సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం

25 Mar, 2014 02:08 IST|Sakshi
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం

 ఏప్రిల్ 2న నోటిఫికేషన్
 9వరకు నామినేషన్ల స్వీకరణ
 జిల్లాలో 28 లక్షలపైగా ఓటర్లు
 3,339 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు
 అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
 జిల్లా ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య

 

 సాక్షి, కరీంనగర్ : జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీన జరగనున్న 13 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. సోమవారం ఆయన తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వచ్చే నెల 2వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందని, అదే రోజు నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. మంథని నియోజకవర్గ పరిధిలోని మహదేవపూర్, మహా ముత్తారం మండలాల పరిధిలోని 13 గ్రామాల్లో కమ్యూనికేషన్ లేనట్లు గుర్తించామన్నారు.

ఈ ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని అసెం బ్లీ సెగ్మంట్లకు రిటర్నింగ్ అధికారిగా తాను వ్యవహరిస్తానని, పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లకు జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్, నిజామాబాద్ లోక్‌సభ స్థా నం పరిధిలోని కోరుట్ల, మెట్‌పల్లి స్థానాలకు ని జామాబాద్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. సాధారణ ఎన్నికలకు సం బంధించి ఇప్పటికే జిల్లాలో 3,339 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఒక్కో పో లింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లున్న గ్రా మాల్లో, 1400 ఓటర్లున్న పట్టణాల్లో అదనంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే 52 అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి నివేదించినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో వెబ్ అందుబాటులో లేని 476 పోలింగ్ కేంద్రాలను మినహాయించి మిగతా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. 83 పోలింగ్ కేంద్రాను ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామన్నారు.ఇప్పటికే 13 మంది రిటర్నిం గ్ అధికారులు, 57 మంది తహసీల్దార్లు గుర్తించిన పో లింగ్ కేంద్రాలను తనిఖీ చేశారన్నారు.

 పెరిగిన ఓటర్లు
 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలోగా జిల్లాలో ఓటర్ల సంఖ్య 28 లక్షలు దాటుతుందని కలెక్టర్ చెప్పా రు. ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు జిల్లా లో 27,43,655 మంది ఓటర్లుండగా.. ఈ నెల 9వ తేదీన 73,178 మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో ఇప్పటికే 52వేల మందికి నంబర్లు కేటాయించామని, వ చ్చే నెల 9వ తేదీలోగా ఇంకొందరికి ఓటు హ క్కు కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 30వ తేదీ వ రకు కొత్త ఓటర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వచ్చేనెల 9వ తేదీ తర్వాత  పెరిగిన ఓటర్ల సంఖ్య ప్రకటిస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 ఈవీఎంల పరిశీలన
 సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లను వినియోగిస్తామన్నారు. ఇందుకోసం 9,500 బ్యాలెట్ యూనిట్లు, 7,600 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈవీఎంలకు ఫస్ట్ లెవల్ చెక్(ఎఫ్‌ఎల్‌సీ) నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియలో ఈవీఎంలలో ఉన్న మొత్తం డాటా తొలగిస్తామన్నారు.  ఎఫ్‌ఎల్‌సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో ఐదు ఈవీఎంలలో వెయ్యి ఓట్లు వేసి చూపెడతామన్నారు. తర్వాత వాటినిస్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తామన్నారు.   అనంతరం ఎస్పీ శివకుమార్‌తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, జగిత్యాల సబ్ కలెక్టర్ శ్రీకేష్ లట్కర్, డీఆర్వో వీరబ్రహ్మయ్య, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

  ఎన్నికలకు పటిష్ట భద్రత : ఎస్పీ
 కరీంనగర్: ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత లు, ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలు కు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శివకుమార్ తెలిపారు. జిల్లాలో 552 అత్యంత సమస్యాత్మక, 1277 సమస్యాత్మక, 159 తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పా రు. ఈ ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరి గేందుకు భద్రతాదళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.1,86,96,233ల నగదును సీజ్ చేసి, 1225.5 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నామని, 6638 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. నిబంధనల ఉల్లంఘన కింది 10 కేసులు నమోదు చేసి, 36 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు