తమ్ముళ్ల డీలా

31 Mar, 2014 23:48 IST|Sakshi
తమ్ముళ్ల డీలా

మునిసి‘పోల్స్’లో ప్రజాతీర్పుపై పోస్టుమార్టం
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ ముందంజలో ఉందని, జనం ఆ పార్టీవైపే ఉన్నారని కొద్దిరోజులుగా  హంగామా చేసిన  తెలుగు తమ్ముళ్లు డీలా పడ్డారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపే ఉన్నట్టు పోలింగ్ సరళినిబట్టి విశ్లేషకులు స్పష్టం చేశారు. టీడీపీ అంచనాలు తల్లకిందులవడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది.

 పేదవాడల్లో జనం ఫ్యాన్‌వైపే ఉన్నట్టు వెల్లడి కావడం, మహిళల్లో అధిక శాతం మంది వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పోలింగ్‌లో పాల్గొనడంతో టీడీపీని నిస్సత్తువ ఆవహించింది. శనివారం వరకూ హడావుడి చేసిన నేతలంతా పోలింగ్ అనంతరం స్తబ్దుగా ఉండిపోయారు.

 ‘గోబెల్స్’ ప్రచారమే అస్త్రంగా...

 ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీ వ్యూహం ప్రకారం రకరకాల ప్రచారం చేస్తూ ప్రజల ముందుకెళ్లింది. తమకు తాము బలంగా ఉన్నట్లు ప్రచా రం చేసుకోవడంతోపాటు ప్రత్యర్థులను తక్కువ చేసి చూపించేందుకు అనేక రకాల ఊహాగానాలకు తెరలేపారు. చివరకు మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు తమదేనని భారీ ఎత్తున పందేలు కడుతున్నట్టు నటిస్తూ ప్రత్యర్థులను డోలాయమానంలో పడేసేలా మైండ్ గేమ్ ఆడారు.

 మరోవైపు పట్టణ ప్రాంతాల్లో యువత టీడీపీ వైపు ఆకర్షితుతున్నారనే ప్రచారాన్ని కూడా పెద్దఎత్తున చేరుుం చారు. వైఎస్సార్ సీపీ మాత్రం ఈ ప్రచారాలను పట్టించుకోకుండా ప్రణాళికాబద్ధంగా  పనిచేసింది. ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టుకోగలిగింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి టీడీపీ నేతలు, క్యాడర్ పందాలకు వెనుకాడారు. అప్పటివరకూ తామే గెలుస్తామని చెప్పిన వారంతా వైఎస్సార్ సీపీ గట్టి పోటీ ఇచ్చిందని చెబుతుండటం విశేషం.

 ఒక్కోచోట.. ఒక్కో రకంగా

 ఏలూరులో తొలినుంచీ టీడీపీ గాలి ప్రచారాలపైనే ఎక్కువగా ఆధారపడింది. 50 డివిజన్లకుగాను 32 డివి జన్లలో గెలుస్తామని ఒకటికి నాలుగిం తల పందేలు వేస్తామంటూ నాయకులు హడావుడి చేశారు. కానీ పోలింగ్ తర్వాత వారంతా కనిపించకుండాపోయారు. కొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ టీడీపీ 20కిపైగా డివిజన్లు గెలుచుకుంటుందంటూ పందేలకు ముందుకు వచ్చారు.

భీమవరం మునిసిపాల్టీలోనూ ఇదే తంతు నడిచింది. అక్కడ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అంజిబాబు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఇతర నేతల వల్ల టీడీపీకి అనుకూల పరిస్థితి ఉందని ఊకదంపుడుగా ఉపన్యాసాలు ఇచ్చినవారంతా ఇప్పుడు నోరుమెదపడం లేదు. తాడేపల్లిగూడెంలో రాజకీయంగా శత్రువులైన కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని, ఇతర నేతలంతా టీడీపీని భుజానవేసుకుని మునిసిపల్ ఎన్నికల్లో పోరా టం చేశారు. పట్టణంలో అన్ని పార్టీలు ఒకవైపు, వైఎస్సార్‌సీపీ ఒకవైపు ఉందని.. విజయం టీడీపీదేనని చెబుతూవచ్చారు.

 తీరా పోలింగ్ తర్వాత మునిసిపాల్టీని గెలుచుకుంటామని చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. తణు కు, కొవ్వూరుతోపాటు మిగిలిన అన్ని మునిసిపాల్టీల్లోనూ టీడీపీ నేతలు పోలింగ్ తర్వాత వెనక్కి తగ్గిపోయారు. దీనినిబట్టే మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలకు ఇట్టే అర్థమవుతోంది.

మరిన్ని వార్తలు