‘బాబు’ అంత నీచుడు దేశంలోనే లేడు

1 May, 2014 01:36 IST|Sakshi
‘బాబు’ అంత నీచుడు దేశంలోనే లేడు
  • ఈ మాటలన్నది నేనుకాదు ఎన్టీఆర్
  •  ‘ఓదార్పు’తో ప్రజలకు చేరువైన జగన్
  •  రాష్ట్రంలో వైఎస్సార్ సీపీదే గెలుపు
  •  వైఎస్, ఎన్టీఆర్, జగన్ పేర్లతోనే గెలుస్తా
  •  ‘సాక్షి’ టీవీతో పార్టీ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి  కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)
  •  ‘‘మా నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు ఓటుకు నోటుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వారెన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి పేర్లతోనే ప్రజల ముందుకెళ్లి ఓట్లు వేయాలని అడుగుతున్నా. వారు అమలుచేసిన, ప్రకటించిన సంక్షేమ పథకాలను వారికి వివరిస్తున్నా.

    నా గెలుపు ఖాయం. మరో 16 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహానేత కుమారుడు జగన్‌మోన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం తథ్యం’’ అని వైఎస్సార్ సీపీ గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడారు. చంద్రబాబు కన్నా నీచుడు దేశంలో ఎవరూ లేరని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు గతంలోనే చెప్పారని గుర్తుచేశారు.

    బాబు పరిపాలించిన తొమ్మిదేళ్లూ అన్నివర్గాల ప్రజలను నానా అగచాట్లకు గురిచేశాడని విమర్శించారు. అందుకే ఆయన్ను కాదని 2004 ఎన్నికల్లో ప్రజలు వైఎస్.రాజశేఖరరెడ్డికి పట్టంగట్టార పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి పదవి కోసం పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడని దుయ్యబట్టారు. అప్పట్లోనే బాబు అంత నీచుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

    చంద్రబాబు ఓ చవటని, అందుకే తన పార్టీలో చవటలందరికీ చోటు ఇచ్చి కార్పొరేట్ వ్యవహారాలకు తెర లేపుతున్నారని ఎద్దేవాచేశారు. తన తొమ్మిదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను చిత్రహింసలకు గురిచేసి ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తానే గొప్పవాడినని, తానే నీతిమంతుడినని, తన పాల నలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెబుతున్న బాబును వరుసగా 2004, 09 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఆయన్ను నమ్మే రోజులు పూర్తిగా పోయాయన్నారు. ఆయన ఇక జీవితంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వలేరని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలు దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆయన కుమారుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై చూపుతున్నారని పేర్కొన్నారు.
     
    ఓదార్పు యాత్రతో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చేరువయ్యారని నాని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోని ప్రజల కష్టాల్ని తెలుసుకున్న ఆయన్నే ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు ఓటుకు నోటుతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా చివరికి గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. మరో 16 రోజుల్లో నూతన రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా మహానేత కుమారుడు జగన్‌మోన్‌రెడ్డి బాధ్యతలు చేపడతారని, ప్రజలకు మంచి రోజులు   వస్తాయని పేర్కొన్నారు.
     

మరిన్ని వార్తలు