కాంగ్రెస్ జోరుకు బ్రేకు

29 Mar, 2014 01:25 IST|Sakshi
కాంగ్రెస్ జోరుకు బ్రేకు

నగరంలో 1978 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి పడింది. మొత్తం 13 స్థానాల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ ఐదు స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు ఐదు చోట్ల విజయం సాధించారు. మిగిలిన మూడింటినీ స్వతంత్రులు కైవసం చేసుకున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్(ఐఎన్‌సీ) చాలా నియోజకవర్గాల్లో రెండు, మూడోస్థానానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో 65.51 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 55.40 శాతం ఓట్లు పోలయ్యాయి.                                                               
  - సాక్షి,సిటీబ్యూరో
 
 ముషీరాబాద్
 ఈ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ అభ్యర్థి, ప్రముఖ కార్మికనాయకుడు నాయిని నర్సింహారెడ్డి 25,238 ఓట్లతో విజయం సాధించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కాంగ్రెస్(ఐ) అభ్యర్థి టి.అంజయ్య 23,071 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జి.సంజీవ రెడ్డి 7,703 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి సాదిక్ అలీమీర్జా 4,567 ఓట్లు దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో నమోదైన పోలింగ్ శాతం 65.51.  
 
 హిమాయత్‌నగర్
 ఈ నియోజకవర్గంలో జనతా పార్టీ అభ్యర్థి లక్ష్మీకాంతమ్మ 23,566 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్(ఐ) అభ్యర్థి కోదాటి రాజమల్లు 19,841 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి శాంతాబాయికి 4,806 ఓట్లు లభించాయి. నమోదైన పోలింగ్ శాతం 60.43.  
  సికింద్రాబాద్
 ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ అభ్యర్థి ఎల్.నారాయణ 21,946 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్(ఐ) అభ్యర్థి టి.డి.గౌరీశంకర్ 13,794 ఓట్లతో ద్వితీయస్థానం దక్కించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.కొండారెడ్డి 11,258 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. పోలింగ్ శాతం 61.43.
 
 సనత్‌నగర్
 ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి రామ్‌దాస్ 23,155 ఓట్లు సాధించి గెలుపొందారు. సీపీఎం అభ్యర్థి ఎన్.వి.భాస్కర్‌రావు 21,393 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.కృష్ణారావు 9,096 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. జనతా పార్టీ అభ్యర్థి శీతల్‌సింగ్ లష్కరీ 2,680 ఓట్లతో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు. పోలైన ఓట్లు 63.55 శాతం.  
 
 ఖైరతాబాద్
 ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్(ఐ)అభ్యర్థి పి.జనార్దన్‌రెడ్డి 24,462 ఓట్లు సాధించి గెలుపొందారు. జనతా పార్టీ అభ్యర్థి ఆలె నరేంద్ర 23,808 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్యాంరావుకు 9,084 ఓట్లు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థి ఆగాఖాన్‌కు 1,239 ఓట్లు మాత్రమే లభించాయి. నియోజకవర్గంలో పోలైన ఓట్ల శాతం 63.35.  
 
 చాంద్రాయణగుట్ట
 ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి అమానుల్లాఖాన్ 16,890 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం. బాలయ్య 15,557 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. జనతా పార్టీ అభ్యర్థి మీర్ అహ్మద్ అలీఖాన్ 11,169 ఓట్లతో తృతీయస్థానానికి పరిమితమయ్యారు. పోలింగ్ శాతం 58.78.  
 
 కంటోన్మెంట్
 ఈ నియోజకవర్గంలో జనతాపార్టీ అభ్యర్థి బి.మచ్చేందర్‌రావు 15,946 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్(ఐ) అభ్యర్థి ముత్తుస్వామికి 15,580 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి వి.మంకమ్మకు 3,470 ఓట్లు మాత్రమే దక్కాయి. స్వతంత్ర అభ్యర్థి బి.ఎం.నర్సింహ్మకు 3,064 ఓట్లు లభించాయి. నియోజకవర్గంలో పోలింగ్ శాతం 55.40.
 
 మలక్‌పేట్
 ఈ ఎన్నికల్లో జనతాపార్టీ అభ్యర్థి కందాల ప్రభాకర్‌రెడ్డి 25,400 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్(ఐ) అభ్యర్థిని సరోజిని పుల్లారెడ్డి 24,479 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి గులాం యజ్దానీ 5,113 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఎండి. హబీబుల్లాకు 3,848 ఓట్లు లభించాయి. మొత్తంగా 62.03 శాతం ఓట్లు పోలయ్యాయి.
 
 ఆసిఫ్‌నగర్
 ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి బి.కృష్ణ 18,784 ఓట్లు సాధించి గెలుపొందారు. జనతాపార్టీ అభ్యర్థి సయిద్ వికారుద్దీన్ 16,057 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఇస్మాయిల్ జబీకి 13,505 ఓట్లు దక్కాయి. పోలింగ్ శాతం 58.22.  
 
 మహరాజ్‌గంజ్
 ఈ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి శివప్రసాద్ 22,801 ఓట్లు సాధించి గెలుపొందారు. జనతా పార్టీ అభ్యర్థి బద్రీ విశాల్ పిట్టికి 22,535 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. లక్ష్మీనారాయణ 3,819 ఓట్లతో తృతీయస్థానానికి పరిమితమయ్యారు. మొత్తంగా 62.62 శాతం ఓట్లు పోలయ్యాయి.
 
 కార్వాన్
 ఈ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి శివలాల్ 17,242 ఓట్లు సాధించి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి గులాం గౌస్‌ఖాన్ 12,677 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. జనతాపార్టీ అభ్యర్థి టీ.ఎన్.సదాలక్ష్మి 10,138 ఓట్లతో తృతీయస్థానం దక్కించుకున్నారు. మొత్తంగా 55.79 శాతం ఓట్లు పోలయ్యాయి.
 
 యాకుత్‌పురా
 ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి బాఖిర్ ఆగా 24,094 ఓట్లు సాధించి గెలుపొందారు. జనతాపార్టీ అభ్యర్థి సయిద్ హసన్ 12,400 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్(ఐ) అభ్యర్థి ఎం.ఏ.ఖాన్ 8,052 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్తాఫ్ హుస్సేన్‌కు 2,972 ఓట్లు లభించాయి. పోలింగ్ శాతం 58.42.  
 
 చార్మినార్

 ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 30,328 ఓట్లు సాధించి గెలుపొందారు. జనతాపార్టీ అభ్యర్థి అహ్మద్ హుస్సేన్ 10,546 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్(ఐ) అభ్యర్థి అహ్మద్ అలీ 9,606 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. నమోదయిన పోలింగ్ శాతం 62.96.
 
 ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు: హీరో శ్రీకాంత్
 అంతకు ముందుతో పోలిస్తే ఈసారి మాత్రం ఎన్నికలు కొత్తగా ఉన్నాయి. ఎన్నో పార్టీలు, రెండు రాష్ట్రాలు గమ్మత్తుగా అనిపిస్తోంది. అయితే ఓటు హక్కు వినియోగంలో మాత్రం ఓటరు సీరియస్‌గా ఉండాలి. నోటుకు ఓటుని అమ్ముకుంటే అయిదేళ్లపాటు ప్రశ్నించే హక్కును మనం కోల్పోయినట్లే. డబ్బు తీసుకోకుండా నీతిగా, నిజాయుతీగా ఓటు వేయండి. సమాజానికి ఉపయోగపడే వాళ్లని ఎంచుకుని గెలిపించండి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి.
 
 యూపీఏ హయాంలో మహిళలకు రక్షణ లేదు
 - పురందేశ్వరి
 చిన్నమ్మ మాట...
 చద్దన్నం మూట
 చెప్పింది విని
 జీర్ణించుకోవాలట..!
 కట్టాక ‘కాషాయం’
 తిట్టాలిక ఆ ‘హయాం’
 మంత్రిగా తానున్న యూపీఏ
 మరో పార్టీలో జేరాక ‘పాపి’ఏ..!
 చిన్నమ్మ మాట
 ‘చాణక్యుని’ బాట అర్థం చేసుకోలేని... దద్దమ్మలెవరంట?
 - ఎస్. సత్యబాబు

 

మరిన్ని వార్తలు