34 పోస్టల్ బ్యాలెట్ల తిరస్కరణ

14 May, 2014 03:47 IST|Sakshi
34 పోస్టల్ బ్యాలెట్ల తిరస్కరణ

గుర్ల,న్యూస్‌లైన్: స్థానిక ఎన్నికల్లో భాగంగా   జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ  మంగళవారం ముగిసింది. ఇందులో భాగంగా ముందుగా ఆర్వో సమ క్షంలో పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కింపు చేపట్టారు. గుర్ల మండలం మొత్తం మీద 34 పోస్టల్ బ్యాలెట్  ఓట్లు పోలవగా వాటిలో ఒక్క ఓటును కూడా పరిగణనలోకి తీసు కోలేదు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్న ఉద్యోగులు సక్రమమైన పద్ధతిలో ఓట్లు వేయకపోవడంతో  వాటిని తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ఉన్న కవరులో ఓటు వేసే వ్యక్తి డిక్లరేషన్‌తో పాటు ఓటు వేసిన కవరు పెట్టాలి. అయితే ఒక్క ఓటరు కూడా డిక్లరేషన్ ఫారం జత చేయలేదు.  ఎన్నికల కమిషన్ నియమాను సారం డిక్లరేషన్ లేని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురవడంతో ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు నిరాశ చెందారు.

మరిన్ని వార్తలు