పోరు రసవత్తరం!

18 Apr, 2014 01:34 IST|Sakshi
పోరు రసవత్తరం!

రాజకీయ చైతన్యానికి మారుపేరు కామారెడ్డి. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి, వామపక్ష ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచింది. విలక్షణమైన తీర్పునిచ్చే కామారెడ్డి బరిలో ఈసారి పదిమంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం నలుగురి మధ్యే నెలకొంది. మాజీ మంత్రి షబ్బీర్, సిట్టింగ్ ఎమ్మెల్యే గోవర్దన్‌లతో వైఎస్సార్‌సీపీ నుంచి కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సిద్దిరాములు తలపడుతున్నారు. గెలుపు మీద ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
 అసెంబ్లీ నియోజకవర్గం
కావూరెడ్డి
ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 5,
టీడీపీ- 3, స్వతంత్రులు - 2, టీఆర్‌ఎస్- 1
ప్రస్తుత ఎమ్మెల్యే: గంప గోవర్దన్ (టీఆర్‌ఎస్)
రిజర్వేషన్: జనరల్
నియోజకవర్గ ప్రత్యేకతలు: కరీంనగర్, నిజావూబాద్, మెదక్ జిల్లాల కూడలి.
బీసీ, మైనార్టీ ఓట్ల అధికం. రాజకీయు చైతన్యం ఎక్కువ
ప్రస్తుతం బరిలో నిలిచింది: 10

 ప్రధాన అభ్యర్థులు వీరే..
 మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్)
 గంప గోవర్దన్ (టీఆర్‌ఎస్)
 పైలా కృష్ణారెడ్డి(వైఎస్సార్ సీపీ)
 ఇట్టం సిద్దిరాములు (బీజేపీ)

సేపూరి వేణుగోపాలచారి, కామారెడ్డి: మెదక్, కరీంనగర్, నిజావూబాద్ జిల్లాల కూడలిగా కావూరెడ్డి నియోజకవర్గం ఉంది. రెండు దశాబ్దాలుగా ఇక్కడ  మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ (కాంగ్రెస్), సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ (టీఆర్‌ఎస్)ల మధ్యే పోరు సాగుతుంది.  1989, 2004 ఎన్నికలల్లో భారీ మెజారిటీతో షబ్బీర్ గెలుపొంది వుంత్రి పదవులు చేపట్టారు. 1994, 2009 సాధారణ ఎన్నికల తో పాటు 2012 ఉప ఎన్నికల్లో గంప గోవర్దన్ గెలుపొందారు. ఇప్పుడు ఈ ఇద్దరితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలా కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ ఇట్టం సిద్దిరాములు పోటీ పడుతున్నారు. ైవె .ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయునే ధీవూతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. సీనియుర్లను కాదని డాక్టర్ సిద్దిరాములుకు టికెట్ ఇవ్వడంతో బీజేపీలో కొంత అసంతృప్తి ఉంది.
 
మోడీనే తవు గెలుపు వుంత్రవుని సిద్ది రావుులు భావిస్తున్నారు.  స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం పది వుంది రంగంలో  ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం ఈ నలుగురి మధ్యే ఉంటుంది.  తెలంగాణ ఉద్యమం-అభివృద్ధి అంశాలపై షబ్బీర్, గంపల మధ్య తరచు మాటల తూటాలు పేలుతూనే ఉన్నారుు. ఒక్కోసారి నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు.  శాశ్వత అభివృద్ధి పనులతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించానని షబ్బీర్‌అలీ  ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ కోసం టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనావూ చేసి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యానని, టీఆర్‌ఎస్ ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశానని గంప గోవర్దన్ పేర్కొంటున్నారు.
 
వైఎస్సార్ పథకాలే స్ఫూర్తిగా పైలా కృష్ణారెడ్డి..
మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు కారణంగా నియోజవర్గం అభివృద్ధి కుంటుపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలా కృష్ణారెడ్డి వివుర్శిస్తున్నారు. దివంగత నేత డాక్టర్ ైవె .ఎస్. రాజశేఖరరెడ్డి ఆశయు సాధన, బడుగు, పేద, బలహీన వర్గాలకు ఆయన చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తాయని కృష్ణారెడ్డి అంటున్నారు.  వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరిగిందని చెబుతూ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు.
 
రాజకీయాలకు కొత్త ...
బీజేపీ అభ్యర్థి సిద్దిరాములుకు రాజకీయాలు కొత్త. సొంత సామాజిక వర్గం ఓట్లతో పాటు వైద్యునిగా గుర్తింపు, మోడీ హవా మీద ఆయున ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో హిందూత్వ సంస్థలు బలంగా ఉన్నాయునే ధీవూ కూడా ఉంది.  
 
 నే.. గెలిస్తే..

-   యువతకు ఉపాధి అవకాశాల కల్పన.
-  విద్యార్థులందరికీ  హాస్టల్ వసతుల కల్పన.  
-  కామారెడ్డికి మెడికల్ కాలేజీ ఏర్పాటు.
-  ఏరియా ఆస్పత్రిని నిమ్స్ తరహా అభివృద్ధి.
-  కావూరెడ్డిలో యుూనివర్సిటీ ఏర్పాటు.
-  మండల కేంద్రాల్లో రైతు బజార్ల నిర్మాణం.
-  ప్రతీ ఇంటికీ గోదావరి నీటి సరఫరా.
-  పైలా కృష్ణారెడ్డి (వైఎస్సార్‌సీపీ)

- గోదావరి నుంచి తాగునీటి పథకం పూర్తి చేరుుస్తా.
- ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కోసం ప్రయత్నం,1.45 లక్షల ఎకరాల సాగునీరు.
- కామారెడ్డిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం.
- పేదవారందరికీ పక్కాగృహాలనిర్మాణం.
- యువతకు ఉపాధి కల్పనకు పరిశ్రమల ఏర్పాటు.
- మహ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్)
 
- అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు  ప్రాధాన్యం.
- ప్రతి గ్రామానికి రక్షత  తాగునీటి సరఫరా,రోడ్ల నిర్మాణానికి కృషి.
-  గ్రామాలకు వెళ్లే రోడ్లను బీటీ రోడ్లుగా మార్పు
- విద్యాభివృద్ధి కోసం అదనపు గదుల నిర్మాణం.
- డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి.
- గంప గోవర్దన్ (టీఆర్‌ఎస్)
 
- రైతుల రుణాల మాఫీ.
- అర్హులందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం.
- బీడీ కార్మికుల కోసం ప్రత్యేక ఆస్పత్రి.
- యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు.  
- 60 ఏళ్లు నిండిన రైతులకు ఫించన్లు.
- గిరిజన, దళిత వాడల్లో పేదలకు వైద్య శిబిరాలు.
- డాక్టర్ ఇట్టం సిద్దిరాములు (బీజేపీ)

మరిన్ని వార్తలు