కౌంటింగ్‌కు ఏర్పాట్లు ముమ్మరం

15 May, 2014 00:05 IST|Sakshi
కౌంటింగ్‌కు ఏర్పాట్లు ముమ్మరం

ఏఎన్‌యూ, న్యూస్‌లైన్:  సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, దాని పరిధిలోని గుంటూరు-ఈస్ట్, గుంటూరు-వెస్ట్, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, తెనాలి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగనుంది.  సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు మినహా ఇతరులు లోపలికి ప్రవేశించకుండా ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం, దూరవిద్యాకేంద్రం నుంచి బాలికల వసతి గృహం మీదుగా జాతీయ రహదారి వరకు  బారికేడ్లను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ అతిథిగృహం వద్ద జాతీయ రహదారి పక్కనున్న రోడ్డును మూసివేశారు. కౌంటింగ్ జరిగే ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లో రాకపోకలను నిలిపివేశారు.  ఏర్పాట్లను జిల్లా స్థాయి అధికారులు పర్యవే క్షించి తగు సూచనలిస్తున్నారు. గుంటూరు ఆర్డీవో రామమూర్తి, తెనాలి ఆర్డీవో శ్రీనివాస్ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.
 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా