అవినీతిని తరిమికొడతా

10 Apr, 2017 12:30 IST|Sakshi
అవినీతిని తరిమికొడతా

రాష్ట్రంలోని అవినీతిని తరిమికొట్టేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎంజీఆర్ ప్రారంభించిన నూనె పరిశ్రమను ప్రస్తుత అన్నాడీఎంకే ప్రభుత్వం టాస్మాక్ గోడౌన్‌గా మార్చిందని విమర్శించారు.             
 
వేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అవినీతిని పారద్రోలేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేర్కొన్నారు. తిరువణ్ణామలై పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ కూటమి పార్టీలోని పాట్టాలి మక్కల్ పార్టీ అభ్యర్థి ఎదురొలి మణికి మద్దతుగా బుధవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. విజయకాంత్ మాట్లాడుతూ తిరువణ్ణామలైలో ఎంజీఆర్ ప్రారంభించిన టేన్‌కాప్ నూనె పరిశ్రమ ప్రస్తుతం టాస్మాక్ గోడౌన్‌గా మారిందని వీటిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఏనాడైనా చర్యలు చేపట్టాయా అని ప్రశ్నించారు.
 
 రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీంఎకే పార్టీలు కలిసి రాష్ట్రంలోని అనేక పరిశ్రమలను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు వీధిన పడే దుస్థితి ఏర్పడిందన్నారు. సాతనూర్ డ్యామ్ నుంచి తిరువణ్ణామలైకి వస్తున్న తాగునీరు ప్రస్తుతం నిలిచి పోయిందని దీనిపై ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంగంలోని ప్రభుత్వ ఆస్పత్రిని విస్తరిస్తామని సంవత్సరం క్రితం తెలిపారని, అరుుతే ఇంత వరకూ పనులు ప్రారంభించలేదన్నారు.
 
గిరివలయానికి ప్రతినెలా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని అయితే ఇక్కడ కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని ఇక దేశాన్ని అభివృద్ధి చేస్తామని తెలపడం విడ్డూరంగా ఉందన్నారు.  తాను  రాష్ట్రంలోని అవినీతి, కుంభకోణాలను పారద్రోలేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇందుకు నరేంద్ర మోడీ తప్పక సహకరిస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. తాము ఏర్పరుచుకున్న కూటమితో ఇప్పటికే పలు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తిరువణ్ణామలైలో ఎదురొలి మణి, డీఎండీకే, పీఎంకే, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచు లంచ్

చెంచాడు చక్కెర చాలు...

పంచె కంటే పాతది ప్యాంటుకట్టు

ఆవుపేడతో వెనీలా పరిమళం

బక్కెట్ నిండా ఆహ్లాదం

అంత కసి ఎందుకు కంగనా?!

గైనకాలజి కౌన్సెలింగ్

మంచి శుక్రవారమును గూర్చిన మంచి ఏమిటి?

బ్రెయిలీ దీపాలు

త్యాగశీలి మా ఆవిడ.

మొరాకో

సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం

మధిర ఎంపిపి స్థానం వైఎస్ఆర్సిపి కైవశం

రేపు ప్రకాశం, నెల్లూరు జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

ఇల్లు వదిలే ప్రశ్నే లేదు..

ఎంపీపీ ఎన్నికలు.. వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మండలాలు

జమ్మలమడుగులో హైడ్రామా

ఎంపీపీ ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు

ఎంపీపీ ఎన్నికలు.. తెలంగాణలో కారు జోరు

పార్టీ విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు

ఢిల్లీలో 'చెల్లాయికి మళ్లీ మళ్లీ పెళ్లి'?

కేసీఆర్ పై కరుణానిధి ప్రశంసల వర్షం

టీడీపీ దాడులను సహించేది లేదు: అంబటి

ఢిల్లీ కోటలో నరసాపురం కోడలు!

ప్రోటెం స్పీకర్ గా కమల్ నాథ్

48 అసెంబ్లీ స్థానాలకు పోటీ: కారెం శివాజీ

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు

జోరుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారం

‘దొరతనంలేని తెలంగాణ తెచ్చుకుందాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!