ఎన్నికల బరిలో సినీనటి హేమ

17 Apr, 2014 01:06 IST|Sakshi
ఎన్నికల బరిలో సినీనటి హేమ

 మండపేటనుంచి జేఎస్పీ తరఫున పోటీ
  19న నామినేషన్ దాఖలు
 
 అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :సినీ నటి హేమ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థినిగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఆమె పోటీకి రంగం సిద్ధమైది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ జేఎస్పీ అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నామినేషన్ దాఖలు చేసిన సిటింగ్ ఎంపీ జీవీ హర్షకుమార్ వెంట ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమ విలేకరులతో మాట్లాడారు. మండపేట అసెంబ్లీ జేఎస్పీ అభ్యర్థిగా తాను ఈనెల 19న నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మునుపెన్నడూ రాజకీయాల్లో తాను పాల్గొనలేదని, అయితే ఏకపక్షంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీపై కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కాకతాళీయంగానో, కాలక్షేపం కోసమో తాను పోటీ చేయడంలేదని, ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలన్న స్థిర సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె స్పష్టం చేశారు.  తనను ఎన్నుకుంటే మండపేటలోనే మకాం ఉంటానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. తన సొంతూరు రాజోలు అని, తొలి నుంచి జిల్లాతో, ఇక్కడి ప్రజలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పారు.
 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు