నగారా మోగింది

13 Apr, 2014 01:27 IST|Sakshi
నగారా మోగింది
 ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిం ది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిద్ధార్థజైన్ శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమైంది. తొలి రోజు నరసాపురం ఎంపీ స్థానానికి రెండు, ఆరు అసెంబ్లీ స్థానాలకు  ఏడు నామినేషన్లు దాఖలయ్యూయి. ఏలూరు పార్లమెంటరీ, 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నరసాపురం సిట్టిం గ్ ఎంపీ కనుమూరి బాపిరాజు కాం గ్రెస్ అభ్యర్థిగా, అదే స్థానానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియూ తరఫున ఆదిత్య కృష్ణంరాజు నామినేషన్ వేశారు.తాడేపల్లిగూడెం అసెంబ్లీ సెగ్మెం ట్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తోట గోపీ, ఉండి సెగ్మెంట్‌కు వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు పాతపాటి సర్రాజు నామినేషన్లు వేశారు. తణుకు సెగ్మెంట్‌కు బీఎస్పీ తరఫున పొట్ల సురేష్, పాలకొల్లులో స్వతంత్ర అభ్యర్థిగా షేక్ రసూల్, ఆచంటలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా నెక్కంటి అనిత, పోలవరంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నుంచి ధర్ముల సురేష్, స్వతంత్ర అభ్యర్థిగా సరయం రామ్మోహన్ నామినేషన్ వేశారు. ఏలూరు, చింతలపూడి, నిడదవోలు, భీమవరం, గోపాలపురం, దెందులూరు, ఉంగుటూరు, కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్లలో నామినేషన్లు బోణీ కాలేదు.
 
 మిగిలింది నాలుగు రోజులే...
 ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తుండగా, నాలుగు పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నారుు. 13వ తేదీ ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి, 18న గుడ్ ఫ్రైడే సెలవు దినాలు కావడంతో ఈనెల 15, 16, 17, 19 తేదీల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. 
 
 హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు
 లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్లకు పోటీచేసే అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు, నామినేషన్లు పత్రం దాఖలు చేసే సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు, సమర్పించాల్సిన వివిధ సరిఫికెట్లు వంటి వివరాలను తెలియజేసేందుకు వీలుగా రిట ర్నింగ్ అధికారుల కార్యాలయూల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్‌ను కలెక్టర్ సిద్ధార్థజైన్ ప్రారంభించారు. 19న మధ్యాహ్నం 3 గం టలకు నామినేషన్ల స్వీకరణ ముగుస్తుందని, 21న పరిశీలన, 23న మధ్నాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉందని కలెక్టర్ చెప్పారు. 
 
మరిన్ని వార్తలు