జోరందుకున్న నామినేషన్లు

17 Apr, 2014 05:02 IST|Sakshi
చిత్తూరు: నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్

సాక్షి, చిత్తూరు: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. బుధవారం ఒక్కరోజే 33 నామినేషన్లు దాఖలయ్యూరుు. చిత్తూరు లోక్‌సభ  వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంధవరపు సామాన్య ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కె.నారాయణస్వామితో కలిసి వచ్చి నామినేషన్ వేశారు.

చిత్తూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ కూడా ఒక సెట్‌నామినేషన్ దాఖలు చేశారు. రాజంపేట ఎంపీ స్థానానికి ఒక్కనామినేషన్ కూడా రాలేదు. మూడురోజులే గడువు ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. బీ ఫారం అందకపోయినా, అధికారికంగా ప్రకటించకపోయినా తిరుపతిలో వెంకటరమణ టీడీపీ తరపున నామినేషన్ వేయడం గమనార్హం.

 ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నామినేషన్లు
 వైఎస్సార్ సీపీ తరపున కుప్పం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సత్యవేడు నుంచి ఆదిమూలం, పూతలపట్టు నుంచి డాక్టర్ సునీల్‌కుమార్, తంబళ్లపల్లె నుంచి ఏవీప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్లు వేశారు.

అదేవిధంగా టీడీపీ అభ్యర్థులు శ్రీకాళహస్తి నుంచి టీడీపీ నాయకుడు బొజ్జలగోపాలక్రిష్ణారెడ్డి,పుంగనూరునుంచి వెంకటరమణరాజు, జీడీ నెల్లూరు నుంచి  కుతుహలమ్మ, పలమనేరు నుంచి ఆర్‌వి.చంద్రబోస్, తిరుపతి నుంచి వెంకటరమణ, పూతలపట్టు నుంచి లలితకుమారి నామినేషన్లు దాఖలు చేశారు. తంబళ్లపల్లె నుంచి సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా సీపీ సుబ్బారెడ్డి నామినేషన్ వేశారు. మదనపల్లె నుంచి బీజేపీ అభ్యర్థి చల్లపల్లి నరసింహారెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి బి.నరేష్‌కుమార్‌రెడ్డి, బి.కవిత, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఒకరు నామినేషన్ వేశారు.

చంద్రగిరి నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. తిరుపతి నియోజకవర్గంలో ఐదుగురు నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఇద్దరు కాంగ్రెస్ తరపున, ఇద్దరు స్వతంత్రులు, ఒకరు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి. శ్రీకాళహస్తి నుంచి జైసమైక్యాంధ్ర పార్టీ తరపున సీ.ఆర్.రాజన్, సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పెనుబాల చంద్రశేఖర్ నామినేషన్ వేశారు.

చిత్తూరు, నగరికి నామినేషన్లు రాలేదు. పూతలపట్టు నుంచి కాంగ్రెస్ తరపున ఎ.ప్రవీణ్ నామినేషన్ వేశారు. పలమనేరులో టీడీపీ నుంచి జయంతి అనే మహిళ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి పార్థసారథిరెడ్డి నామినేషన్ వేశారు. కుప్పం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కె.శ్రీనివాసులు నామినేషన్ వేశారు.

మరిన్ని వార్తలు