బారులు తీరిన ఓటర్లు

30 Mar, 2014 23:15 IST|Sakshi

తాండూరు టౌన్, న్యూస్‌లైన్ : తాండూరులో మున్సిపల్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఎండల తీవ్రత భయపడిన ఓటర్లు ఉదయం 7గంటల నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. పలువురు వృద్ధులు, జబ్బుపడిన వారు, వికలాంగులు వీల్‌చైర్లపై సహాయకులతో, ఆటోల్లో వచ్చి ఓటేశారు.
 
పలువురు యువతీయువకులు మొదటిసారి ఉత్సాహంగా ఓటు వేశారు. పలు కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్ధులకు పోలింగ్ స్టేషన్ లోపలికి  వెళ్లేందుకు అనుకూలంగా ర్యాంపులు ఏర్పాటు చేయకపోవడంతో ఒకింత ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం వరకు ఓటర్లతో కిటకిటలాడిన కేంద్రాలు ఆ తర్వాత వెలవెలబోయాయి. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత వచ్చిన పలువురు ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారు.
 
 చెదురుమదురు ఘటనలు...
 పోలింగ్‌కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి వరకు పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ పలువురు పరిధి దాటి వచ్చి ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అక్కడక్కడా లాఠీలు ఝళిపించారు. కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠ శాలలో తమ కుమారుడిని (12) పోలీసులు అకారణంగా కొట్టి పోలీ సుస్టేషన్‌కు తరలించారని తల్లి డీఎస్పీ షేక్‌ఇస్మాయిల్‌కు ఫిర్యాదు చేసింది. బాలున్ని వదిలిపెట్టడంతో గొడవ సద్దుమణిగింది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను సీజ్‌చేసి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంకు పోలీసు బందోబస్తు మధ్య తరలించారు.
 
అంతా ప్రశాంతం ..
చెదురుమదురు ఘటనలు తప్ప పోలిం గ్ ప్రశాంతంగా జరిగిందని ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. 5వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో  పక్కకు తీసుకెళ్లారన్నారు. 15వ వార్డుకు సంబంధించి మరోగంట సమ యం మిగిలి ఉందనగా 80శాతం పోలిం గ్ పూర్తయినట్లు తెలియడంతో పలువురు ఓటింగ్ తీరుపై అనుమానం వ్యక్తం చేశారన్నారు. సాయంత్రం 5గంటల వరకు 90 శాతం పోలింగ్ అవుతుం దని ఊహిం చిన పలు పార్టీల కార్యకర్తలు రీపోలింగ్ జరపాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారన్నారు. అంతకుముందు ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి  పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి