రాజీనామా చేయడం తప్పేః కేజ్రీవాల్

11 Apr, 2014 13:31 IST|Sakshi
రాజీనామా చేయడం తప్పేః కేజ్రీవాల్

'అవును... తప్పు చేశాను. రాజీనామా చేయడం తప్పే' అంటున్నారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజరీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 49 రోజులకే రాజీనామా చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదని కేజరీవాల్ అంగీకరించారు.


రాజీనామా చేయడానికి సైద్ధాంతిక కారణాలున్నా, రాజీనామా టైమింగ్ మాత్రం పొరబాటేనని ఆయన అంటున్నారు. ప్రజలకు మరింత వివరణను ఇచ్చి, సభలు పెట్టి, మా అభిప్రాయాన్ని చెప్పి, ఆ తరువాత రాజీనామా చేసి ఉంటే బాగుండేదేమో. అలా చేయకుండా నేరుగా రాజీనామా చేయడం వల్ల ప్రజలకు మా పట్ల అనుమానాలు పెరిగాయి.  వారు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు.' అన్నారు కేజరీవాల్.


ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం 49 రోజులకే రాజీనామా చేయడం తో ఆప్ మద్దతుదారుల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో ఉండగా కేజరీవాల్ పై రాళ్లు విసరడం, చెంప దెబ్బ కొట్టడం వంటి సంఘటనలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం లాలీ అనే ఆటోరిక్షా డ్రైవర్ సుల్తాన్ పూర్ ప్రాంతంలో కేజ్రీవాల్ కి మెడలో పూల దండలు వేసి మరీ లాగి లెంపకాయ కొట్టాడు.

మరిన్ని వార్తలు