అమ్మను భారీ మెజార్టీతో గెలిపిద్దాం

30 Apr, 2014 11:56 IST|Sakshi
అమ్మను భారీ మెజార్టీతో గెలిపిద్దాం

ఆళ్లగడ్డ : దివంగత ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ, ఆమె చూపించిన ప్రేమ, అభిమానాలు అందరి హృదయాల్లో నిలిచి ఉన్నాయని కుమార్తె భూమా అఖిలప్రియ అన్నారు. అమ్మను భారీ మెజార్టీతో గెలిపించి ఆమెకు ఘనమైన నివాళి అర్పిద్దామని పిలుపునిచ్చారు.  మంగళవారం సాయంత్రం మండలంలోని భాగ్యనగరం, కొండాపురం, రామచంద్రాపురం, దొర్నిపాడు, అమ్మిరెడ్డినగరం, అర్జునాపురం గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా నిరాజనాలు పట్టి ఆమెకు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కొండాపురం గ్రామంలోలో ఆమె మాట్లాడుతూ.. అమ్మ ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసమె తపించేవారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి శోభానాగిరెడ్డి ఎంతో కృషి చేశారని విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి అన్నారు. లక్ష మెజార్టీతో ఆమెను గెలిపించి రుణం తీర్చుకుందామన్నారు.
 

మరిన్ని వార్తలు