వైఎస్ విజయమ్మ రోడ్‌షోను జయప్రదం చేయండి

25 Mar, 2014 01:05 IST|Sakshi

జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించనున్న రోడ్‌షోను జయప్రదం చేయాలని చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ కోరారు.
 
సోమవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయమ్మ రోడ్‌షో సాయంత్రం ఖమ్మం జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ప్రవేశిస్తుందన్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం, గంగానమ్మ గుడి సెంటర్ మీదుగా బోసుబొమ్మ సెంటర్‌కు రోడ్‌షో చేరుతుందని, సాయంత్రం ఆరు గంటలకు విజయమ్మ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
 
ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ పరిధిలో ఉన్న వార్డు కౌన్సిల్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
 
సమావేశంలో పట్ణణ పార్టీ కన్వీనర్ చనమాల శ్రీనివాసరావు, వైసీపీ మండల కన్వీనర్ నులకాని వీరాస్వామి నాయుడు, నాయకులు మండవల్లి సొంబాబు, పోల్నాటి బాబ్జి, బీవీఆర్ చౌదరి, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
కార్యకర్తలు భారీగా తరలిరావాలి
మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెంలో జరిగే వైసీపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా బీసీసెల్ కన్వీనర్ పాశం రామకృష్ణ తెలిపారు.
 
విజయమ్మ రోడ్‌షో కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వైసీపీ జంగారెడ్డిగూడెం పట్టణ మహిళా విభాగం కన్వీనర్ వందనపు సాయిబాల పద్మ ఓ ప్రకటనలో కోరారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా