నేటితో ఎన్నికల ప్రచారం సమాప్తం

5 May, 2014 03:16 IST|Sakshi
  • ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందంజలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు
  •  సాక్షి, చిత్తూరు :  జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది.  కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం గతనెల 19వ తేదీ వర కు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు 20వ తేదీ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ప్రధానం గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, తిరుప తి, చిత్తూరు, రాజంపేట లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు మూడుసార్లు కలిశారు. కూడళ్లలో సభలు పెట్టారు. గడప గడపా ఎక్కి దిగారు. దారిలో కనిపించిన వారికల్లా నమస్కారం పెట్టారు. అన్నా ఓటేయండి.. అక్కా.. మీ ఓటు.. తమ్ముడూ మరచిపోవద్దు.. పెద్దాయన గుర్తుపెట్టుకో.. బాషా భాయూ అంటూ వరుసలు పెట్టి పిలుస్తూ, ఆత్మీయం గా పలకరిస్తూ, దీనంగా ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. పల్లెపల్లెలో ఎన్నికల ప్రచార మైక్‌లు హోరెత్తాయి.

     ప్రచారంలో వైఎస్సార్ సీపీ ముందంజ
     వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా ప్రచార బాధ్యతలను ప్రధానంగా మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూజానికెత్తుకున్నారు. ఆయన తాను ప్రాతినిథ్యం వహిస్తు న్న పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసుకుంటూనే కుప్పం ఎన్నికల ప్రచారంపై దృష్టి కేంద్రీకరించా రు. చిత్తూరు, చంద్రగిరి, పూతలపట్టు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచారం సాగిం చారు.

     వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులు, పలమనేరులో అమరనాథరెడ్డి, గంగాధరనెల్లూరులో నారాయణస్వామి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నగరిలో ఆర్‌కే.రోజా, సత్యవేడులో ఆదిమూలం, తంబళ్లపల్లెలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మదనపల్లెలో దేశాయ్ తిప్పారెడ్డి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, పూతలపట్టులో డాక్టర్ సునీల్‌కుమార్, కుప్పంలో చంద్రమౌళి ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందున్నారు. రాజంపేట లోక్‌సభ పరిధిలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుపతి లోక్‌సభ పరిధిలో డాక్టర్ వరప్రసాద్, చిత్తూరు లోక్‌సభ పరి ధిలో డాక్టర్ సామాన్య కిరణ్ విస్తృతంగా ప్రచారం చేస్తూ, ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు.

     వెనుకబడిన కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీ
     జిల్లాలో ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఇతర పార్టీలు ప్రచారం నిర్వహించలేకపోయాయి. కాంగ్రెస్‌కు ముఖ్యమైన నాయకులు లేకపోవటంతో దొరికిన వారికే బీఫారం ఇచ్చి అభ్యర్థులుగా బరిలోకి దింపారు. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థుల పరిస్థితి కూడా ఇంతే. మందీ మార్బలం లేకపోవటంతో చాలా చోట్ల ప్రచారం చేసుకోలేక ఈ రెండుపార్టీల అభ్యర్థులు డీలాపడ్డారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి కూడా స్పందన లేదు. లోక్‌సత్తాదీ సత్తాలేని ప్రచారమే. తిరుపతి, రాజంపేట లోక్‌సభ స్థానాలకు, మదనపల్లె అసెంబ్లీకి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో వెనుకబడ్డారు. ఈ పార్టీకి క్యాడర్ లేకపోవడమే అందుకు కారణం.

మరిన్ని వార్తలు