అభివృద్ధికి పట్టం కట్టండి : జానారెడ్డి

25 Apr, 2014 00:59 IST|Sakshi
మక్కపల్లి: మాట్లాడుతున్న కుందూరు జానారెడ్డి

గుర్రంపోడు, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండని కాంగ్రెస్ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి కోరారు. గురువారం మండలంలోని మొసంగి, చేపూరు, తా నేదార్‌పల్లి, జూనూతుల, మక్కపల్లి, సుల్తాన్‌పురం, ఉట్లపల్లి, పోచంపల్లి, తేనపల్లి, కొప్పోలు, గుర్రం పోడు, పాల్వాయి గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు.  

30 ఏళ్లలో లేని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించానని తెలిపారు. శ్రీశైలం ఎడుమగట్టు కాల్వకు పునాది వేసింది, మండల వ్యవస్థకు ఆధ్యున్ని తానేనని పేర్కొన్నారు. ఊరు, వాడా తెలి యని వాళ్లు కులం పేరుతోనో, మరో రకంగానో ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

జానారెడ్డికి కులం, మతం లేదని ప్రజలందరి మనిషినని అన్నారు. తెలంగాణా పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ కోరతను అధిగమించేందుకు నాలుగు వేల కోట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని సోని యా, రాహూల్ హామీ ఇచ్చారని తెలిపారు. మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలు  కాంగ్రెస్ అమలు చేసిందన్నారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు