బుజ్జగింపులు.. బెదిరింపులు

23 Mar, 2014 03:19 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం    (జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) పోరులో రెబల్స్ బెడద మొదలైంది. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో తిరుగుబాటు అభ్యర్థులు తప్పుకోమని చెబుతున్నా రు.
 
  వారిని బుజ్జగించే పనిలో పార్టీల ముఖ్యులు ఉన్నారు. ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాయిలాలు, నజరానాలు ఇచ్చి తప్పించే విధంగా మధ్యవర్తులతో రాయబేరం చేస్తున్నారు. మంతనాలు సాగిస్తున్నారు. ఉపసంహరణకు సోమవారమే గడువు ఉండటం తో ఎవరిని బరిలో ఉంచాలనేది పార్టీలు తేల్చుకోలేక పోతున్నాయి. ఫలితంగా పార్టీల నేతలకు రెబల్స్ దడ పుట్టుకొస్తోంది.
 
  అయి తే నామినేషన్ వేసిన వారికి ఎంతో కొం త ముట్టజెప్పాలని ఇప్పటికే నేతలు అభ్యర్థుల ముందు ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం. స్థానిక పోరులో పలుకుబడి గల అభ్యర్థులు పోటీలో ఉండడంతో పార్టీ ల నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఫలితంగా ఇప్పుడు నన్ను చూసు కో.. తర్వాత నిన్ను చూసుకుంటా.. అంటూ మంతనాలు సాగిస్తున్నారు. దీంతో స్థానిక బరి లో నిలిచే అభ్యర్థులు హైరానా పడుతున్నారు.
 
 ఒక్కో స్థానానికి నలుగురు..
 జిల్లా వ్యాప్తంగా 52 జెడ్పీటీసీ, 636 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 52 జెడ్పీటీసీ స్థానాలకు 596, 636 ఎంపీటీసీ స్థానాలకు 4,688 నామినేషన్లు వచ్చాయి. కొన్ని పార్టీల నుంచి ఒక స్థానానికి ఒక అభ్యర్థి నామినేషన్ వేయగా, మరికొన్ని పార్టీల నుంచి ఒక్కో స్థానానికి ముగ్గురు, నలుగురు అభ్యర్థులను బరిలోకి దింపడంతో నామినేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి.
 
  ప్రధానంగా ఎంపీటీసీ నామినేషన్లలో ఈ పర్వం స్పష్టంగా కన్పిస్తోంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎవరికి వారు తమది ఫలానా పార్టీ పేర్కొంటూ నామినేషన్లు దాఖలు చేశారు. మండల పరిషత్ పీఠం దక్కించుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. కొన్నిచోట్ల వర్గాలవారీగా నామినేషన్లు వేయడంతో ఇక్కడ బుజ్జగింపులు లేదంటే బెది రింపులు, రాయబేరాలు చేస్తున్నారు. రెబల్స్‌ను బుజ్జగించడానికి నజరానా ఇవ్వడం ఒకటయితే.. బీఫాం దక్కించుకోవడానికి కూడా జేబు ఖాళీ అవుతోంది.
 
 24 జెడ్పీటీసీ.. 181 ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణ..
 జిల్లావ్యాప్తంగా 52 జెడ్పీటీసీ స్థానాలకు దాఖలైన 596 నామినేషన్లకు 24 వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. మిగతా 572 నామినేషన్లు అమోదించారు. తిరస్కరణకు గురైనా జెడ్పీటీసీ నామినేషన్లపై కలెక్టర్ అహ్మద్ బాబు శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అప్పీలును స్వీకరించారు.
 
 24 జెడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, శనివారం అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 24 మంది అప్పీలు చేసుకోగా వాటిని కలెక్టర్ పరిశీలించారు. అప్పీలు చేసుకున్న అనంతరం మరో ఏడు జెడ్పీటీసీ నామినేషన్లు తిరస్కరించడం జరిగింది. తిరస్కరణకు గురైనా వారిలో క్రిష్ణస్వామి (నార్నూర్), చిట్టి స్వప్న (సారంగపూర్), జి. సుమలత (సారంగపూర్), కాసు రాధిక (భైంసా), కుటికల ఆశన్న (ఉట్నూర్), వందనబాయి (ఇం ద్రవెల్లి), మోతుకూరి వెంకటస్వామి (లక్సెట్టిపేట) నామినేషన్లు తిరస్కరించడం జరిగింది. ఇదిలా ఉండగా జిల్లాలో 636 ఎంపీటీసీ స్థానాలకు 4,688 నామినేషన్లు రాగా, 181 ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. మిగతా 4,507 నామినేషన్లు అమోదించడం జరిగింది. కాగా, ని బంధనల మేరకు లేకపోవడంతో కొందరి నామినేషన్లు తిర స్కరణఖు గురయ్యాయని కలెక్టర్ అహ్మద్‌బాబు, జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి జనార్దన్ నివాస్ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు