గెలీలియో గెలీలీ    బి) కోపర్నికస్     
     సి) న్యూటన్    డి) స్పెన్సర్
 4.    శాస్త్ర ప్రగతికి అనుసరించే ప్రక్రియలో ఐన్‌స్టీన్ తొలుత వాడిన పద్ధతి?
 (డీఎస్సీ - 2006)
     ఎ) తార్కిక విశ్లేషణ    
     బి) ప్రయోగాత్మక నిరూపణ     
     సి) సైద్ధాంతిక గణన డి) ప్రకల్పనలు
 5.    చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన వేదం?
     ఎ) రుగ్వేదం     బి) యజుర్వేదం    
     సి) అధర్వణ వేదం     డి) సామవేదం
 6.    ఞ విలువను కచ్చితంగా లెక్కించడాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త?
     ఎ) భాస్కరాచార్య     బి) కోపర్నికస్     
     సి) ఆర్యభట్ట     డి) అరిస్టాటిల్
 7.    ఐన్‌స్టీన్‌కు ప్రథమ నోబెల్ బహుమతి  దేనికి ఇచ్చారు?
     ఎ) ద్రవ్యరాశి -శక్తి సమతుల్యత
     బి) ఫొటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్    
     సి) రిలెటివిటీ సిద్ధాంతం
     డి) బ్రానియన్ చలనం
 సమాధానాలు:
 1) బి;    2) సి;     3) ఎ;     4) బి;  
 5) బి;    6) సి;     7) బి.

మరిన్ని వార్తలు