సత్తిబాబు గల్లా ఖాళీ.....

5 May, 2014 11:40 IST|Sakshi
సత్తిబాబు గల్లా ఖాళీ.....

చీపురుపల్లి : పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎదురీత తప్పదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.  చీపురుపల్లి నియోజకవర్గంలో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హవా కొనసాగించిన బొత్స గల్లా ఖాళీ అయిందని ఓటర్లు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర విభజనలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రజలు బలంగా విశ్వసించడంతో కాంగ్రెస్ పార్టీపై బాగా వ్యతిరేకత పెరిగింది.

 

దీనికి తోడు నియోజకవర్గంలో పలు హామీలు మరిచిపోవడంతో కూడా వ్యతిరేకత ఉంది.  జిల్లాను బొత్స సత్యనారాయణ మద్యం సిండికేట్ల పేరుతో దోచుకున్నారని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.  దాంతో ఈసారి సత్తిబాబుకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతామని చెబుతున్నారు.

 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు