భాషరాని వారు..ఏం సేవచేస్తారు!

26 Apr, 2014 03:55 IST|Sakshi
భాషరాని వారు..ఏం సేవచేస్తారు!
  •      టీఆర్‌ఎస్‌ను వ్యాపారసంస్థగా మార్చిన కేసీఆర్
  •      జహీరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్
  •  కోటగిరి, న్యూస్‌లైన్ :  భాషరాని బీబీపాటిల్‌కు జహీరాబాద్ లోక్‌సభ టికెట్ ఇచ్చిన కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని వ్యాపార సంస్థగా మార్చారని జహీరాబాద్ కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్‌షెట్కార్ విమర్శించారు. శుక్రవారం ఆయన కోటగిరిలో విలేకరులతో మాట్లాడారు. డబ్బులున్న వారికి టికెట్‌లు ఇస్తూ,  జెండాలు మోసిన వారికి అన్యాయం చేసిన కేసీఆర్‌కు ఇతర పార్టీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గతంలో బీబీపాటిల్ బీజేపీలో చేరినట్లు ప్రకటనలు చేసి, ఆ పార్టీ కండువాను కూడా వేసుకున్న ఆయనను కేసీఆర్ దరిచేర్చుకొని డబ్బులకు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు.  రెండు లోక్‌సభ సీట్లున్న  కేసీఆర్ తెలంగాణ ఎలా సాధిం చారో, ఎవరివల్ల తెలంగాణ వచ్చిందో  ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.  తెలంగాణ ఏర్పాటుకు కృషిచేసిన సోనియాగాంధీని ఆకాశానికి ఎత్తి వారి ఇంటికి వెళ్ళిన కేసీఆర్ అనంతరం సోనియాను దెయ్యం,భూతం అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. డబ్బులిస్తే కేసీఆర్ దేనికైనా సిద్ధమేనని విమర్శించారు.

     చంద్రబాబు ఊసరవెల్లి
     తెలంగాణపై రెండు ప్రాంతాల్లో రెం డువిధాలుగా వ్యవహరించిన టీ డీ పీ అధినేత  చంద్రబాబు ఊసరవె ల్లి అని విమర్శించారు. అధికార దా హంతో తెలంగాణలో,సీమాంధ్రలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే తపనతో మతతత్వపార్టీ అయిన బీజేపీతో జతకట్టడం శోచనీయమన్నారు. తెలంగాణలో తమ పార్టీ లేఖ ఇవ్వడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెబుతూ, సీమాంధ్రలో తెలంగాణను అడ్డుకుంది మొదటి నుంచి తమపార్టీయేనని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడన్నారు. చంద్రబాబును రెండు ప్రాంతాల ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు.  తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఈ ప్రాంత ప్రజలు   చేతి గుర్తుకు ఓటేసి కృతజ్ఞతలు తెలుపాలన్నారు. సమావేశంలో బాన్సువాడ  అభ్యర్థి కాసుల బాల్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు పవన్,మహ్మద్,రాజ్‌దేశాయ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు