పాలన లో కొత్త పంథా

5 Apr, 2014 01:43 IST|Sakshi
పాలన లో కొత్త పంథా

సలహాల కోసం మేధావులు,  నిపుణులతో కమిటీ
ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్, కేంద్రంతో సమానంగా జీతాలు
24 జిల్లాల ఏర్పాటు, హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్లు
టీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్
 

హైదరాబాద్: తెలంగాణలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, రైతులందరికీ లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. సంస్కరణలతో సరికొత్త పాలన అందిస్తామన్నారు. అన్ని వర్గాలకూ పలు హామీలనిస్తూ శుక్రవారం ఆయన పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కొత్త పంథాను అనుసరిస్తామని ఈ సందర్భంగా గులాబీ దళపతి ప్రకటించారు. సామాజిక మార్పు కోసం నిజాయితీగా పనిచేసిన మేధావులు, సామాజిక ఉద్యమకారులతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రజా కమిటీలను ఏర్పాటు చేసి సమర్థ పాలన కోసం సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.

అలాగే ప్రభుత్వానికి సలహాలివ్వడానికి, సంప్రదింపుల కోసం పత్రికా సంపాదకులు, విషయ నిపుణులు, విద్యావేత్తలతో కూడిన రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఒక్కో జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో తెలంగాణలో 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్‌ను అభివృద్ధి చేస్తామని, నగరంలో మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని, విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని ఇతర ముఖ్యాంశాలు..

 నీటిపారుదల రంగం

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు
చెరువుల పునరుద్ధరణ, నదీ జలాలతో అనుసంధానం
పోలవరం డిజైన్ మార్పు, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తికి చర్యలు

విద్యుత్‌రంగం
 
కొత్తగా పది థర్మల్ ప్లాంట్ల నిర్మాణం
కొత్త ప్రాజెక్టుల ద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధికి అవకాశం

యవసాయరంగం

  రైతులందరికీ లక్షలోపు రుణాలు మాఫీ
  8 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్
  మూడేళ్లలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు కృషి

 విద్యారంగం

  కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య
  ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు
  ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక పాలిటెక్నిక్ కాలేజీ

వైద్య, ఆరోగ్య రంగం

  24 జిల్లా కేంద్రాల్లో 24 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
  నలుగురు డాక్టర్లతో మండల స్థాయిలో 30 పడకల ఆసుపత్రి, నియోజకవర్గంలో వంద పడకల ఏరియా ఆసుపత్రి
  మరింత పటిష్టంగా 108, 104 పథకాల అమలు

 ప్రజా సంక్షేమం

  వృద్ధులు, వితంతువులకు వెయ్యి, వికలాంగులకు రూ. 1500 పింఛను
  వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు
 అమరుల కుటుంబాల సంక్షేమం
  అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
  రూ. 10 లక్షల సహాయం, గృహ వసతి
  అంతర్జాతీయస్థాయిలో అమరుల స్మృతి చిహ్నం నిర్మాణం
 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళల సంక్షేమం
  వచ్చే ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లతో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికి చర్యలు
  ఎస్సీ కుటుంబాలకు 3 ఎకరాల భూ పంపిణీ
  ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్, గ్రామ పంచాయతీలుగా తండాలు, గూడెంలు
  చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌కు కృషి
  రూ. 25 వేల కోట్లతో బీసీల సమగ్రాభివృద్ధి
  హైదరాబాద్‌లో కల్లు డిపోలపై నిషేధం ఎత్తివేత
  మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, రెండో అధికార
 భాషగా ఉర్దూ
  చట్ట సభల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు, మహిళా బ్యాంకుల ఏర్పాటు, ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ఏర్పాటు
 
ఉద్యోగుల సంక్షేమం

  ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్
  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, పెన్షన్లు
  ఆంధ్రా ఉద్యోగుల బదలాయింపు
  కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ
 జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమం
  జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇళ్లు, అక్రెడిటేషన్,
 
హెల్త్ కార్డులు


  తక్షణం హైకోర్టు ఏర్పాటుకు చర్యలు
  రూ. 100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధి

 పారిశ్రామికాభివృద్ధి

  పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా
  ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా వరంగల్‌కు గుర్తింపు
  కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
  జిల్లా కేంద్రాలకు రింగు రోడ్లు
  హైదరాబాద్-జిల్లా కేంద్రాల మధ్య నాలుగు లైన్ల రోడ్డు
 

>
మరిన్ని వార్తలు