ఇంటికో ఉద్యోగమా..! వద్దు బాబు.. వద్దు!

25 Apr, 2014 01:23 IST|Sakshi
ఇంటికో ఉద్యోగమా..! వద్దు బాబు.. వద్దు!
సీతానగరం, న్యూస్‌లైన్: టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై లచ్చయ్యపేటలోని చక్కెర కర్మాగారంలో పని చేసిన ఉద్యోగులు, కార్మికు లు మండిపడుతున్నారు. బాబు తన హయూం లో అన్యాయంగా ఇక్కడి కర్మాగారంలో పని చేస్తు న్న 80 మందిని విధుల నుంచి తొలగించారు. బాబు ఇచ్చిన ఝలక్‌తో ఇప్పటివరకూ వారు తేరుకోవడం లేదు.  జిల్లాను వ్యవసాయ, వాణిజ్య, ఉద్యోగపరంగా అభివృద్ధి చేయూలన్న ఉద్ధేశంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ఖాయిలా పడిన   బొబ్బిలి, సీతానగరం చక్కెర కర్మాగారాలను తెరిపించారు. 
 
 అప్పటికే ఆయూ కర్మాగారాల్లో పని చేసిన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి అన్ని రారుుతీలు కల్పిం చారు. ఈ రెండు కర్మాగారాలను రాష్ట్రంలోనే పేరొందిన నిజాం చక్కెర కర్మాగారం పరిధిలోకి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ తరు వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గ్లోబలైజేషన్ పేరుతో రాష్ట్రంలో పలు చక్కెర కర్మాగారాలను కొంతమంది అనుచరగణానికి కారుచౌకగా కట్టబెట్టారు. అందులో భాగంగానే ప్రభుత్వాధీనంలో ఉన్న సీతానగరంలోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం ప్రైవేటు పరమైంది. అప్పటి యూజమాన్యం కర్మాగారంలో కొన్నేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులను మిగులు పేరుతో కొందరిని, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పేరుతో మరి కొంతమందిని బలవంతంగా విధుల నుంచి తొలగించారు. 
 
 ఇలా మొత్తం 80 మందిని ఉద్యోగాల నుంచి తొలగిం చారు. వారిని విధుల నుంచి తొలగించిన కొద్ది రోజులకే హైదరాబాద్‌లోని మెట్‌పల్లిలో ఉన్న ప్రభుత్వ, యాజమాన్య చక్కెర కర్మాగారానికి 180 మందిని బదిలీ చేశారు. ఒక సీజన్ తరువాత అక్కడి యూజమాన్యం మళ్లీ వారిని వెనక్కి పంపించడంతో కష్టాలు మొదలయ్యాయి. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని కార్మికులు చంద్రబాబును కోరినప్పటికీ వినిపిం చుకోకపోవడంతో బతుకు తెరువు కోసం అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయూరు. కొందరు స్వగ్రామాలకు వచ్చి వ్యవసా య కూలీలుగా పని చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు కొట్టిన దెబ్బకు ఇప్పటికీ వారు ఆర్థికంగా తేరుకోలేకపోతున్నారు.
మరిన్ని వార్తలు