హాస్టల్ విద్యార్థినుల నిర్బంధం

31 Mar, 2014 00:23 IST|Sakshi
హాస్టల్ విద్యార్థినుల నిర్బంధం
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్నారన్న నెపంతో హాస్టల్ విద్యార్థినులు ఓటేయకుండా.. వారిని నిర్బంధించిన టీడీపీ నేతలకు చుక్కెదురైంది. అమలాపురం 9వ వార్డులో ఈ ఘటన జరగ్గా, పోలీసుల చొరవతో ఆ విద్యార్థినులు తమ ఓటేశారు. వివరాలు... తొమ్మిదో వార్డులో ఉన్న కోనసీమ నర్సింగ్ హాస్టల్‌కు చెందిన 30 మంది విద్యార్థినులకు మున్సిపాలిటీలో కొత్తగా ఓటు హక్కు లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న వీరంతా గత వారం అమలాపురంలో ‘వైఎస్సార్ జనభేరి’ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డికి స్థానిక ఎర్రవంతెన సాయిబాబా ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. వీరిని జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్యాయంగా పలకరించారు. 
 
 వీరంతా వైఎస్సార్ సీపీకే ఓటు వేస్తారని 9వ వార్డుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు నిర్ధారణకు వచ్చాడు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్నాడు. విద్యార్థినులు బయటకు రానీయకుం డా  ఆదివారం ఉదయం నుంచి ఒత్తిడి చేయ డం మొదలుపెట్టాడు. ఆ ప్రాంత టీడీపీ నాయకుడొకరు హాస్టల్ సిబ్బందిని మభ్యపెట్టి.. వి ద్యార్థినులను బయటకు రానీయకుండా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. భయాందోళనకు గురైన విద్యార్థినులు సాయంత్రం 4 గంటల వరకు హాస్టల్‌లోనే ఉండిపోయారు.ఓ అజ్ఞాత వ్యక్తి ఈ విషయాన్ని అమలాపురం పోలీసులకు సమాచారం అందించాడు. అమలాపురం రూ రల్ సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి తన సిబ్బం దితో ఆ హాస్టల్‌కు చేరుకున్నారు. పోలీసులను చూసి, అక్కడున్నవారు పరారయ్యారు. మొత్తం 30 మంది విద్యార్థినులకు సీఐ భద్రత కల్పించి, పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. దీంతో వారు నిర్భయంగా ఓటు వేయగలిగారు.
 
 టీడీపీ కార్యకర్త వీరంగం
 ఇంతలో లక్ష్మణరావు అనే టీడీపీ కార్యకర్త అక్కడకు చేరుకుని హాస్టల్ విద్యార్థినులతో ఓట్లెలా వే యిస్తారని సీఐని ప్రశ్నించాడు. విద్యార్థినుల చేతి లో ఉన్న ఓటర్ స్లిప్పులను సీఐ చూపించారు. ఏమైనా అభ్యంతరముంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకుంటారని పోలీసులు అతడిని నిలువరిం చారు. ఓ సందర్భంలో ఆ కార్యకర్తకు, పోలీసుల కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదంతా దళితుల వల్లే జరిగిందంటూ ఓ టీడీపీ కార్యకర్త కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ.. పోలింగ్ బూత్ ఎదురుగా 216 జాతీయ రహదారిపై ఆ సామాజిక వర్గీయులు బైఠాయించారు. సీఐ హామీతో వారు శాంతించారు.
 
>
మరిన్ని వార్తలు