అందరికీ ఉచిత సెల్‌ఫోన్లు: చంద్రబాబు

19 Mar, 2014 04:07 IST|Sakshi
అందరికీ ఉచిత సెల్‌ఫోన్లు: చంద్రబాబు

టీడీపీలో కొట్టు, హరివర్ధన్‌రెడ్డి చేరిక
 సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా సెల్‌ఫోన్లు అందిస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల్లో పది శాతం మందికి సెల్‌ఫోన్లు లేవని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారికి ఫోన్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా చంద్రబాబు మంగళవారం తన నివాసంలో జరిగిన సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తానేనన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేవన్నారు. టీడీపీ పని అయిపోయిందని కొందరు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్రేన్‌తో లే పినా లేచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’