ఆలూరుకు తొలి బీసీ ఎమ్మెల్యే

18 May, 2014 02:20 IST|Sakshi
ఆలూరుకు తొలి బీసీ ఎమ్మెల్యే

ఆలూరు రూరల్, న్యూస్‌లైన్: ఆలూరు నియోజకవర్గానికి తొలి సారిగా బీసీ వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955 ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి, హొళగుందలతో పాటు ఆస్పరి, ఆదోని మండలాల్లోని కొన్ని గ్రామాలతో జనరల్ నియోజకవర్గంగా ఏర్పడింది. మొదటి సారి హెచ్.రామలింగారెడ్డి (కాంగ్రెస్), 1962లో డి.లక్ష్మీకాంతరెడ్డి(కాంగ్రెస్)  రెడ్డి సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎస్సీగా రిజర్వుడు కావడంతో 1967లో డి.గోవిందాస్(స్వతంత్య్ర), 1972లో పి.రాజారత్నరావు(కాంగ్రెస్), 1978లో మసాల ఈరన్న (కాంగ్రెస్), 1983లో కె.బసప్ప (టీడీపీ), 1985లో రంగయ్య(కాంగ్రెస్), 1989లో లోకనాథ్ (కాంగ్రెస్), 1994లో మసాల ఈరన్న(టీడీపీ), 1999లో మారెప్ప(కాంగ్రెస్), 2004లో మారెప్ప (కాంగ్రెస్) ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2009లో పునర్విభజనలో భాగంగా ఆలూరు, ఆస్పరి, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి, దేవనకొండ మండలాలతో జనరల్ స్థానంగా మారింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాటిల్ నీరజారెడ్డి కాంగ్రెస్ తరుఫున గెలుపొందారు. ప్రస్తుతం 2014 ఎన్నికల్లో బీసీ వాల్మీకి కులానికి చెందిన గుమ్మనూరు జయరాం(వైఎస్సార్సీపీ) సమీప ప్రత్యర్థి వీరభద్రగౌడ్ (టీడీపీ)పై విజయం సాధించారు. నియోజకవర్గానికి మొట్టమొదటి బీసీ ఎమ్మెల్యేగా జయరాం గెలుపొందడంతో బీసీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి

మరిన్ని వార్తలు