హైదరాబాద్ కాంగ్రెస్ ఖాళీ

30 Mar, 2014 01:34 IST|Sakshi
హైదరాబాద్ కాంగ్రెస్ ఖాళీ

కాంగ్రెస్ కంచుకోటకు నగరంలో క్రమక్రమంగా బీటలు వారుతున్న నేపథ్యమది.. గత సార్వత్రిక ఎన్నికల నాటికే కాంగ్రెస్ జోరుకు బ్రేకులు పడగా ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు కొత్త పార్టీని పెట్టి రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ మొత్తంగా ఖాళీ అయిపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర రాజధానిలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. మొత్తం 13 స్థానాలుండగా టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా ఏడు చోట్ల జయకేతనం ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థి ఒక చోట గెలుపొందగా మరో ఐదు స్థానాల్లో ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోవడం గమనార్హం. అత్యధికంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 81.3 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా హిమాయత్‌నగర్ నియోజకవర్గంలో 48.13 శాతం ఓట్లు పోలయ్యాయి.                                                                                                                                                                           - సాక్షి, సిటీబ్యూరో
 
నెల రోజుల మంత్రి రామస్వామి
1983 ఎన్నికల్లో మహరాజ్‌గంజ్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామస్వామి... నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా నెల రోజుల పాటు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో రామస్వామి ఎన్టీఆర్‌ను వదిలి భాస్కరరావు వర్గంలో చేరారు. అయితే భాస్కరరావు ప్రభుత్వం కేవలం నెల రోజుల మాత్రమే ఉండటంతో నగరంలో అనేక మంది రామస్వామిని ‘నెల రోజుల మంత్రి’గా పిలవడం  మొదలుపెట్టారు.
 
విజయానందంతో.. హఠాణ్మరణం
 1983 ఎన్నికల్లో హిమాయత్‌నగర్ శాసనసభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నారాయణరావు గౌడ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించిన కొన్ని గంటలకే మరణించారు. ఊహించని తన విజయాన్ని అభిమానులు, కార్యకర్తలతో రోజంతా పంచుకున్న నారాయణరావు గౌడ్ అదే రోజు రాత్రి హఠాణ్మరణం పాలైయ్యారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పి.ఉపేంద్ర, బీజేపీ తరఫున ఎ.నరేంద్ర పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర విజయం సాధించారు.  
 
ముషీరాబాద్
 ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఎస్.రాజేశ్వర్ 19,609 ఓట్లు సాధించి గెలుపొందారు. జనతాపార్టీ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి 19,302 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.యాదగిరి 15,292 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 53.64.  
 
హిమాయత్‌నగర్
 ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి జి.నారాయణరావు గౌడ్ 17,861 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బి.దామోదర్ 15,975 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టి.లక్ష్మీకాంతమ్మ 11,922 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి అఫ్జల్‌ఖాన్‌కు 8,099 ఓట్లు దక్కాయి. నమోదైన పోలింగ్ శాతం 48.13.  
 
సనత్‌నగర్
 ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కాట్రగడ్డ ప్రసూన 32,638 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.రాందాస్ 19,470 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి శంకరయ్య యాదవ్ 8,095 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. సీపీఎం అభ్యర్థి ఎన్.వి.భాస్కర్‌రావు 4,037 ఓట్లతో నాలుగోస్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 56.98.   
 
సికింద్రాబాద్
 ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి మాచినేని కృష్ణారావు 33,069 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.కేశవరావు 15,128 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఎం.సత్యనారాయణ 7,256 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. పోలైన ఓట్ల శాతం 52.19.
 
ఖైరతాబాద్
 ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర  అభ్యర్థి ఎం.రాంచందర్‌రావు 36,188 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్దన్‌రెడ్డి 23,476 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సీ.హెచ్.హనుమంతరావు 16,367 ఓట్లతో తృతీయ స్థానానికి పరిమితమయ్యారు. నమోదైన పోలింగ్ శాతం 57.05.
 
చార్మినార్
 స్వతంత్ర అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 50,724 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సి.అశోక్‌కుమార్ 18,218 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బాల పోచయ్య 6,704 ఓట్లతో తృతీయస్థానానికే పరిమితమయ్యారు. నమోదయిన పోలింగ్ శాతం 65.22.  
 
చాంద్రాయణగుట్ట
 ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ అమానుల్లాఖాన్ 43,822 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఆలె నరేంద్ర 40,241 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి జి.నిరంజన్ 4,176 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు.
 నమోదైన పోలింగ్ శాతం 81.3.  
 
 కంటోన్మెంట్
 ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఎన్.ఏ.కృష్ణ 25,847 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బి.మచ్చేందర్‌రావు 16,808 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్ 14,457 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 50.91.
 
 మలక్‌పేట్
 ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎన్.ఇంద్రసేనారెడ్డి 21,397 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ప్రభాకర్‌రెడ్డి 19,340 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి మీర్జా మహబూబ్ అలీ బేగ్‌కు 14,726 ఓట్లు లభించాయి. 59.70 శాతం పోలింగ్ జరిగింది.
 
 ఆసిఫ్‌నగర్
 ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అఫ్జల్ షరీఫ్ 28,948 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బి.కృష్ణన్ 14,521 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి సి.గంగాభవాని 12,547 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి తులసీరాం 5,761 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.  నమోదైన పోలింగ్ శాతం 55.22.  
 
 మహరాజ్‌గంజ్
 ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర  అభ్యర్థి పి.రామస్వామి 17,835 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శివప్రసాద్ 14,303 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గంగా శంకర్ వ్యాస్ 12,531 ఓట్లతో తృతీయస్థానానికే పరిమితమయ్యారు. పోలింగ్ శాతం 54.08.
 
 కార్వాన్
 ఈ నియోజకవర్గంలో ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిబాకర్ ఆగా 32,380 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నందకిషోర్ 22,767 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి కె.గోపాల్ 8,574 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖలీలుల్లా 6,914 ఓట్లు దక్కించుకున్నారు. నమోదైన పోలింగ్ శాతం 64.8.
 
 యాకుత్‌పురా
 ఈ నియోజకవర్గంలో ఎంఐఎం బలపరిచిన అభ్యర్థి ఖాజా అబు సయిద్ 46,127 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి సయిద్ సర్ఫరాజ్ అలీ 6,491 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. నమోదయిన పోలింగ్ శాతం 58.42.  
 
 ప్రతి సారీ ఓటేస్తున్నా హీరో తరుణ్
 ఏ దేశానికెళ్లినా.. మీది ఏ దేశం అని అడుగుతారు. కానీ ఏ రాష్టం అని అడగరు. నా వరకూ నేను భారతీయుడ్ని మాత్రమే. హక్కులు అనేవి ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే ముందు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. మనం ఓటు వేసే వ్యక్తి మనకు జవాబుదారిగా ఉండాలి. ప్రతి ఒక్క పార్టీకీ ఓ ఎజెండా ఉంటుంది. నచ్చిన ఎజెండాను ఎంచుకుని ఆ పార్టీకి ఓటు వేయడం శ్రేయస్కరం. నేను మాత్రం ప్రతిసారీ ఓటు హక్కును వినియోగించుకుంటాను. నా మిత్రులందరికీ కచ్చితంగా ఓటు వేయమని చెబుతా. మన ఓటు వల్ల మంచి నాయకత్వం వస్తుంది.
 
 నిత్యవార్త సత్య వాక్కు
 హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే...
 పవన్ ఓటు వేయమని చెప్పింది నాకే...
 - చంద్రబాబు
 
 కొత్తకోడి కూసిందంటే బాబు కోసమే...
 పాత పకోడి వేగిందంటే బాబు పుణ్యమే...
 సెల్లుఫోన్ మోత నుంచి
 సెల్యులాయిడ్ కూత దాకా...
 ‘హైటెక్కి’న సిటీ నుంచి
 హీటెక్కిన ఇరానీ‘టీ’ దాకా...
 కాదేదీ వాడుకునేందుకనర్హం...
 కాకమ్మకథలే బాబుకున్న అస్త్రం..!
 
 ప్రజారాజ్యాన్ని విలీనం చేస్తే
 ప్రజలకు మేలనుకున్నా  -  పవన్‌కళ్యాణ్
 తానొకటి తలిస్తే..
 దైవమొకటి తలచింది..
 తమ్ముడొకటి ఆశిస్తే
 అన్నకొకటి అందింది..
 ప్రజోపయోగం అనుకుంటే..
 పదవీయోగం పట్టింది..
 గుండె దిటవు చేసుకోరాదా..
 గుండెల్లోని అన్నను
 ‘గుట్టు’గా చూసుకోరాదా..!
 - ఎస్. సత్యబాబు

>
మరిన్ని వార్తలు