'విఛ్చిన్నకర శక్తులను తిప్పికొట్టండి'

25 Apr, 2014 16:33 IST|Sakshi

వారణాసి: విఛ్చిన్నకర శక్తులను తిప్పికొట్టాలని వారణాసి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఘనమైన సాంస్కృతిక సంపదను కాపాడుకోవాలని వారణాసి ప్రజలను కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి మనీష్ తివారి కోరారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే విభజనవాదులను గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా కాశీ పోరును వర్ణించారు.

వారణాసిలో నిన్న నామినేషన్ వేయడానికి వచ్చిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం పలికారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ పోటీలో మరొక ప్రముఖ అభ్యర్థి. మే 12న వారణాసి లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.

మరిన్ని వార్తలు