గులాబీ.. హస్తం

29 Mar, 2014 01:59 IST|Sakshi
గులాబీ.. హస్తం

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హోరాహోరీగా ప్రచారపర్వం వుుగిసింది. వుున్సిపల్ ఎన్నికల బరి పోటాపోటీని తలపిస్తోంది. కరీంనగర్, రావుగుండం కార్పొరేషన్లతో పాటు నాలుగు వుున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయుతీల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల వుధ్యనే కీలక పోటీ నెలకొంది. వేవుులవాడలో బీజేపీ గట్టి పోటీనిస్తుండటంతో త్రివుుఖ పోటీ తలెత్తింది. సీట్లు సర్దుబాటు చేసుకున్నప్పటికీ జిల్లాలో టీడీపీ-బీజేపీ పొత్తు పొసగలేదు. ప్రచారంలో ఆ రెండు పార్టీలు ఎక్కడ కూడా కలిసి కదిలిన దాఖలాలు లేవు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంటలో బీజేపీ అభ్యర్థుల ప్రభావం కనిపిస్తున్నప్పటికీ... టీడీపీ అన్నిచోట్లా డీలా పడింది. స్వయుంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎల్.రవుణ, విజయురవుణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న జగిత్యాల, పెద్దపల్లిలోనూ చెప్పుకోదగ్గ సీట్లను గెలుచుకునే పరిస్థితి కనిపించటం లేదు. కరీంనగర్, కోరుట్ల, మెట్‌పల్లిలో ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉండటం గెలుపోటవులను ప్రభావితం చేయునుంది.


కరీంనగర్ కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపిన రెండు పార్టీలు ప్రచారంలో పోటాపోటీ పడ్డారుు. ఈ గెలుపోటముల ప్రభావం నెల రోజుల్లో జరుగనున్న సాధారణ ఎన్నికలపై పడుతుందనే భయుంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వుున్సిపోల్స్‌కు ఉరుకులు పరుగులు తీశారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ తరఫున ఎంపీ పొన్నం ప్రభాకర్, చెల్మెడ లక్ష్మీనరసింహారావు, టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే గంగుల కవులాకర్ టిక్కెట్ల పంపిణీ నుంచే తవు శక్తియుుక్తులు ఒడ్డారు. వుంత్రి శ్రీధర్‌బాబు అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే  గంగుల కమలాకరే టీఆర్‌ఎస్‌కు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. మేయుర్ సీటును ఆశిస్తున్న నేతలు బరిలోకి దిగిన డివిజన్లలో పోటీ తారస్థారుుకి చేరింది. మైనారిటీల ఓటుబ్యాంకు ఎక్కువగా ఉన్న నగరం కావటంతో ఎంఐఎం పార్టీ 22 స్థానాల్లో పోటీకి దిగింది.

 ప్రతిసారీ  కీలకంగా వూరుతున్న ఎంఐఎం ఈసారి కూడా మేయర్ ఎంపికలో చక్రం తిప్పే అవకాశాలున్నారుు. తొలిసారిగా పోటీకి దిగిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 12 స్థానాల్లో ప్రచారంలో పోటీ పడ్డారు. రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ధీటుగా స్వతంత్య్ర అభ్యర్థుల హవా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలకు మించినట్లుగానే స్వతంత్రులు పోటీ పడటంతో ఇక్కడి గెలుపోటవుులు ఆసక్తి రేపుతున్నారుు. మొత్తం 50 డివిజన్లలో అత్యధికంగా 513 వుంది ఇక్కడి బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోవూరపు సత్యనారాయుణకు ఇక్కడి ఎన్నికలు సవాలుగా వూరారుు.


  సిరిసిల్ల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం సాగించాయి. ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది.  ఎంపీ పొన్నం, కేడీసీసీబీ ఛైర్మన్ కొండూరి ప్రచారం చేశారు. స్వయుంగా కేటీఆర్  పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

కోరుట్ల మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ప్రధాన పోటీలో ఉన్నారుు. ఎంఐఎం పార్టీకి పలు వార్డులో పట్టు ఉండటం.. ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉండటంతో ఇక్కడి గెలుపోటవుులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.మెట్‌పల్లి పట్టణంలో 24 వార్డులున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ ఖాయుమైంది. కాంగ్రెస్ తరఫున జువ్వాడి తనయుులు నర్సింగారావు, కృష్ణారావు, పీసీసీ కార్యదర్శి జెఎన్.వెంకట్ ప్రచారంలో పాల్గొన్నారు.


  కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలు రెండూ తన సెగ్మెంట్‌లో ఉండటంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నీ తానై అన్నట్లుగా ప్రచారం చేపట్టారు. ఎంఐఎం తరపున ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు మెట్‌పల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు.
  టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్.రవుణ ప్రాతినిథ్యం వహిస్తున్న జగిత్యాల వుున్సిపాలిటీలోనూ ఆ పార్టీ ప్రచారం అంతంతగానే సాగింది. కాంగ్రెస్-టీఆర్‌ఎస్‌ల వుధ్య పోటాపోటీ నెలకొంది.


  కొత్తగా ఏర్పడ్డ అరుుదు నగర పంచాయుతీల్లో జమ్మికుంట, హుజూరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రతిష్టాత్మకంగా వూరారుు. పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు పోటాపోటీగా కౌన్సిలర్ స్థానాలను గెలిచే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని హుస్నాబాద్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ వేములవాడలో పోరు వులుపులు తిరిగింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీల వుధ్య త్రివుఖ పోటీ ఏర్పడింది. అదే స్థారుులో స్వతంత్రులు సైతం సవాలుగా నిలిచారు. దీంతో ఇక్కడ గెలుపోటవుులు ఉత్కంఠ రేపుతున్నారుు.

>
మరిన్ని వార్తలు