‘నోట్ల’ రాజకీయం!

7 May, 2014 01:45 IST|Sakshi
‘నోట్ల’ రాజకీయం!

జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు నోట్ల రాజకీయానికి తెర తీశారు. ప్రజాభిమానంతో ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమన్న విషయం తెలుసుకున్న వారు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. సోమవారం సాయంత్రం ప్రచార పర్వం ముగిసినప్పటి నుంచి మంగళవారం రాత్రి వరకూ డబ్బు, మద్యం పంపిణీ చేస్తూనే ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకూ పంచి పెట్టారు. ఒక కుటుంబంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే వారికి రూ.5 వేల చొప్పున అందజేశారు. గ్రామాల్లో మద్యాన్ని ఏరులై పారించారు.
 
 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:ప్రజా విశ్వాసం పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నోట్ల రాజ కీయూనికి తెర తీశారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఓటర్లకు నోట్లు కుమ్మరిస్తూనే వచ్చారు. టీడీపీ అభ్యర్థులు అన్ని చోట్లా డబ్బు పంపిణీ చేయగా... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లో మాత్రమే పంపిణీ చేశారు. ఎస్. కోట, గజపతినగరం, విజయనగరం, బొబ్బిలి, సాలూ రు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓటుకు రూ. 500 నుంచి రూ. 1000 వరకూ పంచి పెట్టారు. మంగళవారం రాత్రంతా ఆయా గ్రామాలు, వార్డుల్లో టీడీపీ నాయకులు ఇదే పని మీద ఉన్నారు.
 
 అయితే కొన్ని చోట్ల పంపకాల్లో తేడా రావడంతో గొడవలు కూడా జరి గాయి. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయం కావడంతో కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభావాలకు గురి చేశారు. ఇందుకు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. గ్రామాల్లో మద్యాన్ని ఏరులై పారించారు. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్టుగా నటించి డబ్బులు పం పిణీ చేశారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగి సిన  నాటి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఆయా వార్డులు, గ్రామాల్లో సమావేశాలు నిర్వహించా రు. ఏ వార్డులో ఎంత ఇవ్వాలన్న దానిపై చర్చించి, అం దుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వైఎస్సా ర్ సీపీ అభ్యర్థులు బలంగా ఉన్న అన్ని చోట్లా ఇదే పరి స్థితి నెలకొంది. వారిని తట్టుకోవాలంటే గట్టిగా డబ్బు లు పంచాలని భావించి ఆ మేరకు, డబ్బు, మద్యం పంపిణీకి తెర తీశారు.
 
 టీడీపీకి చెందిన వ్యక్తి నుంచి డబ్బులు స్వాధీనం
 పూసపాటిరేగ: మండలంలోని పేరాపురంలో టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామినాయుడును గెలి పించాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన గురజాపు బోడ య్య ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎన్నికలు నిఘా అధికారులు పట్టుకున్నారు. ఆయన వద్ద ను ంచి 2050 రుపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయూరు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ మురళి, ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు, తది తరులు పాల్గొన్నారు.
 
 నగదు పంచుతూ పట్టుబడిన కాంగ్రెస్ నేతలు
 శృంగవరపుకోట: పోలింగ్ సమయం ముంచుకొస్తున్న కొద్దీ నగదు, మద్యం పంపిణీ ఊపందుకున్నాయి. పట్టణంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నగదు పంపిణీ చేస్తుండగా ఎస్. కోట పోలీసు లు పట్టుకుని, కేసులు నమోదు చేశారు. ఎస్‌బీఐ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిదిండి సాంబమూర్తిరాజు, ఆవాల కృష్ణ, చింతల నారాయణమూ ర్తి, బొబ్బిలి సంతోష్ నగదు పంచుతూ పట్టుబడినట్టు ఎస్‌ఐ  సాగర్‌బాబు చెప్పారు. వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి సుమారు రూ.87, 920 స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఓటరు జాబితాలు, కాంగ్రెస్ కరపత్రాలు ఉన్నట్టు చెప్పారు. అలాగే పట్టణంలో అక్రమ మద్యంతో వెళ్తున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్.ఐ సాగర్ బాబు చెప్పారు. స్థానిక రామకృష్ణ థియేటర్ వద్ద రాత్రి 7 గంటల సమయంలో 30 మద్యం బాటిళ్లతో వెళ్తున్న గౌరీనగర్‌కు చెందిన బోని వెంకటరావును అరెస్టు చేశామని చెప్పారు.అలాగే సోమవారం రాత్రి పట్టణంలోని పెద్దవీధికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మోపాడ శ్రీనివాసరావు ఓటర్లకు నగదు పంచుతుండగా పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి రూ.10,000 స్వాధీనం చేసుకున్నారు.  
 
 డబ్బుతో ఎర
 చీపురుపల్లి,న్యూస్‌లైన్: అవకాశం దొరికిన ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూశారు రాజకీ య పార్టీల నాయకులు. సార్వత్రిక ఎన్నికలకు ముం దు రోజు రాత్రి పూర్తిగా ఓటర్లను ప్రలోభ పెట్లడానికే పరిమితమయ్యారు. మంగళవారం రాత్రి చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఇష్టారాజ్యంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా అన్ని శక్తులూ ఉపయోగించాయి. ఈ రెండు పార్టీలు పంపిణీ చేసిన మద్యంతో పల్లెలన్నీ మత్తెక్కిపోయాయి. అయినప్పటికీ చాలదన్నట్లు డబ్బు కూడా విపరీతంగా ఓటర్లకు ఎర చూపించారు. అం దులో భాగంగానే నియోజకవర్గంలోని నాలుగు మం డలాల్లో విపరీతంగా డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటుకు రూ.300, తెలుగుదేశం నుంచి రూ.500 పంపిణీ చేసినట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల ఇంతక ంటే ఎక్కువగా పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఎక్కడికక్కడే పోలీసు బం దోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి మరీ రాజకీయ పార్టీల నాయకులు తమ పనులు యథేచ్ఛగా కొనసాగించారు. దీంతో మొత్తం మంగళవారం అంతా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు డబ్బు పంపిణీతో సరిపోయింది.
 
 నోట్లు కుమ్మరించారు!
 విజయనగరం మున్సిపాలిటీ,న్యూస్‌లైన్: టీడీపీ విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి మీసాల గీత అనుచరులు మంగళవారం పట్టణంలో విచ్చల విడిగా డబ్బు పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలోనూ పచ్చనోట్లు రెసరెపలాడారుు. తొమ్మిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న అత్రుతతో ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రలోభపెడుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మీ సాల గీత తన అనుచరులతో పట్టపగలు బహిరంగంగా ఈ తతంగాన్ని నడిపించారు. 13వ వార్డు అశోక్‌నగర్, అంబటిసత్రం జంక్షన్ ప్రాంతా ల్లో టీడీపీ కార్యకర్తలు ఉదయం 11.30 గంటల సమయంలో డబ్బులు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విలేకరులు అక్కడికి వెళ్లి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించడంతో వారు అక్కడి నుంచి పరుగులంకించారు. అదే తరహాలో మిగిలిన వార్డుల్లోనూ పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు మద్యం పంపిణీ చేశారు. మరి కొందరు ఇళ్లకు నేరుగా వెళ్లి ‘ఈ ఒక్కసారికి మా అభ్యర్థికి అవకా శం కల్పించండి. మీ కేం కావాలంటే అది చేసి పెడతాను.. ఈ రూ.2000వేలు ఉం చం డి అంటూ ప్రలోభాలకు దిగారు. అయితే ఈ విషయం పోలీస్, ఫ్లయిం గ్ స్క్వాడ్ అధికారుల కు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు విని పిస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు