-

అటు కారు.. ఇటు ఆటో...

19 May, 2014 03:05 IST|Sakshi
అటు కారు.. ఇటు ఆటో...

 సాక్షి, హన్మకొండ: అనుకున్నట్లే అయింది... ఊహిం చిందే జరిగింది. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు కేంద్ర  మాజీ మంత్రి బలరాం విజ యావకాశాలకు దెబ్బకొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన కారు జోరుకు ఆటో వేగం సైతం తోడయ్యింది. ఫలి తంగా ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యూరు. గత ఎన్నికల సమయానికి జిల్లాలో పెద్దగా ఎవరికి పరిచయం లేకుం డా చివరి నిమిషంలో మహబూబాబాద్ పార్లమెం ట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిల్చున్న బలరాం నాయక్... ఏకంగా కేంద్ర మం త్రి పదవిని దక్కించుకున్నారు.
 
2014 మార్చిలో ఎన్నికల సీజన్ మొదలయ్యే నాటికి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో కాంగ్రెస్ నుంచే కాకుండా ప్రత్యర్థి పార్టీ ల్లో సైతం ఆయనకు గట్టిపోటీ ఇచ్చే నాయకులు కనుచూపుమేరలో ఎవరూ లేరు. మానుకోట, నర్సంపేట, ములుగు, డోర్నకల్, ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన హవానే కొనసాగింది. ఈ ఎన్నికల్లో బలరాంనాయక్ గెలుపు నల్లేరుపై న డకే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. తీరా... ఎన్నికలు జరిగి ఫలితాలు ప్రకటించే సరికి ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ చేతిలో 30,654 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
 
దొంతి దెబ్బ
ఎన్నికలు సమీపించే నాటికి కేంద్రమంత్రి బలరాంనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతిమాధవరెడ్డి మధ్య సత్సంబంధా లు ఉండేవి. కాంగ్రెస్ చివరి నిమిషంలో దొంతిని కాదని నర్సంపేటలో కత్తి వెంకటస్వామిని బరిలో నిలిపింది. దీంతో దొంతి మాధవరెడ్డి రెబల్‌గా బరిలో నిలి చి ఆటో గుర్తుపై పోటీ చేశారు. ఆటో, కా రు రెండు గుర్తులు పోలి ఉన్న నేపథ్యం లో ఓటర్లు పొరబడే అవకాశముండడం తో దొంతి మాధవరెడ్డి తన ప్రచారంలో రెండు ఓట్లూ ఆటోకే వేయాలని ముమ్మర ప్రచారం చేశారు. దీర్ఘకాలంపాటు నర్సం పేట కేంద్రంగా రాజకీయాలు నెరిపిన దొంతి తనకంటూ సొంత వర్గాన్ని తయా రు చేసుకున్నారు. పైగా చివరి నిమిషం లో టికెట్ నిరాకరించడంతో ఆయనకు సానుభూతి కూడా తోడయింది.
 
ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సైతం దొంతి వెంట న డిచాయి. ఫలితంగా నర్సంపేటలో దొం తి ప్రచారం చేసిన ఆటో గుర్తుకు భారీగా ఓట్లు వచ్చి పడ్డాయి. అసెంబ్లీకి పోటీ చేసిన దొంతి మాధవరెడ్డికి 76,144 ఓట్లు రాగా... కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కత్తి వెంకటస్వామికి కేవలం 6,638 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ పార్లమెంట్‌కు సంబంధించి బలరాంనాయక్‌కు కేవలం 13,404 ఓట్లే వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి 66,777 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి 75,400 ఓట్లు వచ్చాయి. కానీ... పార్లమెంటుకు వచ్చే సరికి క్రాస్‌ఓటింగ్ జరిగి బలరాంనాయక్‌కు 5,633 ఓట్ల ఆ ధిక్యం వచ్చింది. ఈసారి పరిస్థితి తారుమారై కాంగ్రెస్ ఓట్లు పార్లమెంటు పరిధి లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పా యం చందర్‌రావుకు పడ్డాయి. ఇక్కడ ఆ యనకు కేటాయించిన ఆటో గుర్తుకు మొ త్తం 60,583 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో తొంభై శాతం దొంతి సానుభూతి పరులవే. ఈ ఓట్లన్నీ బలరాంనాయక్‌కు వచ్చి ఉంటే విజయం ఆయన పక్షానే నిలిచేది.
 
 చీలిన లంబాడ ఓట్లు
 గత ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన బల రాంనాయక్‌కు టికెట్ ఇవ్వగా... మహా కూటమి తరఫున కోయ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అ ప్పుడు చాలా నియోజకవర్గాల్లో లంబాడ ఓట్లు చీలి బలరాంనాయక్‌కు పడ్డాయి. ఇల్లందు, ములుగులో అసెంబ్లీకి సంబంధించి టీడీపీకి చెందిన కోయ ఎమ్మెల్యే గెలుపొందగా... ఈ రెండు చోట్ల పార్లమెంట్ మెజార్టీ కాంగ్రెస్‌కు వచ్చింది. కానీ... ఈసారి కాంగ్రెస్‌తోపా టు టీఆర్‌ఎస్ లంబాడ వర్గానికి సీట్లు కేటాయించడం బలరాంకు కలిసిరాలేదు.

మరిన్ని వార్తలు