కాంగ్రెస్ టీఆర్ ఎస్ మాటల యుద్ధం

16 Apr, 2014 13:23 IST|Sakshi
కాంగ్రెస్ టీఆర్ ఎస్ మాటల యుద్ధం

కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. తెలంగాణలో జరిగిన విధ్వంసంపై బహిరంగ చర్చకు సిద్దమేనా అంటూ  తాజాగా టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్షయ్యకు సవాలు విసిరారు.


ఎన్నికలు తేదీ దగ్గరపడుతుండటంతో తెలంగాణ క్రెడిట్ ను ఖాతాలో వేసుకోవడానికి  టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీల నేతలు పోటీ పడుతున్నారు.ఈక్రమంలోనే  టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టీఆర్ ఎస్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ పునర్మిర్మాణం అసలు అవసరమా అంటూ కామెంట్ చేశారు. అసలు టీఆర్ ఎస్ అవసరమే లేదు అన్నారాయన. దాంతో భగ్గుమన్న టీఆర్ ఎస్ నేత కేసీఆర్ పొన్నాలను బహిరంగ రచ్చకు రమ్మని సవాలు చేశారు.


మరో వైపు కేంద్ర మంత్రి జైరాం రమేష్ -మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో  కేసీఆర్ పై మండిపడ్డారు . కేసీఆర్ వల్లే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయన్నారు. దీనికి జవాబుగా కేటీఆర్ ఈ సారి రంగంలోకి దిగారు. సోనియా గాంధీ దేవత అన్న కాంగ్రెస్ వాదనను ఆయన ఎద్దేవా చేశారు. ఆమె దేవత కాదు. బలిదేవత అని విమర్శించారు. దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్  టీడీపీ మాటల పోరు మరో లెవెల్ కి చేరింది.

మరిన్ని వార్తలు