‘బాబు’ ఫోన్లా... బాబోయ్...

5 Apr, 2014 10:04 IST|Sakshi
‘బాబు’ ఫోన్లా... బాబోయ్...

 *కడప అభ్యర్థిని ఖమ్మం వాళ్లు నిర్ణయించాలట!!
 *అభాసుపాలవుతున్న చంద్రబాబు ‘ఆన్‌లైన్’ ప్రణాళిక
  *ఖమ్మం వాసికి ఫోన్ చేసి పొద్దుటూరు అభ్యర్థిగా ఎవరుండాలని ఆరా
  *మల్లేల లింగారెడ్డి అయితే 1, వరదరాజుల రెడ్డి అయితే 2 నొక్కాలట
  *ఇవేం ఫోన్లురా బాబు అంటూ తలలు పట్టుకుంటున్న ఖమ్మం వాసులు

 
సాయంత్రం ఏడు గంటల సమయం...
 ఖమ్మం నగరంలోని ఓ చిరుద్యోగికి ఒక ఫోన్ వచ్చింది... నెంబర్ ఫీడ్ చేసి లేకపోయినా ఎవరో అని ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. అవతలి వైపు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి టోన్. ముందుగా నమస్కారం అన్నారు. మీ అభ్యర్థిని మీరే నిర్ణయించుకోండి అని చెప్పారు.  వావ్.. మా అభ్యర్థిని మేమే నిర్ణయించే అవకాశం కల్పించారా అని ఆ చిరుద్యో గి ఆసక్తి కనబరిచాడు. ఖరాఖండిగా తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నాడు.

 కానీ అతని ఆశ నిరాశే అయింది. బాబుగారు ఖమ్మంలోని ఈవ్యక్తికి ఫోన్ చేసి కడప జిల్లా పొద్దుటూరులో అభ్యర్థి ఎవరయితే బాగుంటుందని అడగడంతో అతను అవాక్కయ్యాడు. అవతలివైపు నుంచి బాబు గారు.. మీకు నచ్చిన అభ్యర్థి మల్లేల లింగారెడ్డి అయితే 1, వరదరాజుల రెడ్డి అయితే 2 అని నొక్కాలని పదే పదే అడుగుతుండడంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నాడా చిరుద్యోగి. 14001281999 నెంబర్‌నుంచి వచ్చిన ఈ ఫోన్‌ను అసలు నేను ఎందుకు ఎత్తానురా ‘బాబు’... నేను పొద్దుటూరు అభ్యర్థిని నిర్ణయించడం ఏంటి అని తల పట్టుకున్నాడతను.

ఇతనే కాదు... ఖమ్మం జిల్లాలోని చాలా మందికి ఇదే విధమైన ఫోన్లు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. మామూలు సమయాల్లో రింగ్‌టోన్‌లు, కంపెనీ ప్లాన్‌ల గురించి చెప్పడానికి వివిధ టెలికం అపరేటర్లు చేసే ఫోన్లతో చస్తుంటే... ఎన్నికల సమయంలో అర్థం పర్థం లేకుండా  బాబుగారు ఫోన్ చేయడమేంటి.... కడప జిల్లా అభ్యర్థిని నిర్ణయించమని అడగమేంటి అని ప్రజానీకం నవ్వుకుంటున్నారు.

 

>
మరిన్ని వార్తలు