కాంగ్రెస్ లో వివాదం రేపుతున్ననర్సంపేట అసెంబ్లీ టికెట్

8 Apr, 2014 21:14 IST|Sakshi

నర్సంపేట: కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన టి.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో  చోటు చేసుకున్న లుకలుకలు ఒక్కొకటి బహిర్గతమవుతున్నాయి.  కొంతమంది సిట్టింగ్ లను దూరంగా పెట్టినా, అభ్యర్థుల ఎంపికపై మాత్రం అసంతృప్తి వాదులు నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.  తొలుత ప్రకటించిన మల్కాజిగిరి,  కంటోన్మెంట్ స్థానాలను మార్చిన కాంగ్రెస్..  వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ పై వెనక్కి తగ్గింది. ముందుగా మాధవరెడ్డిని పేరును జాబితాలో చేర్చిన కాంగ్రెస్ పెద్దలు అనంతరం దానిపై వెనకంజ వేశారు.  దీంతో అప్పుడే నిరసన గళం వినిపిస్తోంది. ఒక్కసారి ఇచ్చిన టికెట్ ను వెనక్కి తీసుకోవడం సరికాదంటూ కేంద్రమంత్రి బలరాం నాయక్ తెలిపారు.

 

ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి టికెట్ నిరాకరించి..పార్టీతో సంబంధం లేని జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి ఇవ్వడం ఎంతమాత్రం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్లు కూడా పార్టీ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశం తీవ్ర వివాదం అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. దీంతో స్పందించిన దిగ్విజయ్.. ఈ రాత్రికల్లా సమస్యను పరిష్కరిస్తామని సూచించారు.


 

మరిన్ని వార్తలు