రేపే లోకల్ తీర్పు

12 May, 2014 02:14 IST|Sakshi
రేపే లోకల్ తీర్పు

 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్:జిల్లాలోని ‘స్థానిక’ వీరులెవరో మంగళవారం తేలిపోనుంది. జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలు, 549 ఎంపీటీసీ స్థానాలకు గత నెలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. విజయనగరం డివి జన్ పరిధిలో ఉన్న 19 మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను విజయనగ రం పట్టణంలోని మూడు కేంద్రాల్లో నిర్వహిం చనున్నారు. పార్వతీపురం డివిజన్‌లోని 15 మండలాల ఓట్ల కౌంటింగ్‌ను పార్వతీపురం పట్టణంలోని మూడు కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
 
 విజయనగరం డివిజన్‌లో..  
 ఎస్ కోట, పూసపాటిరేగ, గుర్ల, గరివిడి, కొత్తవలస, జామి మండలాల ఓట్ల లెక్కింపును ఎం.ఆర్ అటానమస్ కళాశాల, వీజీ బ్లాక్‌లో ఏర్పాటు చేశారు. గంట్యాడ, చీపురుపల్లి, దత్తిరాజేరు మండలాల ఓట్లను ఎం.ఆర్ అటానమస్ కళాశాలలోని 11,12,13 నంబర్ గదుల్లో లెక్కిస్తారు.
 
భోగాపురం, గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, వేపాడ మండలాల ఓట్లను ఎం. ఆర్ మహిళా కళాశాలలోని 1నుంచి 5 నంబర్ గదుల్లో లెక్కిస్తారు. విజయనగరం, నెల్లిమర్ల మండలాల లెక్కింపును ఎం.ఆర్ మహిళా కళాశాలలోని 6,7 నంబర్ గదుల్లో చేపడతారు.     డెంకాడ, ఎల్‌కోట, మెరకముడిదాం మండలాల ఓట్ల లెక్కింపును ఎం.ఆర్ మహిళా కళాశాలలోని 8,9,10 నంబర్ గదుల్లో చేపడతారు.
 
 పార్వతీపురం డివిజన్‌లో....
 పార్వతీపురం, తెర్లాం, సీతానగరం, రామభద్రపురం, కొమరాడ మండలాల ఓట్ల లెక్కింపును పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 1నుంచి 5 గదుల్లో నిర్వహిస్తారు. బొబ్బిలి, మక్కువ, పాచిపెంట, సాలూరు, బాడంగి మండలాల ఓట్లను పార్వతీపురం ఆర్‌సీఎం బాలికోన్నత పాఠశాలలోని 6నుంచి 10 గదుల్లో లెక్కిస్తారు.     జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, బలిజిపేట, గరుగుబిల్లి మండలాల ఓట్లను పార్వతీపురం ఎస్.వి డిగ్రీ ఎయిడెడ్ కశాశాల లోని 11 నుంచి 15 గదుల్లో నిర్వహిస్తారు.
 
 ఎదురు చూపులు
 జెడ్పీటీసీ ఫలితాలకోసం  జిల్లా వ్యాప్తంగా 135 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఫలితాల కోసం 1495 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాల ఫలితాల కోసం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నుంచి 32 మంది,(కురుపాంలో ఆ పార్టీ అభ్యర్థికి గుర్తు కేటాయించలేదు) బీజేపీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఇద్దరు,సీపీఎం నుం చి 11మంది, కాంగ్రెస్ నుంచి 24 మంది, బీఎస్పీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి 34 మంది, లోక్ సత్తానుంచి ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థులు 26 మంది ఎదురు చూస్తున్నారు. అలాగే మొత్తం 549 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 474 మంది, బీజేపీ నుంచి ఒక రు, సీపీఐ నుంచి ఒకరు, సీపీఎం నుంచి 51 మంది, కాంగ్రెస్ నుంచి 296 మంది, టీడీపీ నుంచి 533 మంది, లోక్‌సత్తా నుంచి ఏడుగురు, స్వతంత్రఅభ్యర్థులు 132 మంది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు