కాపుల రిజర్వేషన్ నివేదిక తొక్కిపెట్టిన చంద్రబాబు

4 May, 2014 19:41 IST|Sakshi
కాకినాడలో కాపునాడు సమావేశం

హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్‌ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటైన పుట్టిస్వామి కమిషన్‌ నివేదికను  తొక్కిపెట్టింది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని  తూర్పు గోదావరి జిల్లా కాపునాడు  జిల్లా అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు స్పష్టం చేశారు. కాకినాడలో జరిగిన కాపునాడు సమావేశానికి భారీ ఎత్తున కాపులు హాజరయ్యారు. చంద్రబాబు తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాపుల సంక్షేమానికి పాటుపడింది దివంగత నేత వైఎస్సారేనని మంగారావు చెప్పారు.  

ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి కూడా కాపులకు సముచిత స్థానం ఇస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే కాపులకు 9 సీట్లిచ్చి గౌరవించారని ఆయన తెలిపారు. అందువల్ల జగన్ గెలుపు కోసం కాపులంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమ బాగోగులు పట్టించుకోని పవన్‌కల్యాణ్‌ గురించి మాట్లాడటం కూడా దండగని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు