జగనన్నను సీఎంగా చూడాలన్నదే అమ్మ ఆశయం

3 May, 2014 01:27 IST|Sakshi
జగనన్నను సీఎంగా చూడాలన్నదే అమ్మ ఆశయం

ఉయ్యాలవాడ, న్యూస్‌లైన్: దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదని, జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే అమ్మ ఆశయమమని ఆమె పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ అన్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం మండలంలోని ఆర్.పాంపల్లె, కొండుపల్లె, సర్వాయిపల్లె, పెద్దయమ్మనూరు, బోడెమ్మనూరు గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శోభానాగిరెడ్డి భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆమె చూపించిన ప్రేమాభిమానాలు అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి అమ్మకు ఘనమైన నివాళి అర్పించాలని ఓటర్లను కోరారు. ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారని, ఆ అభిమానాన్ని ఓట్ల ద్వారా అమ్మకు చూపించాలన్నారు.

అమ్మకు వేసే ప్రతి ఓటు దేశంలోనే చారిత్రాత్మకం అవుతుందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. బోడెమ్మనూరులో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా మైనార్టీ మెంబర్ ఫక్కీరా ఖాసింసాహెబ్ మాట్లాడుతూ  బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతోనే తెలుగుదేశం పతనానికి పునాది పడిందన్నారు. సర్వాయిపల్లె గ్రామంలో మాజీ గ్రామ సర్పంచ్ ఆవుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీ తెచ్చి శోభమ్మ ప్రజల హృదయాల్లో నిలిచిందని చాటుతామన్నారు.

ప్రచారంలో ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల ఆ పార్టీ మండల కన్వీనర్లు మారంరెడ్డి అయ్యపురెడ్డి, గాండ్ల పుల్లయ్య, కోవెలకుంట్ల మార్కెట్‌యార్డ్ మెంబర్ బుడ్డా చంద్రమోహన్‌రెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్‌లు రామగోపాల్‌రెడ్డి, కర్రా రాజానందరెడ్డి, బత్తుల రామచంద్రుడు, గడ్డం దస్తగిరిరెడ్డి, పోచా రాధాకృష్ణారెడ్డి, సింగల్‌విండో ఉపాధ్యక్షుడు మద్దూరు రామకృష్ణారెడ్డి, ఉయ్యాలవాడ సింగల్‌విండో అధ్యక్షుడు బుడ్డా విశ్వనాథరెడ్డి, ఆ పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, బోరెడ్డి నర్సిరెడ్డి, శింగం వెంకటేశ్వరరెడ్డి, బుడ్డా రామిరెడ్డి, బోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గోపిరెడ్డి హరిప్రసాదరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు